ideal
-
అసలైన టీచరమ్మ! అభాగ్యులకు ఆమె " పెద్దమ్మ"! రిటైరై కూడా..
టీచర్ అనే పదమే ఎంతో గౌరవనీయమైంది. ఇక ఆ వృత్తి చేసేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ఆ వృత్తే వారిని తెలియకుండా సేవ వైపుకి మళ్లీస్తుందో లేక వారి ఆలోచన స్థాయిలు అలా ఉంటాయో!. అచ్చం అలానే పదవివిరమణ చేసిన ఓ టీచరమ్మ విశ్రాంతి తీసుకోకుండా ఎందరో అభాగ్యులకు పెద్దమ్మగా, యువతకు ఓ గైడ్‌గా ఎన్నో సేవలు చేస్తూ అందరిచే మన్నలను అందుకుంటోంది. ఆమే గుర్రాల సరోజనమ్మ. ఇవరామె? ఏం చేసిందంటే.. గుర్రాల సరోజనమ్మది నిజామాబాద్ జిల్లా బోధన్. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే.. ఆమె భర్త వెంకట్రావు నిజాం షుగర్స్‌లో ఉద్యోగి. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేకున్నా మాకు పిల్లలు లేని లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. పాతికేళ్ల క్రితమే రిటైర్ అయ్యింది. ఆ వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. పింఛన్ వస్తోంది కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటుగా విధికి కన్నుకుట్టి భర్తను తీసుకుపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సరోజనమ్మ తోబుట్టువుల పిల్లలే తన పిల్లలు అన్యమనస్కంగా జీవిస్తోంది. వాళ్లొచ్చినప్పుడు తెగ సంబరపడేది. వాళ్లూ కూడా ప్రేమగానే ఉండేవారు ఆమెతో. కానీ ఆ ప్రేమలన్నీ.. నా ఆస్తి చుట్టూ తిరగడం నచ్చలేదు. ఇవన్నీ చూసి విసిగిపోయి.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నా. ఇలా ఆలోచిస్తుండగా మా ఉపాధ్యాయులు పడుతున్న బాధలే ఆమెను కదిలించాయి. విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకి సొంత భవనం లేదని తెలుసుకుంది. అందుకోసం.. ఆ సంఘానికి ఇంటిని రాసిస్తే మున్ముందు ఎందరికో సేవలు అందుతాయని విశ్వసించి మరీ ఆ ఇల్లు తన తర్వాత ఆ ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కిందటే రిజిస్ట్రేషన్ చేయించింది. ఇప్పుడూ ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు. ఇది తెలిశాక బంధువులు ఆమె దగ్గరకి రావడమే మానేశారు. ఆ రెండు ఘటనలకు పరిష్కారమే ధర్మస్థల్ ఓసారి దగ్గరి బంధువొకరు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లింది. ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. ఏంటని ఆరా తీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థులొకరు చనిపోతే.. వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఈ బాధలు తప్పడం లేదని అర్థమైంది సరోజనమ్మకు. ఈ పరిస్థితి అయినవాళ్లని బాధపెడుతుంది కదా! ఈ రెండు ఘటనలూ సరోజనమ్మను ఆలోచింప చేశాయి. ఇందుకు పరిష్కారంగా వెలిసిందే.. ‘ధర్మస్థల్’. ఇందులో చనిపోయినవారి మృతదేహాన్ని అంత్యక్రియలు జరిగేవరకు భద్రపర్చుకోవచ్చు. ఫ్రీజర్ సహా అన్ని సదుపాయాలనూ ఇక్కడ ఉచితంగా అందిస్తారు. ఈ నిర్మాణం ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించింది. చనిపోయాక మాట అటుంచితే... బతికున్న వాళ్ల ఆరోగ్యానికి భరోసా ఎవరు? అందుకే జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ట్రస్టు సభ్యులు ప్రారంభించిన జెనరిక్ మందుల దుకాణానికి ఆమె వంతుగా రూ. 2 లక్షలు విరాళమందించింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. అసలు ధరకే మందుల్ని అందివ్వడం ఈ ట్రస్టు ఉద్దేశం. దీనివల్ల మధ్యతరగతి, పేదవారికి ఎంతో ప్రయోజనం. రెంజల్‌లోని కందకుర్తి గోదావరి ఒడ్డున గోశాల నిర్మాణానికీ కూడా విరాళం ఇచ్చింది యువతకోసం నా వంతుగా.. ఒక టీచర్‌గా యువతని మంచి బాట పట్టించాలనే సదుద్దేశంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం ప్రభుత్వ గ్రంథాలయంలో రూ.20 వేల విలువైన పుస్తకాలను అందించింది. ఏడాదికోసారి చింతకుంట వృద్ధాశ్రమానికి వెళ్తుంంది. అక్కడున్న వృద్థులకు నిత్యావసరాల్ని, దుస్తుల్ని అందిస్తుంది. వీలుదొరికినప్పుడల్లా అవయవదానంపై ప్రచారం చేస్తుంది. తన మరణానంతరం దేహాన్ని ప్రయోగాలకు వినియోగించాలని ఆమోదపత్రం కూడా రాసిచ్చింది. మొదట్లో తనకెవరూ లేరునుకుని బాధపడేది. ఇప్పుడు ఈసేవ కార్యక్రమాలు ఎంతోమంది ఆప్తులను ఆమెకు దొరికేలా చేసింది. పైగా వారిచేత ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలిపించుకుంటుంది. నిజంగా ఆమె చాలా గ్రేట్. భర్త పోయి విశ్రాంతిగా ఉండాల్సినీ ఈ వయసులో ఎంతో చలాకీగా ఇలా సేవాకార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సరోజనమ్మ!. (చదవండి: బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..) -
'ఒకే భూమి ఒకే కుటుంబం.. ఈ స్ఫూర్తి ఉపనిషత్తులదే..'
ఢిల్లీ: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమున్నాయని చెప్పారు. ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని పేర్కొన్న ఆయన.. వాతావరణం, సుస్థిర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని జీ20 నాయకులకు పిలుపునిచ్చారు. జీ20కి హాజరవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. జీ20కి ఆహ్వానం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపిన గుటెరస్.. భారత్ సారథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించడం ప్రపంచ మార్పుకు సంకేతమని అన్నారు. గ్లోబల్ సౌత్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కావాల్సినంత చేస్తోందని చెప్పారు. ఉపనిషత్తుల నుంచి వచ్చిన వసుధైక కుటుంబం అనే పదం నేటి ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. #WATCH | G 20 in India | UN Secretary-General António Guterres says, "...One Family, One Earth, One Future - this phrase is inspired by the Maha Upanishad and finds profound resonance in today's world not just as a timeless ideal but as an indictment of our times. If we are… pic.twitter.com/cW6qwELreb — ANI (@ANI) September 8, 2023 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'పై దృష్టి పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. ఉపనిషత్తుల నుంచి ప్రేరణ పొందిన పదం నేటి ప్రపంచ సమస్యలకు సరైన పరిష్కారాలను సూచిస్తుంది. ప్రపంచంలో విభేదాలు, ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో ఈ స్ఫూర్తి అవసరం' అని గుటెరస్ అన్నారు. #WATCH | G 20 in India | UN Secretary-General António Guterres says, "...Let me begin by expressing my gratitude to India for the warm welcome and my hope that India's presidency at the G20 will help lead to the kind of transformative change our world so desperately needs in line… pic.twitter.com/7VFzfJWDA5 — ANI (@ANI) September 8, 2023 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భాగం కావడానికి భారతదేశం బలమైన పోటీదారుగా భావిస్తున్నారా అనే ప్రశ్నకు గుటెర్రెస్ స్పందిస్తూ.. "భద్రతా మండలిలో ఎవరు ఉండాలనేది నేను నిర్ణయించలేను. ఆ పని సభ్య దేశాలది. భారతదేశం నేడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ప్రపంచంలో భారతదేశ పాత్ర గొప్పది. వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి సంస్కరణ అవసరమని నేను నమ్ముతున్నాను.' అని గుటెరస్ అన్నారు. ఇదీ చదవండి: భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన చాలా ప్రత్యేకం: రిషి సునాక్ -
సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం అంతకంతకూ పెరిగిపోతోంది. 2015లో రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 279 మెగావాట్లు కాగా, ఇప్పుడది 4,390.48 మెగావాట్లకు చేరింది. 2020లో రాష్ట్రంలో స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 3,744 మెగా వాట్లుగా ఉంది. 2021లో దేశంలో 10 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని స్థాపిస్తే.. అందులో 50 శాతం ఏపీ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్టు అధ్యయనంలో వెల్లడైంది. చదవండి: బల్క్ డ్రగ్స్ పార్క్‌పై టీడీపీ విషం.. ఏపీకి పెట్టుబడులు అడ్డుకునేందుకు కుట్ర సోలార్ రూఫ్‌టాప్ ఇన్స్టలేషన్లు 2021లో 138 శాతం పెరగడంతో 2021–22 చివరి నాటికి 4,148.91 మెగావాట్లుగా నమోదైంది. ప్రస్తుత 2022–23 ఆరి్థక సంవత్సరంలో ఇప్పటికే సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 241.57 మెగా వాట్లు అదనంగా పెరిగింది. ఒక్కో మెగావాట్ నుంచి ఏటా సగటున దాదాపు 15 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో (జనవరి–జూన్) 47.64 బిలియన్ యూనిట్ల సౌర విద్యుదుత్పత్తి జరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో (మొదటి త్రైమాసికం) 22.22 బిలియన్ యూనిట్లుండగా, రెండో త్రైమాసికం(ఏప్రిల్, మే, జూన్)లో 25.41 బిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. అంటే తొలి త్రైమాసికం కంటే 14 శాతం పెరుగుదల రెండో త్రైమాసికంలో వచ్చింది. అదే 2021లో ఇదే సమయానికి జరిగిన ఉత్పత్తితో పోల్చితే 40 శాతం పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2030 నాటికి థర్మల్ విద్యుత్‌ను 32 శాతానికి తగ్గించాలని, కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నాకు తేవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్న ఏపీని కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపుతోంది. 2024 నాటికి అందరూ ఏపీనే అనుసరించాలని, వ్యవసాయానికి సౌర విద్యుత్‌నే వాడాలని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తాజాగా సూచించింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పర్యావరణ హితంగా విద్యుదుత్పత్తి సాధించగల సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 రివర్స్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులను స్థాపిస్తోంది. రానున్న 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రైతన్నకు హక్కుగా అందించాలని నిర్ణయించింది. దాని కోసం ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కోసం ఒప్పందం చేసుకుంది. – విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆర్థికంగా ఎంతో రక్షణ కల్పిస్తోందన్నారు. బుధవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఉచిత పంటల బీమాను అమలు చేయడం చరిత్రాత్మకమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తూ 26 రకాల పంటలకు బీమా వర్తిస్తోందన్నారు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ.. బీమా పరిహారం ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు నెలలోగా పంట నష్ట పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ), సీజన్ మారేలోగా పంటల బీమా పరిహారం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇది గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. 2016 ఖరీఫ్‌లో 16.36 లక్షల మంది రైతులు పంటల బీమా కోసం నమోదు చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 30.6 లక్షలకు పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా 2021 ఖరీఫ్‌లో నష్టపోయిన 15.60 లక్షల మంది రైతులకు 2022 ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్లు పరిహారం జమ చేశామన్నారు. ఉల్లి, టమాట, దానిమ్మతోపాటు చిరుధాన్యాల పంటలను కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ఇంకా అర్హులుంటే ఆర్బీకేలను సంప్రదించాలి.. పంటలు నష్టపోయిన అర్హుల జాబితాను ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకంగా రూపొందించినట్టు వివరించారు. బీమా పరిహారం అందని అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే 15 రోజుల్లోగా ఆర్బీకేల్లో గానీ గ్రామ సచివాలయాల్లో సంప్రదిస్తే విచారించి పంట నష్ట పరిహారాన్ని అందిస్తామన్నారు. రెండు రకాలుగా నోటిఫైడ్ పంటలకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. ఇందులో దిగుబడి ఆధారిత పంటలు నష్టపోయిన 8,47,759 మంది రైతులకు రూ.2,143.85 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలు నష్టపోయిన 7,12,944 మంది రైతులకు రూ.833.97 కోట్లు జమ చేశామన్నారు. గతంలో ప్రైవేటు సంస్థల వల్ల రైతులకు సరైన పరిహారం దక్కేది కాదని, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో పంటల బీమా ప్రీమియానికి దూరంగా ఉండేవారన్నారు. ఇప్పుడు ఈ–క్రాప్ నమోదు సమయంలోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. తగ్గిన రుణ ఎగవేతలు.. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు అన్ని రకాల సేవలను అందిస్తూ వ్యవసాయ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున అందుతున్న సంక్షేమ పథకాలతో రుణ ఎగవేతలు బాగా తగ్గినట్టు ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు కితాబు ఇచ్చారన్నారు. పంటల విస్తీర్ణంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ గణనీయంగా వృద్ధి నమోదైందన్నారు. క్రాప్ హాలిడే కాదు.. మూడు పంటల ముందస్తు జోరు.. రాష్ట్రంలో రైతులకు మేలు జరిగేలా ముందస్తుగా నీటిని విడుదల చేసి మూడు పంటలు సాగయ్యేలా ప్రోత్సహిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. క్రాప్ హాలిడేకు అవకాశం లేదన్నారు. మూడు పంటలు వస్తే రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా నేల సారవంతం అవుతుందన్నారు. గత నాలుగేళ్లలో రైతుల మరణాలు రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. కోనసీమ డెల్టా చివరి ప్రాంతాలకూ నీరందేలా జలవనరుల శాఖతో సమన్వయం చేసుకుని కాలువల మరమ్మతులు, పూడికతీతపై దృష్టి సారించామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. గతంలో ఆలస్యంగా పంటలు వేయడంతో తుపాన్లతో పంట నష్టపోవడమేగాక మూడో పంటకు అవకాశం ఉండేది కాదన్నారు. -
గృహ నిర్మాణంలో దేశానికే ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’కు సంబంధించి ఇంధన శాఖ చేపడుతున్న పనుల ప్రగతిపై ఆదివారం అజయ్ జైన్, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌లు మూడు డిస్కంల సీఎండీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా 28.30 లక్షల ఇళ్లను రెండు దశల్లో నిర్మిస్తున్నట్టు అజయ్ జైన్ చెప్పారు. ఆ ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం రూ.34,109 కోట్లు వెచ్చిస్తోందన్నారు. పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం దేశంలోనే లేదన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తిచేయాలని గడువు విధించినట్టు అజయ్ జైన్ చెప్పారు. విద్యుదీకరణకు రూ.7,080 కోట్లు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి చెప్పారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లే అవుట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లే అవుట్లకు భూగర్భ విద్యుత్‌ను అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా డిస్కంల సీఎండీలు హరనాథరావు(ఏపీఎస్పీడీసీఎల్), పద్మాజనార్దనరెడ్డి(ఏపీసీపీడీసీఎల్), సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్)లు మాట్లాడుతూ ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి రూ.1,32,284 ఖర్చవుతుందని తెలిపారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లే అవుట్లలో మొత్తం విద్యుదీకరణకు రూ.2,368 కోట్లు, 550 కంటే ఎక్కువగా ఉన్న లేఅవుట్లలో రూ.3,628 కోట్లు ఖర్చవుతుందన్నారు. 389లే అవుట్లకు భూగర్భ, 9,678 లే అవుట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నట్టు వారు వివరించారు. -
అలా ఉన్న చారిత్రక ఆలయాలను ఇలా మార్చారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చారిత్రక ప్రాంతాలు ఎన్నో! వేల ఏళ్ల నుంచి నిజాం కాలం వరకు నిర్మితమైన ఆలయాలకు కొదవలేదు. అద్భుత నిర్మాణకౌశలంతో అబ్బురపడేలా రూపుదిద్దుకుని అలరిస్తున్నాయి. కానీ, చాలా ఆలయాలు తీవ్ర నిరాదరణకు గురై జీర్ణావస్థకు చేరుకున్నాయి. వాటికి పూర్వవైభవం తెచ్చే దిశగా తెలంగాణ వారసత్వశాఖ అడుగులు వేసిన దాఖలాల్లేవు. అయితే ప్రభుత్వం కల్పించుకుంటే తప్ప అవి బాగు కావన్న భావనను పక్కన పెట్టి.. ఓ గ్రామ ప్రజలు ఆలయాలకు కొత్తశోభను తెచ్చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. సరిగ్గా ప్రపంచ పర్యాటక దినోత్సవం(ఈ నెల 27న) వేళ గ్రామస్తులు ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ల సహకారంతో శ్రమదానం చేసి ఆ ఊరు ఇప్పుడు కొత్తమార్గం చూపుతోంది. ఆ ఊరు నాగర్‌కర్నూలు జిల్లాలోని నందివడ్డెమాన్ గ్రామం. చేయిచేయి కలిపి శ్రమదానం చేసి.. నందివడ్డెమాన్ గ్రామంలో పదికిపైగా పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో శివాలయం, త్రిమూర్తుల ఆలయంతోపాటు ఐదు గుళ్లను నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ ప్రతినిధులు ఎంపిక చేసుకున్నారు. ఆ సంస్థకు చెందిన కృష్ణంరాజుతోపాటు 30 మంది ప్రతినిధులు, ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరిరెడ్డిలు ఆదివారం ఆ గ్రామానికి వెళ్లి యువకులతోపాటు సర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ ఊషన్న, ఉపసర్పంచ్ శంకర్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వసాయం కోసం ఎదురుచూడకుండా ముందుకు రావాలని సూచించటంతో యువకులు సుముఖత వ్యక్తం చేశారు. అందరూ శ్రమదానం చేసి ఐదు ఆలయాలను శుభ్రం చేసుకుని ముస్తాబు చేశారు. ఇలా మరిన్ని ఊళ్లను కూడా గుర్తించి ఆలయాలను పరిరక్షిస్తామని నిర్వాహకులు తెలిపారు. భద్రకాళి ఆలయం.. నాడు- నేడు అది గోన వంశీయుల రాజధాని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ క్రీ.శ.12, 13 శతాబ్దాల్లో కాకతీయ సామంతులైన గోన వంశీయులకు వర్ధమానపురం రాజధానిగా విలసిల్లిందని, రంగనాథ రామాయణం రాసిన గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి, గోన విఠల్‌రెడ్డిలు ఈ గ్రామం వారేనని పేర్కొన్నారు. జైనమత కేంద్రంగా వర్ధమాన మహావీరుడి ఆలయం ఉన్నందున ఈ ఊరికి ఆ పేరువచ్చిందని వివరించారు. అయితే కాలక్రమంలో ఆ ఊరు పేరు నందివడ్డేమాన్‌గా మారి ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆయా దేవాలయాలను పరిరక్షించుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. -
దేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) తెలిపారు. అర్హులైన దళితుందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామన్నారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు శనివారం ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి సమావేశంలో మాట్లాడారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతుందని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని, దళిత ప్రజా ప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
అపురూపం.. ఈ జంట వివాహం
సాక్షి, చెళ్లకెరె రూరల్(కర్ణాటక) : వినికిడి లోపంతో పాటు మాటలు రాని ఓ జంట ఆదివారం వివాహం ద్వారా ఒక్కటయ్యారు. తాలూకాలోని సిద్దా పుర గ్రామానికి చెందిన మంగళమ్మ, మంజునాథ్ దంపతుల కుమార్తె సౌమ్య, దావణగెరెకు చెందిన యమునమ్మ మంజణ్ణ దంపతుల కుమారుడు పరశురామలు పెద్దల సమక్షంలో ఒక్కటవ్వానుకున్నారు . ఈ క్రమంలో, ఆదివారం కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహం చేసుకున్నారు. వీరికి మాటలు రావు, వినపడవు. నూతన దంపతులను పెద్దవాళ్లందరు ఆశీర్వదించారు. ఒకరి మనసును మరొకరు తెలుసుకుని అన్యోన్యంగా ఉండాలని పెద్దవాళ్లు ఆశీర్వదించారు. వీరి పెళ్లి పలువురికి ఆదర్శంగా నిలిచింది. చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర.. -
సర్పంచ్ అయినా.. కుల వృత్తి వీడలే..
సాక్షి, కోటపల్లి(చెన్నూర్): ఏదైనా పదవి రాగానే కులవృత్తిని పక్కనబెట్టివారిని చూస్తున్నాం.. పదవి పోగానే అయిష్టంగానైనా.. మళ్లీ తమ వృత్తిని కొనసాగించేవారిని చూశాం. కానీ.. ఈయన మాత్రం ఓ గ్రామానికి సర్పంచ్ అయినా కులవృత్తిపై మాత్రం మమకారం వీడలేదు. ఉదయాన్నే లేవగానే ఎప్పటిలాగే ప్రజలకు క్షౌ వరం.. షేవింగ్ చేస్తున్నాడు. ఎలాంటి మొహమాటం లేకుండా తన పనిని సాఫీగా చేసుకుంటూపోతున్నాడు కోటపల్లి మండలం లింగన్నపేట పంచాయతీ సర్పంచ్ దాగామ రాజు. రాజు ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎల తన కులవృత్తి చేసుకున్నారో.. ఇప్పుడూ అలాగే తన కులవృత్తిని వదలకుండా గ్రామంలోని చిన్నాపెద్దా తేడా లేకుండా క్షౌవరాలు చేస్తున్నాడు. రాజును చూసి ప్రజలు ‘ఆదర్శంగా నిలుస్తున్నారు..’ అంటూ కితాబునిస్తున్నారు. -
లెక్కలు నేర్చుకుని.. రెక్కలు కట్టుకుని..!
ఊరు కాని ఊరు.. చివరిదాకా తోడుగా నిలుస్తానని బాస చేసి పెళ్లి చేసుకున్న భర్త నలుగురు పిల్లలు పుట్టాక వారి మానాన వారిని వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు.. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో కష్టాల కడలిని ధైర్యంగా ఈదుతూ ముందుకు సాగుతోందామె. ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమె రెక్కలు ముక్కలు చేసుకునేలా కష్టపడుతున్నప్పటికీ బ్యాంకర్లు రుణమిచ్చి చేయూతనిచ్చేందుకు నిరాకరించగా, మరోవైపు స్వయం సహాయక పొదుపు గ్రూపుల్లోనూ ఆమెను చేర్చుకోలేదు. అయినప్పటికీ అన్ని బాధలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది ‘సవిడిబోయిన వెంకాయమ్మ’. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన వెంకాయమ్మ ఎవరిపై ఆధారపడకుండా గత 16 ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 30 కిలోమీటర్లు సైకిల్‌పై తిరుగుతూ వస్త్రాలు అమ్ముకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వెంకాయమ్మ 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయిన 16 రోజులకే భర్త వెంకటేశ్వరరావుతో కలిసి సీతానగరం వచ్చింది. వెంకటేశ్వరరావు ఊరూరూ తిరిగి స్టీలుగిన్నెలు అమ్మే వ్యాపారం చేసేవాడు. ఇక్కడే వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే 16 సంవత్సరాల క్రితం భర్త వెంకటేశ్వరరావు వెంకాయమ్మను, నలుగురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా వెంకాయమ్మపై కోలుకోలేని భారం పడింది. నిరక్షరాస్యురాలైన వెంకాయమ్మకు తూకాలు, కొలతలు సరిగా తెలియక పోవడంతో భర్త చేసిన స్టీలు గిన్నెలు అమ్మే వ్యాపారం జోలికి పోకుండా వస్త్రాలు అమ్ముకునే పని మొదలుపెట్టింది. అలా మూడేళ్ల పాటు వస్త్రాల మూటలు నెత్తిన పెట్టుకుని చుట్టుపక్కల ఊర్లలో తిరిగి అమ్ముకునేది. దీంతో మాడు నొప్పి విపరీతంగా బాధించేది. ఇలా లాభం లేదని కష్టపడి సెకిల్ తొక్కడం నేర్చుకుంది. ఈ క్రమంలో అనేక దెబ్బలు తగిలినా పిల్లల కోసం అన్నింటినీ మౌనంగా భరించి సైకిల్‌పై తిరుగుతూ వస్త్రాలు అమ్మడం ప్రారంభించింది. రాత్రి బడికి వెళ్లి అక్షరాలు, అంకెలు నేర్చుకుంది వెంకాయమ్మ. 43 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా సైకిల్‌పై రోజూ 30 కిలోమీటర్లకు పైగా తిరుగుతూ జీవనపోరాటం చేస్తోంది. గ్రామాల్లో కూలీలు పనులకు వెళ్లకముందే వెళ్లి వస్త్రాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండడంతో తెల్లవారుజామునే సైకిల్ మీద బయటకు వెళ్లి చుట్టుపక్కల 10 నుంచి 15 ఊర్లు తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వస్తుంది. మధ్యలో వరికోతలు, కలుపులు, ఇతర వ్యవసాయ కూలీ పనులకు సైతం వెళ్లేది. పైగా ఆడపిల్లలనే తేడా లేకుండా కుమార్తెలిద్దరి చదువులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది వెంకాయమ్మ. పిల్లలు ప్రయోజకులయ్యారు పెద్దకుమార్తె నాగలక్ష్మిని బీఎస్సీ నర్సింగ్ చదివించింది. నాగలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఉద్యోగం చేస్తోంది. రెండో కుమార్తె శ్రీలతను ఈసీఈ విభాగంలో డిప్లొమా చదివించింది. శ్రీలత ప్రస్తుతం హైదరాబాద్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. మూడో సంతానమైన సందీప్ ఐటీఐ పూర్తి చేసి ప్రస్తుతం ఓపెన్ డిగ్రీ చదువుతున్నాడు. నాలుగో సంతానం చంద్రకిరణ్ 9వ తరగతి వరకు చదివి తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. బ్యాంకర్ల చిన్నచూపు కష్టాన్నే నమ్ముకున్న వెంకాయమ్మకు రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. రెండేళ్ల క్రితం వరకు రోడ్డు పక్కన ఆర్అండ్బీ స్థలంలో వేసుకున్న చిన్న గుడిసెలో వీరి కుటుంబం నివాసం ఉండేది. అయితే పక్కనే ఉన్న పొలం యజమాని ఖాళీ చేయించడంతో తల్లి ఏగమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి ఊరి చివరన కొద్దిపాటి స్థలం కొని, ఆ భూమిలో రేకులషెడ్డు వేసుకుంది. ప్రస్తుతం వెంకాయమ్మ అక్కడే ఉంటున్నారు. పిల్లలను చదివించడానికి, ఇంటి కోసం చేసిన అప్పులు తీరకపోగా ఇప్పటికీ వడ్డీలు కడుతున్నారు. రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగితే తిరిగి అప్పు ఎలా తీరుస్తావంటూ ఎద్దేవా చేసి తన దరఖాస్తును నిరాకరించినట్లు చెప్పింది. అదేవిధంగా మహిళలు డబ్బులు పొదుపు చేసుకునే స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా) గ్రూపుల్లోనూ తనను చేర్చుకోలేదని వాపోయింది. ఆడపిల్లలకు వివాహం చేయాల్సిన నేపథ్యంలో అన్ని కష్టాలనూ భారంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోన్న వెంకాయమ్మ చిన్న చిన్న సమస్యలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది. -
గురుదేవుడి మహాత్ముడు
రవీంద్రనాథ్ టాగోర్ గాంధీజీని ‘మహాత్ముడు’ అన్నాడు.ఆయన ఇచ్చిన ఆ గౌరవ సంబోధనను జాతి స్వీకరించడంతో గాంధీ ‘మహాత్మా గాంధీ’ అయ్యాడు.టాగోర్ని గాంధీజీ ‘గురుదేవ్’ అన్నాడు.అప్పటి నుంచి టాగోర్ అనే పేరుకు ‘గురుదేవ్’ సమానార్థకం అయ్యింది.టాగోర్, గాంధీజీ ఆత్మీయులు. పరస్పరం సత్యాన్ని అన్వేషించినవారు. సత్యాన్వేషణ కోసం పరస్పరం ఘర్షించుకున్నవారు.గురు దేవుని దృష్టి నుంచి మహాత్ముడిని చూసినప్పుడు మామూలు మనుషులుగా మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది.పాలకులు, యువత, ప్రజలు మహాత్ముడి ఆత్మధోరణిని సంపూర్తిగా అక్కర్లేదు... సహస్రాంశం అనుసరించినా ఈ దేశం సర్వోన్నతం అవుతుందనిపిస్తుంది.గురుదేవులు టాగోర్ వివిధ సందర్భాలలో గాంధీజీని ఉద్దేశించి అన్న మాటలు ఇవి. మహాత్ముడంటే గాంధీజీని నేను మహాత్ముడని అన్నాను. ఆ మాటకు నిజమైన అర్థమేమిటి? ఎవరి ఆత్మ అయితే విముక్తి చెంది అన్ని ఆత్మల్లోనూ దర్శనమిస్తుందో ఆ ఆత్మ కలిగినవాడే మహాత్ముడు. ఆ అర్థంలో గాంధీజీ మహాత్ముడు. మహాత్ముల కార్యకలాపాలు ఒకరి కోసమో ఇద్దరి కోసమో కావు. అవి మొత్తం ప్రపంచమంతటి కోసం. వాటికి పరిమితులేమీ లేవు. నిర్బంధాలు లేవు. అవి మొత్తం విశ్వం కోసం. గాంధీజీ కార్యకలాపాలు ఒక కులం మతం జాతి కోసం కాదు. అవి సకల మానవాళి కోసం. అందుకే ఆయన మహాత్ముడు. స్వీయ సేవను చేసుకోగలమా? మహాత్మునికి ఉన్న స్వీయ క్రమశిక్షణ మనలో ఎంతమందికి ఉంది... ఎప్పటికైనా ఆ క్రమశిక్షణను వదలకుండా ఆచరించదగ్గ చిత్తశుద్ధిని పొందగలమా చూసుకోవాలి. ఒకసారి మార్చి నెలలో గాంధీజీ శాంతినికేతన్లో కొద్ది రోజులు గడిపారు. దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టుకున్న నియమావళికి అనుగుణంగా శాంతినికేతన్లో కూడా ఆయన ఏ సేవకుడి సహాయమూ కోరలేదు. తన గది తనే తుడుచుకున్నాడు. తన పక్క తనే సర్దుకున్నాడు. తన గిన్నెలు తనే కడుక్కున్నాడు. తన గుడ్డలు తనే ఉతుక్కున్నాడు. శాంతినికేతన్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇది చూసి ప్రభావితులయ్యారు.వాళ్లల్లో చాలామంది గాంధీని అనుసరించాలని ఆరాటపడ్డారు. మార్చి 10వ తేదీన ఒక ప్రయత్నంగా విద్యార్థులు వంటవాళ్ల పనివాళ్ల పాకీవాళ్ల సేవల్ని పక్కన పెట్టేశారు. ఇదంతా గాంధీజీ పర్యవేక్షణలో జరిగింది. కాని కొన్నాళ్లకు కొన్ని ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఈ స్వీయ సేవను విడిచిపెట్టారు. కాని గాంధీజీ విడిచిపెట్టలేదు. విడువక పోవడమే మహాత్ముల లక్షణం. ఆయన త్యాగమూర్తి చాలామంది ప్రజానాయకులు త్యాగాలు చేస్తుంటారు. కాని అవి రేపు తాము పొందబోయే ఆకర్షణీయమైన లాభాలకు పెట్టుబడి అని భావిస్తారు. గాంధీజీ అందుకు విరుద్ధం. ఆయన త్యాగానికి మరోపేరు. ఆయన ఎట్లాంటి అధికారాన్నిగాని పదవినిగానీ సంపదనుగానీ పేరునుగానీ కీర్తిగానీ కోరుకోలేదు. కోరుకోరు. మొత్తం భారతదేశ సింహాసనాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయన స్వీకరించడు. పైగా ఆ సింహాసనానికున్న వజ్రాలను ఒలిచి పేదలకు పంచి పెట్టేస్తాడు. అమెరికాలో ఉన్న డబ్బంతా ఆయనకు ఇస్తే దానిని మానవాళిని ఉద్ధరించడానికి పనికొచ్చే ఏదో ఒక పనికి ఖర్చు పెట్టేస్తాడు. ఇతరులకు ఏదైనా ఇవ్వడం కోసమే ఆయన ఆత్మ ఎప్పటికీ ఆరాటపడుతూ ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా ఆయనేదీ ఆశించడు. చివరకు కృతజ్ఞతలు కూడా. ఆయనది క్రీస్తు ప్రభావం నన్నెవరన్నా గొంతు నులమబోతే నేను సహాయం కోసం అరుస్తాను. కాని గాంధీజీకి ఆ పరిస్థితి ఎదురైతే ఆయన సహాయం కోసం అరవడని కచ్చితంగా చెప్పగలను. తన గొంతు నులిమేవాడిని చూసి ఆయన చిరునవ్వు నవ్వుతాడు. తాను మరణించవలసి వస్తే చిరునవ్వుతోనే మరణిస్తాడు. క్రీస్తు ప్రభావం అని మనం దేన్నయితే అంటామో అది ఆయనకుంది. ఆయన గురించి ఎంత తెలుçసుకుంటే అంత ప్రేమించగలుగుతాం. చెడును ద్వేషించాలి... చెడ్డవారిని కాదు మనం ద్వేషించవలసింది చెడును తప్ప చెడ్డవారిని కాదని మహాత్ముడు చెప్పాడు. దీనిని పాటించడం అసాధ్యం అనిపిస్తుంది. కాని దాన్నాయన తన జీవితంలో పాటించడం నేను చూశాను. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిష్కరించిన ఒక ప్రసిద్ధ రాజకీయవేత్తతో ఆయన మాట్లాడుతుండగా నేనక్కడున్నాడు. ఆ పెద్దమనిషితో మాట్లాడుతున్నది వేరే కాంగ్రెస్ నాయకుడైతే ఆ నాయకుడు ఆ పెద్దమనిషిని చాలా ఏహ్యభావంతో చూసి ఉండేవాడు. కాని గాంధీజీ అలా చేయలేదు. అతడు చెప్తున్నది సహనంతో సానుభూతితో పూర్తిగా విన్నాడు. అతన్ని కించపరిచే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. అది చూసి నేను ‘గాంధీజీ తాను ప్రవచిస్తున్న సిద్ధాంతాల కన్నా ఉన్నతుడు’ అని అనుకున్నాను. ముందు తన మీదే.... మహాత్ముడు సమాజం కోసం ఒక ప్రయోగాన్ని ప్రతిపాదించే ముందు ఆ కఠిన పరీక్షని తన మీద తాను విధించుకుంటాడు. త్యాగం కోసం ఎదుటివాళ్లకు పిలుపునిచ్చేముందు తనే స్వయంగా దాని మూల్యం చెల్లిస్తాడు. ముందు ఆయన తన సౌకర్యాలని వదులుకుని తక్కినవాళ్లను త్యాగం చేయమనడానికి సాహసిస్తాడు. ఒక చెడు విజయం కోసం ఆత్మను తాకట్టు పెట్టుకోవడం కన్నా సర్వం కోల్పోవడమే మంచిదనేది గాంధీజీ ఆదర్శం. ఈ ఆదర్శాన్ని రాజకీయాలలో ఆయన బలంగా ప్రతిపాదించాడు. ఇందుకు మనం మహాత్మాగాంధీని గౌరవించుకోవాలి. అవమానాన్ని ధైర్యంగా సహిస్తూ బాధను సహిస్తూ కూడా మనం తిరిగి హింసకు పూనుకోకపోతే మన మీద పీడన చేసే వారు తెల్లముఖం వేసి అశక్తులవుతారని ఆయన నేతృత్వంలో భారతదేశం ప్రతిరోజూ నిరూపిస్తూనే ఉంది. ఆ మనిషి నిజంగానే దేవదూత.ఆయనను మనం మహాత్ముడని పిలుచు కోవడం సముచితం. ఆయన నివసిస్తున్నది ఒక వ్యక్తిగత, సంకుచిత శరీరంలో కాదు. ఈరోజు భారతదేశంలో జన్మించిన రేపు జన్మించనున్న లక్షలాది ప్రజా హృదయాలలో ఆయన నివసిస్తున్నాడు. -
మనసున్న మేడమ్
అందరమూ మనుషులమే, మామూలు మనుషులమే. బస్‌లో ప్రయాణిస్తూ కారులో వెళ్లే వాళ్లను చూస్తాం, చిన్న కారులో వెళ్తూంటే పెద్ద కార్ల వంక చూస్తాం. అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంటి గురించి ఆలోచిస్తాం. సొంత ఫ్లాట్‌లో ఉంటే ఇండిపెండెంట్ హౌస్ గురించి ఆలోచిస్తాం. వందమందిలో ఎనభై మంది ఇలా ఆలోచిస్తే... ఓ ఇరవై మంది ఇందుకు భిన్నంగా ఆలోచించే వాళ్లుంటారు. సీమ కూడా అలా భిన్నంగా ఆలోచించే మనిషే. సీమ ఇంటి నుంచి కాలు బయటపెడితే ప్రభుత్వ వాహనం సిద్ధంగా ఉంటుంది. కలెక్టర్‌కు అందినంత గౌరవం కలెక్టర్ భార్యగా ఆమెకూ అందుతుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువగా కూడా. అయితే ఆమె దృష్టి గౌరవ వందనాలను దాటి సమాజపు లోతులను తాకింది. ఒకరోజు రోడ్డు మీద కారులో వెళ్తున్న సీమ రోడ్డు పక్కన బొమ్మలు అమ్ముకునే పిల్లలను, కారు అద్దాలు తుడిచి చెయ్యి చాచే పిల్లలను, డొక్కలు ఎండిపోయి, చింపిరి జుత్తుతో బిక్క ముఖాలు వేసుకుని ఉండే పిల్లలను చూసింది. చేతిలో పడ్డ పైసలతో రోడ్డు పక్కనే దొరికినది కొనుక్కుని ఆ దుమ్ములోనే తింటున్న పిల్లలను చూసి ‘ఎవరి బాల్యమూ ఇలా ఉండకూడదు. పువ్వులాంటి బాల్యం వికసించకుండానే వాడి రాలిపోకూడదు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, ఆ పేదరికాన్ని వాళ్ల నుంచి దూరం చేయాలని ఎవరూ అనుకోకపోవడమే తప్పు’ అనుకుంది. కారు దిగి వాళ్ల దగ్గరకు వెళ్లింది. ఆమె కంటపడిన వారినందరినీ బంగ్లాకు తీసుకెళ్లింది. వాళ్లకు మంచి భోజనం పెట్టి, దుస్తులు తెప్పించి ఇచ్చింది. ఒక గదిని ఈ పిల్లల కోసమే కేటాయించి వాళ్లకు చదువు చెప్పడం మొదలు పెట్టింది. అలా పాతిక మంది పిల్లలు అయ్యారు. సీమ లక్నోలో ఐఏఎస్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ భార్య. అన్నం పెట్టి చదువు చెబుతుంది ఆమె చేస్తున్న సర్వీస్ చూసిన ఆమె భర్త జితేందర్ కుమార్ సీమ కోసం ఒక కారును, డ్రైవర్‌ను ఇచ్చాడు. ఆ డ్రైవర్ రోజూ ఆ పిల్లలు నివసించే వాడలకు వెళ్లి వాళ్లను కారులో ఎక్కించుకుని కలెక్టర్ బంగ్లాకు తీసుకువస్తాడు. ఆ పిల్లలందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కలెక్టర్ బంగ్లాలోనే. పగలంతా చదువుకుంటారు, గార్డెన్లో ఆడుకుంటారు. సాయంత్రం డ్రైవర్ తిరిగి వాళ్లను ఇళ్ల దగ్గర దించుతాడు. పిల్లలు కూడా సంతోషంగా వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కలెక్టర్ గారి భార్య కావడంతో ధైర్యంగా పంపిస్తున్నారు. ఇతర ఎన్జీవోలు ఇలాంటి పని చేయడానికి ముందుకు వచ్చినా కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొనడం పెద్ద సమస్య అయ్యేది. మేడమ్ మాత్రమే కాదు.. అమ్మ కూడా సీమ ఆలోచన ఇప్పుడు ఒక్కటే. ఆ పిల్లలందరినీ స్కూళ్లలో చేర్చాలి. అందరికీ కలిపి ఆమె ప్రాథమికంగా చదువు చెప్పగలుగుతోంది. కానీ పెద్ద క్లాసులకు సబ్జెక్టుల వారీగా అన్నీ చెప్పడం ఒకరితో అయ్యే పని కాదు. వాళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ప్రధాన స్రవంతిలో చదువుకోవాలనేది ఆమె కోరిక. వాళ్లంతా ప్రయోజకులైతే రేపటి తరంలో సమాజంలో పాతిక కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగవుతాయంటారామె. సీమ మేడమ్ మాకు టీచరే కాదు, అమ్మతో సమానం అంటున్నాడు ఆమె పెంపకంలో ఉన్న ఆదిత్య. – మంజీర -
భక్తితో ఆరోగ్యం.. ఆయుష్షు!
ఆధ్యాత్మిక భావనలతో ఉంటూ, బోధలు, సేవలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు మిగిలిన వారితో పోలిస్తే ఓ నాలుగైదేళ్లు ఎక్కువకాలమే జీవిస్తున్నారని పాశ్చాత్య దేశాలలో జరిగిన తాజా పరిశోధననలో వెల్లడయింది! ప్రపంచ గమనం వేగంగా మారింది. ఏదో సాధించాలనే తపన, ఎక్కడికో వెళ్లాలన్న హడావిడి.. ఏదో చేసేయాలన్న ఆత్రుత, తలపెట్టిన పని సవ్యంగా జరుగుతుందో లేదోనన్న ఆందోళన.. ఫలితంగా రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, వాతం వంటి రుగ్మతలు కమ్ముకొస్తాయి. దానికి తోడు నిర్వేదం, నిరాశ, మానసిక ఒత్తిడి మనిషిని మరింతగా కుంగదీస్తాయి. ఈ దౌర్బల్యం మనస్సును అంటకుండా ఉండడానికే యోగులు, రుషులు ధ్యానం చేసేవారు. ఈ సత్యాన్ని తెలుసుకున్న ఆధునికులు కూడా ఇప్పుడు యోగ, ధ్యానం చేయడాన్ని, ఆధ్యాత్మిక భావాలతో జీవించడాన్నీ అలవరచుకున్నారు. తద్వారా ఆయుష్షును పెంచుకోగలుగుతున్నారు. ఎందుకంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగ సాధన చేసేవారు శరీరాన్నే కాదు, మనస్సును కూడా అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. ‘యోగ’సాధన వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. చేసే పనిపై ఇష్టం, ఆసక్తి పెరుగుతాయి. శరీరం బరువు తగ్గి, చురుకుదనం ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు ముఖ్యంగా, రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పుల వంటివి దరిచేరవు. వైద్యశాస్త్రానికి కూడా అంతుచిక్కని కొన్ని సమస్యలకు యోగ, ధ్యానం పరిష్కారం చూపుతున్నాయి. యోగ సాధనలు మనస్సు, భావాలను నియంత్రించడానికి సాయపడతాయి. తద్వారా గర్వం, ఈర్ష్య, అసూయ, కోపం, వ్యామోహం వంటి భావాలు నశించి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఆరోగ్యంగా ఉండేవారి ఆయుఃప్రమాణం ఎలాగూ మిగతావారితో పోలిస్తే అంతో ఇంతో అధికంగానే ఉంటుంది. దాంతో ధ్యానం, యోగం, ఆధ్యాత్మిక సాధనలు కేవలం కొన్ని వర్గాలకు లేదా దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. పాశ్చాత్య దేశాలకు సైతం పాకిపోయాయి. అందుకే కాబోలు, ఇంచుమించు అన్ని దేశాలలోనూ వివిధ యోగా పద్ధతులు, ఆధ్యాత్మిక బోధనలు విభిన్న రకాల వ్యక్తిత్వ వికాస పాఠాల దిశగా ఊపిరి పోసుకుంటున్నాయి. అయితే, ఇక్కడ ఆధ్యాత్మికత అనేదానిని మనం ఎలాగైతే మానవ సేవే, మాధవ సేవ అని అంటున్నామో, అక్కడి వారు కూడా సామాజిక సేవగా మార్చుతున్నారు. బిల్‌గేట్స్, రాక్ఫెల్లర్ వంటి వారు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సామాజిక సేవకు ప్రాణం పోస్తున్నారు. అమెరికా, బ్రిటన్లలో కొన్ని తాజా సర్వేలలో తేలినది ఏమంటే, ఆధ్యాత్మికంగా ఉంటూ, బోధలు, సేవలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు మిగిలిన వారితో పోలిస్తే ఓ నాలుగైదేళ్లు ఎక్కువకాలమే జీవిస్తున్నారట. అన్నింటికీ ఆ భగవంతుడే అండగా ఉన్నాడు అనే భావనే వారిలో ఆయుష్షు పోస్తోందేమో మరి! – డి.వి.ఆర్. -
అమ్మాయిలూ.. చలో
ప్రయాణాలు ఎదుగుదలకు తోడ్పతాయి. కెరియర్లోనే కాదు, మనిషిగా కూడా ఎదుగుతాం! ఎదిగాక చేయవలసిన ప్రయాణాలు కొన్ని ఉంటాయి. అవి ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. ఆహ్లాదం కలిగిస్తాయి. ఆదర్శవంతంగా ఉంటాయి.పెద్దపెద్ద హోదాల్లోని మహిళలు కొందరుఎప్పుడూ ప్రొఫెషనల్ ట్రిప్పుల్లో ఉంటారు. వాళ్ల ట్రిప్ స్టెయిల్లో మనకు పనికొచ్చే టిప్స్ ఇవి. ఫర్జానా హక్ (ముంబై) హెడ్, యూరప్ టెలికామ్ బిజినెస్ యూనిట్గ్లోబల్ హెడ్, స్ట్రాటెజిక్ గ్రూప్ అకౌంట్స్, టి.సి.ఎస్.టాటా గ్రూప్‌లో ట్రైనీగా చేరి, ఉన్నతస్థాయికి ఎదిగిన ఫర్జానా ఏడాదికి 180 నుంచి 200 రోజులు ప్రయాణాల్లోనే ఉంటారు. ఎక్కువగా ఐరోపా దేశాలకు ప్రొఫెషనల్ ట్రిప్ కొట్టి వస్తారు. ప్రయాణ సమయంలో పుస్తకాలు చదవడం ఇష్టం. పుస్తకాల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే ఫ్లయిట్లోనే నోట్ చేసుకుంటారు. ఫర్జానా దగ్గర తాతగారు కానుకగా ఇచ్చిన ఇంకు పెన్ను ఉంది. ఇప్పటికీ ఆ పెన్ను వాడుతున్నారు.అమ్మాయిలకిచ్చే సలహా : జర్నీని ఎంజాయ్ చెయ్యండి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి మీ లైఫ్‌లో ప్రాధాన్యం ఇవ్వండి. అవనీ బియానీ (ముంబై) కాన్సెప్ట్ హెడ్, ఫుడ్‌హాల్ ఈ రిటైల్ ఫుడ్ చెయిన్... అసలు బియానీ ఐడియాల వల్లే నడుస్తోంది. నెలలో కొన్నిరోజులైనా ఈమె బిజినెస్ ట్రిప్ ఉంటారు. ముఖ్యంగా లండన్, న్యూయార్క్, స్విట్జర్లాండ్లలో పనులు చక్కబెట్టుకొస్తుంటారు. బీచ్ లవర్. స్కీయింగ్ ఇష్టం. తెల్లవారక ముందే బయల్దేరే విమానాల ప్రయాణం బియానీకి అస్సలు ఇష్టం ఉండదు. కొన్ని మనుషులు, కొత్త ప్రదేశాలు ఆమె నిరంతర ఉల్లాస రహస్యం. ఐప్యాడ్ లేకుండా బియానీ అడుగు బయటపెట్టరు. అమ్మాయిలకిచ్చే సలహా : కొత్త రుచులకోసమైనా ప్రయాణాలు చేసి తీరవలసిందే. ప్రియా పాల్ (కోల్‌కతా) చైర్ పర్సన్, ది పార్క్ హోటల్స్నెలలో కనీసం 10 నుంచి 12 రోజులో విమానాల్లో చక్కర్లు కొడుతుంటారు! నవీ ముంబై, బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్, ప్యారిస్, లండన్లలో ఆమెకు పని ఉంటుంది. ఎక్కువగా న్యూయార్క్ వెళుతుంటారు. అక్కడి ‘నోమాడ్’ లో దిగుతారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మళ్లీ వెహికిల్స్ ఎక్కకుండా.. వీలైనంత వరకు బ్రేక్‌ఫాస్ట్‌కీ, లంచ్‌కీ, డిన్నర్‌కి, ఇంకా.. సైట్ సీయింగ్‌లకు నడిచే వెళ్లమని ఆమె సలహా ఇస్తారు.అమ్మాయిలకిచ్చే సలహా : మీరు ఉన్న చోటి నుంచి కొత్తగా ఎక్కడికైనా సరే నాలుగు అడుగులు వేసి రండి. గుంజన్ సోనీ (బెంగళూరు) హెడ్, జబాంగ్ అండ్ సీఎంవో, మింత్రాఫ్యాషన్ పోర్టల్ హెడ్డుగా ఏడాదికి 200 రోజులు బిజినెస్ ట్రిప్పులోనే ఉంటారు. ఢిల్లీ, హాంకాంగ్, సింగపూర్, లండన్, యు.ఎస్. ఆమె తరచూ వెళ్లే ప్రదేశాలు. మీటింగ్ ఉన్న దేశంలో లేదా సిటీలో ఇరవై నాలుగు గంటల ముందే సోనీ సిద్ధంగా ఉంటారు. ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకు గుర్తుపెట్టుకుని మరీ గిఫ్టులు కొంటారు.అమ్మాయిలకిచ్చే సలహా : తప్పనిసరిగా ప్రయాణాలు చెయ్యాలి. అందువల్ల మన ప్రపంచం విస్తృతమౌతుంది. విష్పలరెడ్డి (న్యూఢిల్లీ) చీఫ్ పీపుల్స్ ఆఫీసర్, ఊబర్ ఇండియా అండ్ సౌత్ ఏషియాఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, శాన్ఫ్రాన్సిస్కోలకు ట్రావెల్ చేస్తుంటారు. కొండప్రాంతపు బీచ్‌లను ఇష్టపడతారు. వెళ్లిన చోట పని పూర్తి కాగానే తప్పనిసరిగా అక్కడి ఫ్రెండ్స్‌ని కలుస్తారు. లండన్ వెళ్లినప్పుడు బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలోని గోరింగ్ హోటల్లో స్టే చేస్తారు. ఒంటరిగా ప్రయాణం చేయడం ఇష్టం. ఏకాంతం లభిస్తుందట. అమ్మాయిలకిచ్చే సలహా : ఒంటరిగా ప్రయాణించడంలోని స్వేచ్ఛను అనుభూతి చెందండి. అవనీ దావ్దా (ముంబై) మేనేజింగ్ డైరెక్టర్, గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ఏడాదిలో 40 రోజులు టూర్లోనే ఉంటారు. బెంగళూరు, పుణె, ఢిల్లీ, దుబాయ్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు తిరుగుతుంటారు. ఆహార ఉత్పత్తులను విక్రయిస్తుండే కంపెనీకి ఎం.డీ. అయిన దావ్దాకు లండన్ వెళ్లినప్పుడు సెయింట్ జేమ్స్ కోర్ట్‌లో లంచ్గానీ, డిన్నర్ గానీ చేయడం ఇష్టం. మాయిశ్చరైజర్, సౌకర్యవంతంగా ఉండే కాలిజోళ్లను దగ్గర ఉంచుకోవడం మర్చిపోరు. టూర్లో రూమ్ సర్వీస్‌ని అస్సలు ఉపయోగించుకోరు. బయటికి వెళ్లే తిని వస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : ప్రయాణాలు మీ జీవితానికి సహజసిద్ధమైన పౌష్టికాహారాన్ని అందిస్తాయి. అపూర్వ పురోహిత్ (ముంబై) ప్రెసిడెంట్, జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్మీడియా పరిశ్రమలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న అపూర్వ ప్రింట్, రేడియో, డిజిటల్ కంటెంట్ కోసం గత ఐదేళ్లలో దాదాపుగా ప్రతి వారం విదేశీయానంలోనే ఉన్నారు! యు.కె. సింగపూర్, హాంకాంగ్, న్యూఢిల్లీ బెంగళూరు.. ప్రధానంగా ఆమె ప్రయాణ ప్రదేశాలు. ఎప్పుడూ తను వాడే షాంపూ, కండిషన్ కూడా ఆమె బ్యాగ్‌లో ఉంటాయి. అమ్మాయిలకిచ్చే సలహా : కెరీర్, కుటుంబం.. ఈ రెండింటి లోనూ సక్సెస్ సాధించాలి. రాధా కపూర్ (ముంబై) ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐ.ఎస్.డి.ఐ.ఐ.ఎస్.డి.ఐ. అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్. ఇక చెప్పేదేముందీ డిజైనింగ్ ఒక సృజనాత్మక అన్వేషణ. ప్రపంచమంతా తిరుగుతారు రాధ. ముఖ్యంగా ప్యారిస్, న్యూయార్క్ మీటింగులకు. ఫ్లయిట్ దిగాక పనుల్లో బిజీ అయిపోతారు కానీ, ఫ్లయిట్లో ఉన్నప్పుడు ఏమీ తినరు. ఫ్లయిట్ దిగాక పనులు అయ్యాక కానీ తన సొంత పనులు చూసుకోరు. యోగాకి మాత్రం టైమ్ అడ్జెస్ట్ చేసుకుంటారు. అమ్మాయిలకిచ్చే సలహా : ఎక్కువ తినకండి. స్లిమ్‌గా ఉండండి. ప్రయాణాలు చేస్తూ ఉండండి. ఉపాసన టాకు (న్యూఢిల్లీ) కో–ఫౌండర్, మొబీక్విక్ ఈ మొబైల్ పేమెంట్ కంపెనీ సారథి నెలలో కనీసం రెండుసార్లు జర్నీ చేస్తారు. కొన్నిసార్లు తన రెండేళ్ల బిడ్డను కూడా వెంట తీసుకెళతారు. తరచూ సింగపూర్, యు.కె., యు.ఎస్. వెళ్లొస్తుంటారు. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఏ సమయంలోనైనా దువ్వెన, చార్జర్, ఎలర్జీ మందులు ఉంటాయి. వెళ్లిన చోట వీలుని బట్టి స్నార్కెలింగ్, హైకింగ్, సైక్లింగ్ చేస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : మీ సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా టూర్ల కోసం తీసిపెట్టుకోండి. డాక్టర్ హర్ష బిజ్లానీ (ముంబై) మెడికల్ హెడ్, ది ఏజ్‌లెస్ క్లినిక్ అండ్ సెలబ్రిటీ స్కిన్ ఎక్స్పర్ట్ప్రయాణాలు చేయడమే కాదు, ప్రయాణించి వచ్చిన వారికి స్కిన్ మళ్లీ ‘గ్లో’అవడానికి సలహాలు ఇస్తుంటారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తరచూ నీళ్లు తాగుతుండాలని, క్రమం తప్పకుండా తినాలని చెబుతారు. లాస్ ఏంజిల్స్, లండన్, న్యూయార్క్, సింగపూర్.. ఇలా అనేక దేశాల్లో కాన్ఫరెన్స్‌లకు వెళ్లొస్తుంటారు బిజ్లానీ. ఏడాదిలో 30 నుంచి 45 రోజులు ఆమెకు టూర్లు ఉంటాయి. వెళ్లినచోట కొత్త కొత్త రెస్టారెంట్లను కనిపెట్టడం, జిమ్‌కు వెళ్లడం ఆమె అలవాటు. అమ్మాయిలకిచ్చే సలహా : నిరంతరం ప్రయాణిస్తూ ఉండండి. ప్రపంచాన్ని శోధించండి. తెలుసుకునే ఆసక్తి ఉంటే తెలియని వాటి గురించి భయమే ఉండదు.ఇన్పుట్స్: సిఎన్ ట్రావెలర్ రాధికా ఘాయ్ (న్యూఢిల్లీ) కో–ఫౌండర్, చీఫ్ బిజినెస్ స్టాఫ్, షాప్‌క్లూస్.కామ్ ఏడాదికి 120 రోజులు ప్రయాణాల్లోనే ఉంటారు. ఈ వ్యవధిలో ఆకాశంలో ఆమె ప్రయాణించే దూరం 6 లక్షల 70 వేల మైళ్లు. సింగపూర్ ఆమెకు ఇష్టమైన డెస్టినేషన్. వెస్టిన్‌లో ఓ కప్పు కాఫీ తాగి, మీటింగ్స్‌ని ముగించుకుని మెరీనా బే శాండ్స్‌లో షాపింగ్ చేసి, డెంప్సీహిల్లోని ఏ రెస్టారెంట్‌లోనైనా లంచ్, డిన్నర్ చేయడం.. సింగపూర్‌లో ఆమెకు ప్రియమైన వ్యాపకాలు. పెద్దగా లగేజ్ తీసుకెళ్లరు. ఓ చిన్న సూట్‌కేస్‌లో అన్నీ సర్దేసుకుంటారు. స్నీకర్స్ (తేలికపాటి షూజ్) తప్పనిసరి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పుస్తకం చదువుతూ, కునుకుతీస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : విహరించండి, విందులు ఆరగించండి. -
ఆదర్శంగా తెలంగాణ జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖ అనేక సంస్కరణలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం చర్లపల్లి వ్యవసాయక్షేత్రం (ఓపెన్‌ఎయిర్‌జైల్) ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద చికిత్సాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చికిత్సాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా అదేస్థాయిలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి నిపుణులను రప్పించి ఖైదీలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ ఆయుర్వేద సెంటర్‌కు వస్తున్న ఆదరణతో చర్లపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.శాఖ ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగాయిలాంటి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఏడాదిలో రూ: 3 కోట్ల ఆదాయ లక్ష్యంతో పాటుగా మూడు వేల మంది ఖైదీలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఖైదీల క్షమాభిక్ష ఫైల్‌ను మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖైదీల క్షమాభిక్ష అమలవుతుందన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీజీ ఆకుల నర్సింహ్మ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు రాజేశ్, యంఆర్ భాస్కర్, సిఐఎ అధ్యక్షుడు కట్టంగూర్ హరీష్‌రెడ్డి, ఐలా సెక్రటరీ రోషిరెడ్డి, విశ్వేశ్వరరావు, ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరథం, సిబ్బంది పాల్గొన్నారు. -
మన పథకాలు దేశానికే ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్సీ) అశోక్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన భవన్లో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. -
మొక్కను ఆదర్శంగా తీసుకుందాం
ఆత్మీయం అవాంతరాలు, అడ్డంకులు ఎదురు కాని మనిషి ఉండడు. ఆ మాటకొస్తే ఇబ్బందులు ఎదుర్కొనని జీవే ఉండదు. విత్తనం ఒక జీవమున్న పదార్థం అనుకుందాం. మర్రి విత్తనం ఎంతో చిన్నది. అది మొలకెత్తి ఎన్నో ఊడలున్న పెద్ద చెట్టుగా మారుతుందని మనకు తెలుసు. అయితే అది అంత తేలికగా ఏమీ జరగడం లేదు. విత్తనం చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు... మొదట విత్తనం మట్టిలో పడగానే చీమలు, చిన్న పురుగుల వంటివి దానిని తినేయాలని చూస్తాయి. అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటుంది. ఈలోగా పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేసేందుకు ప్రయత్నిస్తాయి. వాటి బారిన పడకుండా అది ఆకులూ మారాకులూ వేస్తూ పెరుగుతూ ఉంటే, పశువులు దానిని ఫలహారం చేయబోతాయి. అయినా సరే, అది ఎదిగి కొమ్మలూ రెమ్మలూ వేస్తుంది... క్రమంగా ఊడలు పాతుకునిæ... భూమిలో బలంగా వేళ్లూనుకుంటుంది. చాలా చిత్రంగా అది చిన్న విత్తుగా భూమిలో ఉన్నప్పుడు దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. దాని మీద గూళ్లు కట్టుకుంటాయి. మనిషి ఎదుగుదల కూడా అటువంటిదే. అంత చిన్న విత్తనమే అన్ని అవరోధాలనుంచి తప్పించుకుని మొక్కగా పెరిగి మానుగా ఎదుగుతోందంటే... మనిషెలా ఉండాలి? అందుకే చిన్న చిన్న అడ్డంకులతో మన ఎదుగుదల ఆగిపోయిందని బాధపడకుండా మరింతగా పెరిగేందుకు ప్రయత్నించాలి. -
వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలి
లక్సెట్టిపేట: యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎంఈవో రవీందర్ సూచించారు. మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జై హన్మాన్ యూత్ అధ్యక్షుడు తగరపు సత్తయ్య, నాయకులు ప్రవీణ్, రవిజోసెఫ్, స్వామి, రాజ్‌కుమార్, సురేష్ పాల్గొన్నారు. -
జై కిసాన్... జై పోస్ట్‌మాన్!
ఆదర్శం అక్టోబర్ 10 ఇండియన్ నేషనల్ పోస్టల్ డే ‘పోస్ట్..’ అనే పిలుపు ఎంత తీయటిదో ఈ తరానికి అంతగా తెలియకపోవచ్చుగానీ... కొన్ని సంవత్సరాల వెనక్కి వెళితే... ఆ పిలుపులోని మాధుర్యం కళ్ల ముందు కదలాడుతుంది. ‘అబ్బాయికి ఉద్యోగం వచ్చింది’ ‘పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి అమ్మాయి నచ్చింది’ ‘మిత్రమా... ఉభయ కుశలోపరి’ ‘తాతయ్య ఆరోగ్యం బాగలేదు. వెంటనే బయలుదేరి రాగలవు’ ఆనందం. ఆత్మీయం. క్షేమ సమాచారం... ఒక్కటా... రెండా... ‘పోస్ట్’ అనే పిలువులో ఎన్నో ఎదురుచూపులు. ఆ ఎదురుచూపుల కాలానికి ఇప్పుడు కాలం చెల్లవచ్చుగాక... కానీ ‘పోస్ట్’ అనే పిలుపుకు మాత్రం కాలం చెల్లలేదు. పోస్ట్ ఆఫీసులకు కాలం చెల్లలేదు. అవి కాలంతో పాటు మారుతూ... ప్రజలకు చేరుతున్నాయి అని చెప్పడానికి నిదర్శనం... ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ వ్యవసాయ భూముల భూసారాన్ని పరీక్షించడానికి ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. పూణే ప్రాంతీయ తపాలాశాఖ ఆధ్వర్యంలోని ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ కృషి విజ్ఞాన్ కేంద్ర (కేవీకే)తో కలిసి పనిచేస్తుంది. బారామతి కేంద్రంగా పనిచేస్తున్న ‘కేవీకే’ జిల్లా స్థాయి ఫార్మ్ సైన్స్ సెంటర్. రైతులు తమ పొలాల్లోని మట్టి నమూనాలను స్థానిక పోస్ట్ ఆఫీసుల్లో ఇస్తారు. వీటిని పోస్ట్ ఆఫీసులు పరీక్ష కోసం కేవీకే సెంటర్లకు పంపుతాయి. పరీక్షల తరువాత... ఆ సెంటర్ నుంచి ఒక రిపోర్ట్ అందుతుంది. అందులో అవసరమైన సలహాలు కూడా అందుతాయి. ‘‘భారతీయ తపాలశాఖ ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతుల దూతగా వ్యవహరించే విలువైన అవకాశం ఏర్పడుతుంది’’ అంటున్నారు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎఫ్.బి.సయ్యద్. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు మట్టి నాణ్యత పరీక్షల గురించి అంతగా అవగాహన లేదు. ఉన్నా... పరీక్షల విధివిధానాల గురించి తెలియదు. ఈ నేపథ్యంలో... ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ ఎంతోమంది రైతులకు మేలు చేస్తోంది. ‘‘ఉత్తరం కొనడానికో, మనీ ఆర్డర్ చేయడానికో ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులకు తరచుగా వెళ్లేవాళ్లం. ఈ మధ్య కాలంలో అసలు వెళ్లడమే తక్కువైంది. ఇప్పుడు... కిసాన్ విజ్ఞాన్ దూత్ వల్ల... బాగా తెలిసిన ఇంటికి మళ్లీ వెళ్లినట్లు అనిపించింది’’ అంటున్నాడు కేసరి అనే గ్రామీణ రైతు. ఇది ఒక్క రైతు అభిప్రాయం మాత్రమే కాదు. ఎంతోమంది రైతుల భావోద్వేగ సంబరం. పూణే శాఖ పరిధిలో మొత్తం రెండు వేలకు పైగా గ్రామీణ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి... కేవలం పోస్ట్ ఆఫీసులు మాత్రమే కాదు... రైతుల ఆత్మీయ నేస్తాలు. ‘‘భూసార పరీక్షల గురించి తక్కువమంది రైతులకు మాత్రమే తెలుసు. దీనికి తోడు సమాచార కొరత. ఇప్పుడు మాత్రం భూసార పరీక్షల గురించి శాస్త్రీయ అవగాహనను పెంచుకుంటున్నారు’’ అంటున్నాడు భూసార పరీక్షల్లో స్పెషలిస్ట్‌గా పేరున్న వివేక్ భోటి. ప్రస్తుతానికైతే... భూసార పరీక్షల రిపోర్ట్ రైతుల చేతికి అందడానికి ఎనిమిది రోజుల సమయం పడుతోంది. ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతోంది. రైతులు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి కారణమవుతున్న అవగాహన లేమి ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’తో తగ్గిపోతుంది. సరికొత్త సమాచారం చేరువవుతుంది. ‘గత కాలం మేలు’ అంటారు. పోస్ట్ ఆఫీసులు అంటే ‘గత కాల జ్ఞాపకాలే’ అనుకుంటున్న కాలంలో... ప్రజల మేలు కోరి... మరింత శక్తిమంతం అవుతోంది భారతీయ తపాలాశాఖ. అడుగో పోస్ట్‌మాన్! వీధి వీధినంతా మేల్కొలుపుతున్నాయి వీధి వీధినంతా కలయ చూస్తున్నాయి అడుగో పోస్ట్‌మాన్! * * అందరికీ నువ్వు ఆత్మబంధువువి అందరికి నువ్వు వార్తనందిస్తావు కాని నీ కథనం మాత్రం నీటిలోనే మథనం అవుతుంటుంది. ఇన్ని ఇళ్ళు తిరిగినా... నీ గుండె బరువు దించుకోవడానికి ఒక్క గడప లేదు. ఇన్ని కళ్ళు పిలిచినా... ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు. ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు. - తిలక్ (తపాలా బంట్రోతు కవిత నుంచి) -
నయీమ్ బాటలో..!
వ్యాపారికి ఇద్దరు విద్యార్థుల బెదిరింపు కోదాడ అర్బన్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు.. నయూమ్‌ను ఆదర్శంగా తీసుకుని వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్‌కు చెందిన కొల్లు గోపాల్‌రెడ్డి స్థానిక ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. గోపాల్‌రెడ్డి స్నేహితుడి తమ్ముడైన పత్తేపురం నాగరాజు నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. గోపాల్‌రెడ్డి, నాగరాజులు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారు. నయీమ్ తరహాలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. నయీమ్ భువనగిరికి చెందిన ఓ వ్యాపారవేత్తను బెదిరించిన కాల్ రికార్డును విని, ఎలా బెదిరింపులకు పాల్పడాలో తెలుసుకున్నారు. శాంతినగర్‌లో ఇటుకల వ్యాపా రం నిర్వహించే మల్లెల పూర్ణచందర్‌రావుకు ఫోన్ చేశారు. ‘నేను భాయ్‌ని మాట్లాడుతున్నా.. నాకు పది లక్షలు ఇవ్వాలి.. లేకుంటే నీ కుమార్తెతో పాటు కుటుంబసభ్యులను చంపుతాం’’ అని బెదిరించారు. దీంతో పూర్ణచందర్రావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు, వారి కాల్ డేటా ఆధారంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. -
ఆదర్శ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తాం
– కొత్త కోర్సులను ప్రారంభిస్తాం – యూనివర్సిటీకి ‘బి’గ్రేడ్ – 75శాతం హాజరుంటేనే పరీక్షలకు అనుమతి – ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ ఎంజీయు (నల్లగొండ రూరల్) మహాత్మాగాంధీ యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఆదర్శ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీకి న్యాక్ ‘బి’ గ్రేడ్ ప్రకటించిందని వెల్లడించారు. ఈ గుర్తింపు వలన యూనివర్సిటీకి, విద్యార్థులకు మంచి గుర్తింపు లభించడంతో పాటు విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.యూనివర్సిటీని సందర్శించిన న్యాక్ బృందం వసతులను పరిశీలించి ‘బి’గ్రేడ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. మూడు నెలల్లో గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గతంలో ఇన్చార్జి వీసీలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వలన యూనివర్సిటీ అభివృద్ధి జరగడలేదని అన్నారు. పీహెచ్డీ, పీజీ కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. 75శాతం హాజరుంటేనే యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రభుత్వం కేటాయించిన 240 ఎకరాల యూనివర్సిటీ భూమి పూర్తిగా నల్లరేగడి కావడంతో నిర్మాణ ఖర్చు అధికమవుతుందన్నారు. కొండా బాపూజీకి నివాళులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్, డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ సేవలను కొనియాడారు. -
జేవీవీ కార్యక్రమాలు ఆదర్శనీయం
–ఆర్డీఓ వెంకటాచారి –ముగిసిన రాష్ట్ర మహాసభలు నల్లగొండ కల్చరల్ : జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని ఆర్డీఓ వెంకటాచారి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిసాయి. రెండవ రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల్లో పెనవేసుకుపోయిన మూఢ విశ్వాసాలను పారదోలుతూ వారిని చైతన్యం చేయడంలో జేవీవీ 30 ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మూఢ నమ్మకాలను రూపుమాపాలంటే ప్రతి ఒక్కరికీ సైన్స్ పట్ల అవగాహన కలిగివుండాలన్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఇలాంటి సభలు దోహదపడుతాయని పేర్కొన్నారు. జేవీవీ నిర్వహించే కార్యక్రమాలకు తన సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. అనంతరం జేవీవీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి.ఎం.మనోహర్‌ప్రసాద్, డాక్టర్ హెహెచ్.మోహన్‌రావు, డాక్టర్ మెహతాబ్ఎస్ బాబ్జి, అధ్యక్షుడిగా ఫ్రొఫెసర్ ఆదినారాయణరావు, ఉపాధ్యక్షుడిగా ఫ్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, ఫ్రొఫెసర్ బీఎన్.రెడ్డి, అందె సత్యం, ఎ.నాగేశ్వర్రావు, డాక్టర్ వి.ప్రభావతి, రామరాజు, ప్రధాన కార్యదర్శిగా టి.శ్రీనాథ్, కోశాధికారిగా ఎస్.జితేంద్ర, కార్యదర్శులుగా నర్సింహులు, టి.రాజు, ఎ.వెంకటరమణారెడ్డి, డాక్టర్ మమత, ఎన్.అరుణకుమార్, కస్తూరి ఎన్నికయ్యారు. సబ్ కమిటీ కన్వీనర్లుగా విద్య ఎల్వీఎన్.రెడ్డి, ఆరోగ్యం, డాక్టర్ రమాదేవి, సమత, ఝాన్సీరాణి, శాస్త్ర ప్రచారం ఫ్రొఫెసర్ కోయా వెంకటేశ్వర్రావు, ప్రచురణలు హరిప్రసాద్, చకుముఖి పి.ఆనంద్‌కుమార్, పర్యావరణం కె.బి. ధర్మప్రకాశ్, సామాజిక న్యాయం సర్వేశ్వర్రావు, సాంస్కృతిక ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు ప్రొఫెసర్ రామచంద్రయ్య, టి.రమేష్, లక్ష్మారెడ్డి, నాగేశ్వర్రావు, రమాదేవి, సతీష్, ఎన్. రత్నకుమార్, శ్రీనివాస్‌రాజు, మమత, బీఎన్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుకూ మెదడు ఉంది!
‘చెట్టు నా ఆదర్శం’ అన్నారు కవి ఇస్మాయిల్. ఆయన కవితల్లో చెట్టు ఇంతై, అంతై...భువనమంతై... తన విశ్వరూపాన్ని చూపుతుంది. ఒక కవితలో ఆయన ఇలా అంటారు... ‘మనిషీ మనిషీ పిట్టలకు ఎగరడం నేర్పిన చెట్టుని చూడు ఏ భాషలో పుష్పిస్తుందది? ఊడల నీడల్లో మాపటి వేళల్లో ఊడల్లా కావలించుకునే ప్రియుల హస్తాలు ఏ భాషలో తడుముకుంటాయి?’ ‘చెట్టు ఉన్నచోటు నుంచి కదలదు. కానీ దానిలోని స్పందనలు మాత్రం స్థిరంగా ఉండవు. గాలితో పాటు భావాలు ప్రయాణిస్తాయి. వాటి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే...ఎన్నో భావాలు అర్థమవుతాయి’ ఈ రకంగా ఎప్పుడైనా ఆలోచిస్తే... అది ‘భావుకత’ కేటగిరీలోకి పోతుందేగానీ ‘వాస్తవం’లోకి పోదు. అయితే మన ‘భావుకత’లో అతిశయోక్తి, అవాస్తవం ఏవీ లేవంటున్నాయి తాజా పరిశోధనలు. యూనివర్సిటీ ఆఫ్ టురిన్, ఇటలీకి చెందిన ప్రొఫెసర్ మాసిమో, ఇంకా కొద్ది మంది పరిశోధకులు చెట్టు చెట్టు తిరిగి, వేరు వేరుని పలకరించి ఎంతో పరిశోధన చేశారు. వీరు చెప్పేదాని ప్రకారం... చెట్లకు మెదడు ఉంటుంది. జ్ఞానం ఉంటుంది. చెట్లు ఒకదానితో ఒకటి మౌనంగా సంభాషించుకుంటాయి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఒక చెట్టు యోగక్షేమం గురించి మరొకటి ఆలోచిస్తుంది. వాటికి జ్ఞానమే కాదు... బాధ కూడా ఉంటుంది. ఇక ఒకే జాతి చెట్ల మధ్య చాల గట్టి బంధం ఉంటుందట. వాటి బంధం వేర్ల సహాయంతో బలపడుతుందట. కొన్ని సందర్భాల్లోనైతే... అవి కలిసికట్టుగా చనిపోతాయట! ఎంత చిత్రం!! -
మంచి మనసులు
ఆదర్శం ‘చిన్న పని చేయడానికైనా సరే...గొప్ప మనసుండాలి’ అంటారు. బెంగళూరులోని ‘టాటా షేర్వుడ్ రెసిడెన్షియల్ సొసైటీ’ వాసులు తమ ఇండ్లలో పనిచేసే వారి పిల్లల చదువు నుంచి మొదలు ఆరోగ్యం వరకు రకరకాలుగా శ్రద్ధ తీసుకుంటున్నారు. మామూలుగానైతే... పని వాళ్లు రావడం, తమ పనేదో చేసుకొని పోవడం వరకే ఉంటుంది. అయితే ఈ రెసిడెన్సీవాసులు మాత్రం తమ వంటవాళ్లు, డ్రైవర్లు, క్లీనర్లు... ఇతర పనివాళ్ల పిల్లలకు ట్యూషన్ పాఠాలు చెప్పడం నుంచి మొదలు స్కూలు ఫీజులు కట్టడం వరకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం... దీపావళికి రెండు రోజుల ముందు ఈ రెసిడెన్సీలో వంట పని చేసే మహిళ ఒకరు జబ్బున పడ్డారు. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు అవసరమైన సొమ్ము... నాలుగు లక్షలు! రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబానికి ఆ మొత్తం కలలోని మాట. వారి బాధ మాటలకు అందనిది. ఏంచేయాలో తోచక ఇంటిల్లిపాది కన్నీరు మున్నీరయ్యారు. ఆ నోటా ఈ నోటా పడి విషయం సొసైటీవాసులకు తెలిసింది. తమ కుటుంబసభ్యులకో, బంధువులకో సమస్య వచ్చినప్పుడు ఎంత సీరియస్‌గా, సిన్సియర్‌గా స్పందిస్తారో అదే స్థాయిలో స్పందించారు. సానుభూతి చూపడానికి మాత్రమే పరిమితమై పోలేదు. కార్యాచరణ గురించి ఆలోచించారు. పరిస్థితిని వివరిస్తూ సొసైటీ గూగుల్ గ్రూప్‌లో ఇ-మెయిల్ పెట్టారు. మంచి స్పందన కనిపించింది. నాలుగు రోజుల్లోనే మూడు లక్షల రూపాయలు వసూలయ్యాయి. రెసిడెన్సీవాసులు మాత్రమే కాదు... వారి బంధువులు, పరిచయస్థులు కూడా తమ వంతుగా సహాయం చేశారు. అలా... సహాయ నిధి... నాలుగున్నర లక్షలకు చేరింది. సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. త్వరలోనే ఆ వంటమనిషి కోలుకుంది. ఈ సంఘటన రెసిడెన్సీ వాసుల మనసుల్లో సంతోషాన్ని నింపింది. ఒక మంచి పనిచేశామనే భావన వారిలో కనిపించింది. ‘మంచి పని’లోని గొప్పదనం ఏమిటంటే అది మరిన్ని మంచి పనులకు దారి చూపుతుంది. పేద వంటమనిషికి చేసిన సహాయం కూడా మరిన్ని మంచి పనులకు దారి చూపింది. వంట మనిషి కోసం సేకరించిన డబ్బులో మిగిలిన మొత్తాన్ని ఎలా ఉపయోగించాలనేదాని గురించి రెసిడెన్సీవాసులు ఒక సమావేశం నిర్వహించుకున్నారు. అనేక రకాలుగా ఆలోచించిన తరువాత... ఆ మొత్తాన్ని రెసిడెన్సీలో పని చేసే వారి పిల్లల సంక్షేమం కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వాలంటరీ గ్రూప్‌గా ఏర్పడి మరిన్ని మంచి పనులు చేయాలనుకున్నారు. ఒక ప్రణాళిక తయారు చేసిన తరువాత... తమ దగ్గర ఉన్న మొత్తానికి మరి కొంత మొత్తాన్ని సేకరించి పనివారి పిల్లల బడి ఫీజు కట్టాలనుకున్నారు. అలా మరో అడుగు పడింది. మొదటి సంవత్సరంలోనే నలభై మంది పిల్లల విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. ‘‘మనం చేస్తున్న పని మంచిదే అయినప్పటికీ... ఇది మాత్రమే సరిపోతుందా? డబ్బులు ఇచ్చి మాత్రమే తృప్తి పడుతున్నామా? స్కూలు ఫీజు గురించే మాత్రమే కాదు వారి చదువుల బాగోగులు గురించి కూడా పట్టించుకోవాలనుకుంటున్నాం’’ అని చెప్పారు ఒక వాలంటీర్. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అని గ్రూప్ సభ్యులు ఎప్పుడైతే అనుకున్నారు మరో మంచి పనికి అడుగు ముందు పడింది. పేరెంట్స్‌ను కలిసి వారి అవసరాలేమిటో తెలుసుకున్నారు. పిల్లలు చదువులో ఎలా ఉన్నారో పరీక్షించారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు. ‘‘బోధనతో మాకెవరికీ పెద్దగా పరిచయం లేదు. అయితే మాలోని ఆసక్తే మమ్మల్ని ఆ దిశగా ప్రేరేపించింది. చదువు అంటే పిల్లలకు భయం స్థానంలో ఇష్టాన్ని పెంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. స్కూలు పుస్తకాలతో సంబంధం లేకుండా కమ్యునికేషన్ స్కిల్స్ పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు పిల్లల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే మా ఉత్సాహం రెట్టింపవుతుంది’’ అంటున్నారు ఒక ఆర్గనైజర్. ‘టాటా షేర్వుడ్ రెసిడెన్సియల్ సొసైటీ’లోని వాలంటరీ గ్రూప్‌ను అందరూ ఆదర్శంగా తీసుకుంటే... సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది! -
అందరికీ ఆదర్శం.. జ్యోతిరెడ్డి జీవితం
నమ్మలేని విజయాలు ఆమె సొంతం కష్టాలకు ఎదురొడ్డింది.. సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతగా ఎదిగింది రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతరావు జ్యోతిరెడ్డికి శాంతిదూత అవార్డు బహూకరణ సాక్షి, హన్మకొండ : జ్యోతిరెడ్డిని ప్రపంచానికి కె. రామచంద్రమూర్తి పరిచయం చేస్తే, ప్రపంచానికి వరంగల్‌ను జ్యోతిరెడ్డి పరిచయం చేసిందని ఆమె ప్రజలందరికి ఆదర్శమని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అందించే శాంతిదూత అవార్డుకు 2015 సంవత్సరానికి వరంగల్‌కు చెందిన ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి ఎం పికయ్యారు. ఈ మేరకు ఆదివారం హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవార్డు బçహూకరణ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి, జ్ఞానపీuŠ‡ అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్, వరల్డ్‌పీస్ ఫెస్టివల్ సభ్యులు సిరాజుద్దీన్, సిద్ధిఖీ, సాంబారి సమ్మారావు, బండా ప్రకాశ్, వాగ్దేవి విద్యాసంస్థల చైర్మన్ చందుపట్ల దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లక్ష్మీకాం తరావు మాట్లాడుతూ జ్యోతిరెడ్డి ఎన్నో నమ్మలేని విజయాల ను సొంతం చేసుకుని మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. కష్టాలకు ఎదురొడ్డి.. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతగా ఎదిగిందన్నారు. కష్టాల కడలిని ఈదే వారికి ఆమె జీవితం దిక్సూచి లాంటిదన్నారు. జ్యోతిరెడ్డి జీవితం వరంగల్‌కు సందేశం లాంటిదని పేర్కొన్నారు. పట్టుదలతో ఎదిగిన జ్యోతిరెడ్డి : రామచంద్రమూర్తి సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ విజయ్‌మాల్యా వంటి బడా పారిశ్రామిక వేత్తలు చేసిన అప్పులతో పోల్చితే.. రైతులు చేసే అప్పులు చాలా చిన్నవన్నారు. అప్పుల పాలైన రైతులు, ఆత్మన్యూనతా భావానికిలోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1998 నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా ఎదిగిన ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి జీవితం ప్రతి ఒక్కరి కీ ఆదర్శమని చెప్పారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి చనిపోదామనుకున్న మహిళ ఈస్థాయికి చేరుకోవడం వెనక ఎంతో కృషి దాగి ఉందన్నారు. జ్యోతిరెడ్డికి శాంతిదూత అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు జ్యోతిరెడ్డిపై ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ వచ్చాయని.. త్వరలో సినిమా రాబోతుందని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన్‌పీuŠ‡ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ జ్యోతిరెడ్డి అనుమతి ఇస్తే ఆమె జీవిత గాధను నవలగా రాస్తానని చెప్పారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచిపోకుండా పుట్టిన ప్రాంతానికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి జ్యోతిరెడ్డి అని ఆయన అన్నారు. కాగా, జ్యోతిరెడ్డికి జీవితంలో ఎదురైన కష్టాలు, వాటిని ఆమె ఎదుర్కొన్న తీరును వరల్డ్‌పీస్ ఫెస్టివల్ సొసైటీ వ్యవస్థాపకుడు సిరాజు ద్దీన్ క్లుప్తంగా వివరించారు. ఐదు రూపాయల దినసరి వ్యవసాయ కూలి నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థకు అధిపతిగా జ్యోతిరెడ్డి ఎదిగారని ఆయన చెప్పారు. వరంగల్‌కు అన్నా హజారే జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ద్వారా త్వరలో అన్నాహజారేను వరంగల్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మల్లికాంబ మనోవికాస కేంద్రం జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఉన్న 40 అనాథ శరణాలయాల విద్యార్థులకు ఇటీవల పోటీలు నిర్వహించి రూ .3 లక్షల విలువైన బహుమతు లు అందించిన గొప్ప వ్యక్తి జ్యోతిరెడ్డి అని ఆయన పేర్కొన్నా రు. అనంతరం జ్యోతిరెడ్డికి అతిథులు శాంతిదూత అవా ర్డును అందజేసి సత్కరించారు. ఆసక్తి ఉంటే సాధించవచ్చు : జ్యోతిరెడ్డి చేసే పనిపై ఆసక్తి ఉంటే లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చని శాంతిదూత అవార్డు గ్రహీత దూదిపాల జ్యోతిరెడ్డి అన్నారు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు వందలసా ర్లు చచ్చిపోయి మళ్లీ పుట్టానని ఆమె పేర్కొన్నారు. పరిస్థితులతో సర్దుకుపోతే సమ స్య లేదని, వాటికి ఎదురుతిరిగితే ఈ సమా జం ఎంతో క్లిష్టంగా, కష్టంగా మారుతుందన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలు పైకి రావడానికి అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పెళ్లైన తర్వాత జీవితం అయిపోయిందనుకునే ఆడవారికి నా జీవితం పెద్ద ఉదాహరణ అన్నారు. పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కష్టాలకు ఎదురొడ్డి తాను ఈ స్థాయికి వచ్చాననని చెప్పారు. నో కాంప్రమైజ్.. నో కండీషన్ ఈజ్ పర్మనెంట్, నథింగ్ ఈజ్ ఇం పాజిబుల్ అనుకుని పనిచేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన సంఘటనలను జ్యోతిరెడ్డి గుర్తుకు చేస్తూ పలుమార్లు కంటనీరు పెట్టుకున్నారు. -
అందరికీ ఆదర్శం.. జ్యోతిరెడ్డి జీవితం
నమ్మలేని విజయాలు ఆమె సొంతం కష్టాలకు ఎదురొడ్డింది.. సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతగా ఎదిగింది రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతరావు జ్యోతిరెడ్డికి శాంతిదూత అవార్డు బహూకరణ సాక్షి, హన్మకొండ : జ్యోతిరెడ్డిని ప్రపంచానికి కె. రామచంద్రమూర్తి పరిచయం చేస్తే, ప్రపంచానికి వరంగల్‌ను జ్యోతిరెడ్డి పరిచయం చేసిందని ఆమె ప్రజలందరికి ఆదర్శమని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అందించే శాంతిదూత అవార్డుకు 2015 సంవత్సరానికి వరంగల్‌కు చెందిన ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి ఎం పికయ్యారు. ఈ మేరకు ఆదివారం హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవార్డు బçహూకరణ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి, జ్ఞానపీuŠ‡ అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్, వరల్డ్‌పీస్ ఫెస్టివల్ సభ్యులు సిరాజుద్దీన్, సిద్ధిఖీ, సాంబారి సమ్మారావు, బండా ప్రకాశ్, వాగ్దేవి విద్యాసంస్థల చైర్మన్ చందుపట్ల దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లక్ష్మీకాం తరావు మాట్లాడుతూ జ్యోతిరెడ్డి ఎన్నో నమ్మలేని విజయాల ను సొంతం చేసుకుని మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. కష్టాలకు ఎదురొడ్డి.. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతగా ఎదిగిందన్నారు. కష్టాల కడలిని ఈదే వారికి ఆమె జీవితం దిక్సూచి లాంటిదన్నారు. జ్యోతిరెడ్డి జీవితం వరంగల్‌కు సందేశం లాంటిదని పేర్కొన్నారు. పట్టుదలతో ఎదిగిన జ్యోతిరెడ్డి : రామచంద్రమూర్తి సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ విజయ్‌మాల్యా వంటి బడా పారిశ్రామిక వేత్తలు చేసిన అప్పులతో పోల్చితే.. రైతులు చేసే అప్పులు చాలా చిన్నవన్నారు. అప్పుల పాలైన రైతులు, ఆత్మన్యూనతా భావానికిలోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1998 నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా ఎదిగిన ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి జీవితం ప్రతి ఒక్కరి కీ ఆదర్శమని చెప్పారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి చనిపోదామనుకున్న మహిళ ఈస్థాయికి చేరుకోవడం వెనక ఎంతో కృషి దాగి ఉందన్నారు. జ్యోతిరెడ్డికి శాంతిదూత అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు జ్యోతిరెడ్డిపై ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ వచ్చాయని.. త్వరలో సినిమా రాబోతుందని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన్‌పీuŠ‡ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ జ్యోతిరెడ్డి అనుమతి ఇస్తే ఆమె జీవిత గాధను నవలగా రాస్తానని చెప్పారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచిపోకుండా పుట్టిన ప్రాంతానికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి జ్యోతిరెడ్డి అని ఆయన అన్నారు. కాగా, జ్యోతిరెడ్డికి జీవితంలో ఎదురైన కష్టాలు, వాటిని ఆమె ఎదుర్కొన్న తీరును వరల్డ్‌పీస్ ఫెస్టివల్ సొసైటీ వ్యవస్థాపకుడు సిరాజు ద్దీన్ క్లుప్తంగా వివరించారు. ఐదు రూపాయల దినసరి వ్యవసాయ కూలి నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థకు అధిపతిగా జ్యోతిరెడ్డి ఎదిగారని ఆయన చెప్పారు. వరంగల్‌కు అన్నా హజారే జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ద్వారా త్వరలో అన్నాహజారేను వరంగల్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మల్లికాంబ మనోవికాస కేంద్రం జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఉన్న 40 అనాథ శరణాలయాల విద్యార్థులకు ఇటీవల పోటీలు నిర్వహించి రూ .3 లక్షల విలువైన బహుమతు లు అందించిన గొప్ప వ్యక్తి జ్యోతిరెడ్డి అని ఆయన పేర్కొన్నా రు. అనంతరం జ్యోతిరెడ్డికి అతిథులు శాంతిదూత అవా ర్డును అందజేసి సత్కరించారు. ఆసక్తి ఉంటే సాధించవచ్చు : జ్యోతిరెడ్డి చేసే పనిపై ఆసక్తి ఉంటే లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చని శాంతిదూత అవార్డు గ్రహీత దూదిపాల జ్యోతిరెడ్డి అన్నారు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు వందలసా ర్లు చచ్చిపోయి మళ్లీ పుట్టానని ఆమె పేర్కొన్నారు. పరిస్థితులతో సర్దుకుపోతే సమ స్య లేదని, వాటికి ఎదురుతిరిగితే ఈ సమా జం ఎంతో క్లిష్టంగా, కష్టంగా మారుతుందన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలు పైకి రావడానికి అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పెళ్లైన తర్వాత జీవితం అయిపోయిందనుకునే ఆడవారికి నా జీవితం పెద్ద ఉదాహరణ అన్నారు. పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కష్టాలకు ఎదురొడ్డి తాను ఈ స్థాయికి వచ్చాననని చెప్పారు. నో కాంప్రమైజ్.. నో కండీషన్ ఈజ్ పర్మనెంట్, నథింగ్ ఈజ్ ఇం పాజిబుల్ అనుకుని పనిచేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన సంఘటనలను జ్యోతిరెడ్డి గుర్తుకు చేస్తూ పలుమార్లు కంటనీరు పెట్టుకున్నారు. -
అక్కడికి ఒక్క రూపాయితో వెళితే చాలు...
ఆదర్శం ఒక్క రూపాయితో ఆకలి తీరుతుందా? ఆకలి తీరడం వరకు ఎందుకు? సింగిల్ టీ కూడా తాగలేము. కానీ అక్కడికి ఒక్క రూపాయితో వెళితే చాలు... కమ్మని భోజనంతో కడుపు నిండుతుంది. తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కరూపాయికి పేదసాదలకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు వెంకట్రామన్. ఈరోడ్ జనరల్ హాస్పిటల్ సమీపంలో తాను నిర్వహిస్తున్న ‘ఏఎంవీ హోమ్లీ మెస్’లో ఒక్క రూపాయికే పేదలకు భోజనం సమకూరుస్తున్నడు వెంకట్రామాన్. ప్రతి మంచి పని వెనుక ఏదో ఒక సంఘటన ఉంటుంది. వెంకట్రామన్ విషయంలోనూ ఇది జరిగింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక యువతి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వెంకట్రామన్ రెస్టారెంట్‌కు వచ్చింది. ఆమె ఇడ్లీలు కొనడానికి వచ్చింది. ఆరు ఇడ్లీలకు పది రూపాయలు. పది రూపాయలు పెట్టి ఇడ్లీలు కొనడానికి ఆమె సుముఖంగా లేకపోవడంతో దోశలు కొనమని చెప్పాడు వెంకట్రామన్. పది రూపాయలకు మూడు దోశలు. మూడు దోశలు తన కుటుంబానికి సరిపోవంటూ కొనడానికి తిరస్కరించింది. ఆమె పరిస్థితికి జాలి పడి పది రూపాయలకే ఆరు దోశలు ఇచ్చాడు వెంకట్రామన్. వేరే రెస్టారెంట్ యజమానులు అయితే ఈ సంఘటనను ఇక్కడితో మరిచిపోయి ఉండేవారు. అయితే వెంకట్రామన్ చాలా రోజుల వరకు ఈ సంఘటనను మరవలేకపోయాడు. కొందరు కేవలం పది రూపాయల మీదే రోజంతా వెళ్లదీస్తున్న కఠిన వాస్తవాన్ని గ్రహించాడు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పేద రోగుల దీనపరిస్థితిని, ఆకలిని కళ్లారా చూశాడు. మనసు కదిలిపోయింది. ‘‘నా పరిధిలో ఏదైనా చేయాలి’’ అని అప్పుడే గట్టిగా అనుకున్నాడు వెంకట్రామన్. తన భార్యతో కలిసి రోజూ పొద్దున హాస్పిటల్‌కు వెళ్లి పేదవారికి రూపాయి కూపన్ ఇస్తాడు. కూపన్ తీసుకున్నవారు మధ్యాహ్నం రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం తెచ్చుకుంటారు. ఒకప్పుడు 20 మందికి టోకెన్లు ఇచ్చేవాడు. ఇప్పుడు 70 మందికి ఇస్తున్నాడు. ఈ రెస్టారెంట్లో రెగ్యులర్ కస్టమర్ల విభాగం కూడా ఉంది. అక్కడ మాత్రం ప్లేట్ భోజనం రూ.50కి విక్రయిస్తారు. రూపాయి భోజనానికయ్యే ఖర్చు కోసం మొదట్లో ఎవరీ దగ్గర సహాయం తీసుకోలేదు వెంకట్రామన్. తన రెస్టారెంట్ లాభాల నుంచే ఈ మొత్తాన్ని కేటాయించేవాడు. అయితే రెస్టారెంట్‌కు వచ్చే లాభాలు తక్కువ కావడంతో ఖర్చులు సర్దుబాటు చేయడం కష్టంగానే ఉండేది. అయితే వెంకట్రామన్ చేస్తున్న పని నచ్చి అడగకుండానే దాతలు ఆయనకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. వెంకట్రామన్ కూతురికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చినప్పుడు కాలేజీ ఫీజు కట్టడానికి అతని దగ్గర డబ్బులేదు. ఇది తెలిసిన చెన్నై రామక్రిష్ణ మఠ్ వెంకట్రామన్ కూతురు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందడానికి అవసరమైన సహాయం చేసింది. ‘‘కష్టం ఉందని బాధ పడనక్కర్లేదు. ఆ కష్టాన్ని తీర్చే ఆపన్న హస్తం కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది’’ అని నమ్ముతాడు వెంకట్రామన్. ‘‘చదువు అయిపోయిన తరువాత నా కూతురుకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నేను మరింత ఎక్కువ మందికి సహాయం చేయగలను’’ అంటున్నాడు వెంకట్రామన్. యోగా టీచర్‌గా పని చేస్తున్న వెంకట్రామన్ భార్య తనవంతుగా సహాయం అందిస్తోంది. ‘‘పేద కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికీ నేనేమీ ఆర్థికంగా స్థిరపడలేదు. అయినా... ఒక్క రూపాయికి భోజనం మాత్రం సమకూర్చడాన్ని మాత్రం మానుకోను. రోజుకు వంద కూపన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం’’ అంటున్నాడు వెంకట్రామన్. ‘‘మానవత్వం అనేది సముద్రం లాంటిది. అందులో రెండు చుక్కలు కలుషితం అయినంత మాత్రాన... సముద్రం అంతా కలుషితం కాదు’’ అంటారు మహాత్మగాంధీ. వెంకట్రామన్ చేస్తున్న మంచిపనిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మహాత్ముడి మాటలు గుర్తుకు వస్తాయి. మానవత్వం మీద పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఈ కాలానికి ఇంత కంటే కావాల్సింది ఏముంది! -
సార్వత్రిక సమ్మెలో నిరసన ప్రదర్శన
నల్లగొండ టూటౌన్ : సెప్టెంబర్ 2న చేపడుతున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో డిమాండ్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు కోరారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో జరిగిన యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మె జయప్రదం కోసం ఉపాధ్యాయులు డివిజన్ కేంద్రాల్లో ప్రదర్శనలు చేయాలని కోరారు. సీపీఎస్ విధానం కోసం దశల వారిగా పోరాటాల్లో పాల్గొనలన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. భాషా పండితుల, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ప్రతి 40 ఉన్నత పాఠశాలలకు ఒక ఉప విధ్యాధికారిని నియమించి, ప్రాథమిక పాఠశాలల సంఖ్య 50 దాటితే అదనంగా మరో ఎంఈను నియమించాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎన్. సరళ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి. లక్పతినాయక్, పెరుమాళ్ల వెంకటేశం, యాదయ్య, బి. అరుణ, తిరుమలయ్య, ధనమూర్తి, బి. శ్రీనివాసాచారి, నాగమణి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆకాశమంత!
ఆదర్శం కొందరు... ఆకాశమంత అవకాశం ఉన్నా... అణువంతైనా ఆత్మవిశ్వాసం లేక వెన్ను చూపుతారు. మరికొందరు... అణువంత అవకాశం దొరికినా... ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళతారు ఢిల్లీలోని లజ్‌పత్ నగర్. ఎర్రటి ఎండలో ఒక అమ్మాయి బెలూన్లు పట్టుకొని ఒక మూల నిల్చుంది. ఆమె ముఖంపై యాసిడ్ మచ్చలు కనిపిస్తున్నాయి. ఆ కళ్లలో ఏదో అవ్యక్త బాధ కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ఆ దారిన వెళుతున్న ఆకాశ్ భరద్వాజ్ ఆమెను చూసి ఆగిపోయాడు. ‘‘ఏం జరిగింది?’’ అని ఆమెను అడిగాడు. బాధలో ఉన్నవారి దగ్గరికి ఎవరో వచ్చి ‘ఏమైంది?’ ‘ముఖం మీద ఆ మచ్చలు ఏమిటి?’లాంటి ప్రశ్నలు వేస్తే చిరాకుగా ఉంటుంది. అయితే ఆమె అలా చిరాకు పడలేదు. ఆకాశ్‌ను చూస్తే తోబుట్టువును చూసినట్లు అనిపించింది. అందుకే మనసు విప్పి మాట్లాడింది.... కొంతకాలం క్రితం...పొరుగింటి కుర్రాడు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త ఇదే అదనుగా భార్యను విడిచి ఎక్కడికో పారిపోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. యాసిడ్ దాడికి ముందు ఆమె ఒక మాల్లో సెక్యూరిటీ ఇన్‌చార్జీగా పని చేసేది. అయితే యాసిడ్ దాడి తరువాత ఈ మాల్లోనే కాదు... ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరకలేదు. తాను చేసిన పాపం ఏమిటి? తోడు నీడగా ఉండాల్సిన భర్త ఎందుకు పారిపోయాడు? ఊరడించాల్సిన ఇరుగు పొరుగు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? అన్ని ప్రశ్నలే... ఏ ప్రశ్నకు తన దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. బతకడానికి ఏ దారీ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లోనే తన ఇద్దరు పిల్లల్ని పోషించడం కోసం ఇల్లు విడిచి వీధిలో బెలూన్లు అమ్మడం మొదలుపెట్టింది. ‘‘పని ముఖ్యం కాదు...అందరికీ ఫేస్‌వాల్యూ ముఖ్యం’’ అని ఆమె కళ్లనీళ్ల పర్యంతం అయింది. ఆమె కథ విన్నాక ఆకాశ్ మనసు కదిలిపోయింది. జాలి ఎవరైనా చూపిస్తారు. కానీ మార్గం కొందరే చూపెడతారు. ఆ కొద్దిమందిలో ఆకాశ్ కూడా ఉన్నాడు. ఇలాంటి బాధితులకు ఉపాధి కలిగించడానికి తన వంతుగా సహాయం చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు 32 ఏళ్ల ఆకాశ్. ఆకాశ్‌కు ‘ఖాస్’ (ప్రత్యేకం) అనే ట్రావెల్ కంపెనీ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న ఆరు మందిలో చూపులేనివాళ్లు, యాసిడ్ బాధితులు ఉన్నారు. చూపులేని వాళ్లు ‘జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్’ ప్రోగ్రాం సహాయంతో పీసిని ఆపరేట్ చేస్తారు. ఉద్యోగులకు రెండు నెలల పాటు తానే స్వయంగా శిక్షణ ఇస్తాడు ఆకాష్. ‘‘సానుభూతితోనో, జాలిపడో నా కంపెనీలో వారికి ఉద్యోగం ఇవ్వడం లేదు. ప్రతిభలో వారు ఎవరికీ తీసిపోరు. సిబ్బంది పనితీరు గురించి క్లయింట్స్ నుంచి వస్తున్న ప్రశంసలే దీనికి సాక్ష్యం’’ అంటారు ఆకాశ్. తాము చేస్తున్న పనిపట్ల సిబ్బంది ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే... సెలవు దినాల్లో కూడా పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ఉద్యోగుల్లో కొందరు సొంత ఇంటి నుంచి వస్తారు. కొందరు హాస్టల్ నుంచి వస్తారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వీరికి ఆఫీసే ఇల్లుగా మారింది. గతంలో నీడలా ఉన్న విషాదభరిత ఒంటరితనం దూరమైంది. ఉత్సాహవంతమైన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. ‘‘నేను చేస్తున్న ఉద్యోగాన్ని హృదయపూర్వకంగా అభిమానిస్తున్నాను. ఉద్యోగం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను. ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అంటుంది దీప్తి అనే ఉద్యోగి. ఇ-మెయిల్స్ పంపడం నుంచి టూర్ ప్యాకేజీలు రూపొందించడం వరకు ప్రతి పనీ శ్రద్ధగా చేస్తున్నారు ఉద్యోగులు. ‘ఖాస్’లో ఉద్యోగానికి ముందు ఒకప్పుడు ఎటూ చూసినా నిరాదరణ ఎదురయ్యేది. ఇప్పుడు...ఆ పరిస్థితి లేదు. ఒక బలమైన ధీమా ఏదో వారిలో కనిపిస్తుంది. ‘వీరికి పని చేయడం చేతనవుతుందా?’ అనుకునే పరిస్థితి నుంచి ‘అన్ని పనులు సమర్థవంతంగా చేయగలరు’ అని నిరూపించుకున్నారు. ‘‘మిగిలిన ట్రావెలో కంపెనీలతో పోల్చితే నా కంపెనీ భిన్నమైనదేమీ కాదు. అయితే నా పునాది బలం మాత్రం... ఖచ్చితంగా నా సిబ్బందే’’ అని గర్వంగా చెబుతున్నాడు ఆకాశ్. -
ఆదర్శభక్తుడు.. జేత్యానాయక్
► ఆరుదశాబ్దాలుగా నృసింహుడి సేవలో.. ► నిత్యం స్వామివారికి ఆరెపత్రాలు సమర్పిస్తున్న ఆజన్మబ్రహ్మచారి వేకువజామునే నాలుగు గంటలకు కృష్ణానదిలో స్నానమాచరించడం.. లక్ష్మీనారసింహుడి పూజకు ఉపయోగించే ఆరెపత్రాలను స్థానిక అటవీప్రాంతంలో కోసుకుని ఐదు గంటలకు దేవాలయంలో సమర్పించడం ఆ వృద్ధుడి దినచర్య. ఒకటి,రెండు రోజుల నుంచి కాదు ఏకంగా ఆరుదశాబ్దాలుగా స్వామివారి సేవలో తరిస్తూ ఆదర్శభక్తుడిగా పేరుగాంచారు..జేత్యానాయక్. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నిత్యపూజలు చేస్తున్న ఈ గిరిజనభక్తుడిపై సాక్షి ప్రత్యేక కథనం. –మట్టపల్లి (మఠంపల్లి) ప్రసిద్ధి పొందిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆరెచెట్టు పత్రాలతోనే(ఆకులు) పూజలు చేయడం ఆనవాయితీ. పూర్వకాలంలో తంగెడ మాచిరెడ్డి ప్రభువు స్వప్నంలో గోచరించి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఎన్నో రకాల ఫలపుష్పాలు లభిస్తున్నప్పటికీ ఆరెపత్రాలతో స్వామిని ప్రతినిత్యం తెల్లవారుజామున,మధ్యాహ్నం, సాయంకాలం సమయాల్లో విశేషంగా అర్చనాదులు నిర్వహిస్తున్నారు. పన్నేండేళ్ల ప్రాయంలో.. మట్టపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న రాంచంద్రాపురంతండాకు చెందిన పానుగోతు రామోజీ లక్ష్మీదేవి దంపతులకు ఐదుగురు కుమారులు. వారిలో మూడో కుమారుడిగా సుమారు 80 ఏళ్ల క్రితం పానుగోతు జేత్యానాయక్ జన్మించాడు. పన్నెండేళ్ల ప్రాయంలోనే ఏదో తెలియని మైకంలో అటవీ ప్రాంతంలో ఉన్న మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాడు. ఆనాటి ప్రధాన అర్చకులు జోగాచార్యులు, వెంకటాచార్యులు జేత్యానాయక్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది అటవీప్రాంతం క్రూరమృగాలు సంచరిస్తుంటాయి.. ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి ఆలయానికి తాళం వేసి మట్టపల్లి గ్రామానికి వెళ్లారు. క్రూరమృగాలకు భయపడకుండా.. చుట్టూ అటవీప్రాంతం.. క్రూరమృగాలు సంచరిస్తున్నా జేత్యానాయక్ భయపడకుండా స్వామివారి సన్నిధిలో రాత్రంతా గడిపాడు.. ఇదే తంతు నిత్యం కొనసాగుతుండడంతో ఓ రోజు ఆలయ ప్రధాన అర్చకులు జేత్యానాయక్ను చూశారు. నిత్యం స్వామి వారి ప్రసాదం మాత్రమే తీసుకొని ఆలయంలోనే ఉండటాన్ని గమనించి నీవు ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంటున్నావు అని ప్రశ్నించారు. దీంతో తనను ఆలయం నుంచి వెళ్లగొట్ట వద్దని తాను బతికినంత కాలం నర్సింహస్వామి సేవలోనే కొనసాగుతానని.. అవకాశం ఇవ్వాలని కోరాడు. దీంతో ఆలయ అర్చకులు, పాలకవర్గం, జేత్యానాయక్లోని స్వామి సేవా భావాన్ని కనిపెట్టి ఆలయంలో నివసించేందుకు అవకాశమిచ్చారు. స్వామిని వదిలి రాలేనని.. జేత్యానాయక్ విషయం తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు ఆలయానికి వచ్చి తమతో రమ్మని కోరినప్పటికీ తాను నృసింహుని సేవ వదిలి రాలేనని, తనకు క్రూరమృగాలు, నరసింహస్వామి రెండు ఒకటేనని పలికాడు. ఆ నాటి నుంచి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ స్వామి సేవలోనే కొనసాగుతున్నాడు. యుక్త వయసులో వివాహం చేసుకోవాలని బంధువులు, అర్చకులు, దేవస్థానపాలకవర్గం వారు కోరినప్పటికీ తాను ఆజన్మ బ్రహ్మచారిగానే ఉంటానని, తన స్వామి సేవకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దన్నాడు. దీంతో దేవస్థానం రెండు గదుల రేకుల కప్పుతో జేత్యానాయక్‌కు నివాసం ఏర్పరిచింది. ప్రస్తుతం 80 ఏళ్లు పైబడినప్పటికీ ఎలాంటి మానసిక, శారీరక రుగ్మతలు లేని జీవితాన్ని గడుపుతూ స్వామికి ప్రతినిత్యం పూజకు ఆరెపత్రాలు సమర్పిస్తున్నాడు. దేవస్థాన పరిసరప్రాంతాల్లో సంచరిస్తూ స్వామి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ జీవిస్తున్నాడు జేత్యానాయక్. -
అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మొయినాబాద్: విద్యార్థులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని భావిభారత పౌరులుగా ఎదగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో సురాజ్య భారత్ స్టూడెంట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా, శాస్త్రవేత్తగా పనిచేసి దేశ రాష్ట్రపతి అయి అనేక సేవలందించారని కొనియాడారు. భారత రాష్ట్రపతి అయికూడా సాధారణ జీవితం గడిపిన అసాధారణ వ్యక్తి కలాం అన్నారు. విద్యార్థులు అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేశానికి సేవలందించే సైనికులుగా తయారు కావాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ప్రముఖ కవి డాక్టర్ జే.బాపిరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాంకు విద్యార్థులంటే ఎంతో ఇష్టమని.. ఆయన ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నా విద్యార్థులతోనే ఎక్కువగా మాట్లాడేవారన్నారు. కలాం జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు విజయ్ ఆర్య, కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కొమ్మిడి వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి, ఎంఈఓ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గున్నాల రాంచంద్రారెడ్డి, సర్పంచ్‌లు గీతావనజాక్షి, సుధాకర్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యులు మాధవరెడ్డి, మాణిక్‌రెడ్డి, మంగలి పెంటయ్య, ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి, నాయకులు ఈగ రవీందర్‌రెడ్డి, పద్మారావు, మాణెయ్య, హరినాథ్, వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేనున్నానంటూ...
ఆదర్శం రోడ్డు ఎక్కాలంటే భయం. రోడ్డు పక్కన నడవాలంటే భయం. ప్రమాదాలు జరుగుతాయని కాదు... అంత కంటే పెద్ద ప్రమాదం... ఓ రేంజ్లో వినిపించే హారన్ల శబ్దం. అవసరం ఉన్నా లేక పోయినా భారీగా వినిపించే హారన్ల శబ్దం. ఈ శబ్దాల వల్ల ‘ఇక మన చెవులు పనిచేస్తాయా!’ అనే అనుమానం అర్జంట్‌గా వస్తుంది. ‘నెగ్లెక్టెడ్ ఇష్యూ’గా ముద్రపడిన ఈ శబ్ద కాలుష్యాన్ని అప్పటికప్పుడు తిట్టుకోవడం తప్ప ఎక్కువగా ఆలోచించం. రవి కల్రా(ఢిల్లీ) మాత్రం ఆలోచించారు. ఈ సమస్యపై పోరాడడానికి, ప్రభుత్వాన్ని, పౌరులను భాగస్వాములను చేయడానికి ‘ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్’ పేరుతో నిర్మాణాత్మకమైన కృషిని ప్రారంభించారు. ‘‘నేను ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు మీద ప్రయాణిస్తున్నాను. అయితే ఒక్కసారి కూడా హారన్ ఉపయోగించే అవసరం రాలేదు. చిన్న ప్రమాదం కూడా జరగలేదు. నేను ఎన్నో దేశాలకు వెళ్లాను. అయితే ఎక్కడ కూడా హారన్‌ను వృథాగా కొట్టడం చూడలేదు. మనవాళ్లు విదేశీ రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు హంకింగ్ గురించి ఆలోచించరు’’ అంటారు రవి. రవి కృషి వృథా పోలేదు. అకారణంగా హంకింగ్ చేస్తున్న వారికి ఢిల్లీ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ అయిన రవి... ఒక రోజు ఒక దృశ్యాన్ని చూశారు. ఒక వీధిబాలుడు చెత్తకుప్పలోని ఆహారాన్ని తినడానికి కుక్కతో పోటీ పడుతున్నాడు. వీధిన పడిన అభాగ్యుల కోసం ఏదైనా చేయాలని అప్పుడే ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. ‘ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. వీధిన పడిన అభాగ్యుల కోసం ఏదైనా చేయాలనే తపనతో ‘ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసినప్పటికీ ఇది అనేక లక్ష్యాల కోసం పనిచేస్తుంది. ఎవరూ పట్టించుకోని వృద్ధుల కోసం ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించారు. ఇందులో చేరడానికి పైసా చెల్లించనక్కర్లేదు. రోడ్డు మీద కనిపించే మానసిక వికలాంగులను చూసి చలించిపోయారు రవి. ఎంతో కాలం నుంచి స్నానం చేయకపోవడం, చెత్తలో నుంచి ఏరుకొని ఏది పడితే అది తినడం, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దీనపరిస్థితిలో ఉండడం... ఇలాంటివన్నీ రవిని ఆలోచింపచేశాయి. ఈ ఆలోచనలో భాగంగా మానసిక వికలాంగుల కోసం గుర్గావ్లోని బంద్వరి గ్రామంలో ‘రెస్క్యూ సెంటర్’ను ప్రారంభించారు. భోజన వసతితో పాటు వైద్యసదుపాయలు కూడా ఇందులో ఉంటాయి. మనుషులకే కాదు ఆలనా పాలనా లేని ఆవులు, కుక్కలకు ఆశ్రయం ఇస్తుంది ‘ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్’. పర్యావరణ సంబంధిత విషయాలపై దృష్టి సారించి ‘డోన్ట్ హంక్’ పేరుతో శబ్ద కాలుష్యంపై యుద్ధభేరీ మోగిస్తుంది. సంస్థ సభ్యులు ఢిల్లీలోని వివిధ ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర పోస్టర్లు పట్టుకొని నిలబడతారు. కారులో ఉన్నవారితో మాట్లాడి కార్లకు ‘నో హంకింగ్’ స్టిక్కర్లు అంటిస్తారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సిబ్బందితో ‘శబ్ద కాలుష్యం’ నివారించడానికి తమ వంతు కృషి చేయవలసిందిగా చెబుతారు. ‘‘హారన్ అనేది అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఉపయోగించేది అనే అవగాహన తక్కువమందిలో ఉంటుంది. ఎదుటి వాళ్లు వేగంగా కదలడానికి మాత్రమే హారన్లు ఉన్నాయనుకుంటున్నారు. అవాంఛిత శబ్దాలు మనిషి ఆరోగ్యం, ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. వినికిడి శక్తి లోపించడంతో పాటు హైపర్‌టెన్షన్, స్ట్రెస్, మెమొరీ లాస్... మొదలైన సమస్యలకు కారణం అవుతాయి. చాలామంది డ్రైవర్లు తమలోని కోపాన్ని వ్యక్తీకరించడానికి ఒక వాహికగా హారన్‌ను ఉపయోగిస్తున్నారు’’ అంటారు రవి. ‘డోన్ట్ హంక్’ పేరుతో 5 లక్షల స్టిక్కర్లు తయారు చేయించారు. ఆ స్టిక్కర్లలో ఇలా రాసి ఉంటుంది... హారన్ అనేది అత్యవసర పరిస్థితిలో మాత్రమే వాడేది. ఆడుకోవడానికి అది బొమ్మ కాదు. మీ నగరం చేపల మార్కెట్ కాదు... నగరాన్ని శబ్దకాలుష్యం నుంచి కాపాడండి. ‘హారన్ ప్లీజ్’ నుంచి ‘నో హారన్ ప్లీజ్’కు చేరుకోవాలి. సమస్య ఏదైనా... చూస్తూ... బాధపడడం కంటే మనవంతుగా ఏదో ఒకటి చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నారు రవి. ఆ నమ్మకమే ఆయనతో ఎన్నో మంచి పనులు చేయిస్తుంది. -
హ్యాపీ బర్త్‌డే బరాత్!
ఆదర్శం పుట్టిన రోజూ పండగే అందరికీ! అందరికీనా? అభాగ్యులకు మాత్రం అన్ని రోజుల్లాగే అదొక రోజు. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పూనుకుంటుంది. ఇదేమిటో తెలుసుకునే ముందు అభిజిత్ బాజ్‌పాయ్ గురించి తెలుసుకుందాం. ఈ మార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఢిల్లీలో ఒకరోజు కారులో వెళుతుంటే దూరంగా ఒక దృశ్యం కనిపించింది. కొందరు వీధిబాలలు చిరిగిపోయిన బర్త్‌డే క్యాప్లతో, ఖాళీ కేక్బాక్స్లతో ఆడలాడుకుంటున్నారు. ఈ దృశ్యం అభిజిత్‌ను బాగా కదిలించింది. ‘‘పాపం ఈ పిల్లలకు బర్త్‌డేలు ఉండవు’’ అనుకున్నారు. ఆ రోజంతా ఆఫీసులో ఇదే విషయం గురించి ఆలోచించారు. ఇంటికి వెళ్లిన తరువాత తన ఆలోచనను భార్య సోనమ్‌తో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అలా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో అషిలా, లైలా అనే వీధి బాలల పుట్టిన రోజును ఒక వేడుకలా జరిపారు. తాము చేసిన పని గురించి ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టారు అభిజిత్. అద్భుతమైన స్పందన మొదలైంది. ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పేరుతో ఒక బృందం తయారైంది. ఈ బర్త్‌డే బరాత్ వీధిబాలలకు పుట్టిన రోజు వేడుకలోని మాధుర్యాన్ని రుచి చూపిస్తుంది. ఆ రోజు ఆ పిల్లలు ఆటలు ఆడతారు. పాటలు పాడుతారు. బర్త్‌డే కేకు కోస్తారు. కానుకలు తీసుకుంటారు. ఆ రోజంతా ఆనందంలో మునిగి తేలుతారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బరాత్ ఉద్దేశం డబ్బులు ఖర్చు చేయడం కాదు... వీధి బాలల కోసం కాస్త సమయాన్ని కేటాయించడం. ఆ కాసేపైనా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు కావడం’’ అంటున్నారు అభిజిత్. వీధిపిల్లలకే కాదు... క్యాన్సర్ బాధిత పిల్లలకు కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంది ‘హాపీ బర్త్‌డే బరాత్’ ‘హాపీ బర్త్‌డే బరాత్’ ఎందరికో స్ఫూర్తిని ఇస్తోంది. ఇప్పుడు ఢిల్లీలోనే కాదు పుణే, ముంబై, కోల్‌కతా, సూరత్, చెన్నై... మొదలైన ప్రధాన పట్టణాల్లో ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’లు జరుగుతున్నాయి. పేద పిల్లల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ‘‘ఈ పిల్లలకు తమ పుట్టిన తేదీ తెలియదు. వయసు తెలియదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు. బర్త్‌డే జరుపు కోలేదు. పుట్టిన రోజు పేరుతో మేము చేస్తున్న ఈ వేడుక వల్ల ఆ రోజు వారి కళ్లల్లో కనిపించిన సంతోషపు వెలుగును ఎప్పటికీ మరిచిపోలేం’’ అంటున్నాడు ముంబైకి చెందిన శరద్ జైన్. ‘‘మామూలు పిల్లలు ఎలాగైతే తమ బర్త్‌డే రోజు స్పెషల్‌గా ఫీలవుతారో... బర్త్‌డే బరాత్ రోజు వీధిబాలలు కూడా అలాగే ఫీలవుతారు. ఆ సమయంలో వారి కళ్లల్లోని ఆనందాన్ని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది’’ అంటాడు కునాల్. ఆదివారం వచ్చిందంటే సినిమా హాళ్ల వైపు పరుగులు తీసే ప్రీతి పరేఖ్, సలోనీ వర్మలు తొలిసారిగా ‘హ్యాపీ బర్త్‌డే బరాత్ పార్టీ’కి హాజరయ్యారు. వారి స్పందన ఇలా ఉంది... ‘‘మా సన్డే ఫన్ డేగా మారిపోయింది. ఈసారి మేము కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉండదలుచుకోలేదు. మేము కూడా ఇలాంటి బర్త్‌డే పార్టీలు చేయాలనుకుంటున్నాం’’ ఈ వీధి బాలల్లో చాలామంది ఫుట్‌పాత్‌లు, చౌరస్తాల దగ్గర చిన్న చిన్న వస్తువులు అమ్ముతారు. బర్త్‌డే పార్టీ వల్ల వారికి వచ్చే చిన్న ఆదాయానికి నష్టం రాకుండా వారి చేతుల్లో ఉన్న వస్తువులను తామే కొనుగోలు చేస్తున్నారు ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ సభ్యులు. విశేషమేమింటే ఈ బర్త్‌డే పార్టీలకు హాజరవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ‘‘బర్త్‌డే గురించి వినడమేగానీ ఇంతకు ముందు ఎప్పుడూ నా బర్త్‌డే జరుపుకోలేదు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కేకు ఎంతో రుచిగా ఉంది. ఈ రోజు నాకు చాలా మంచి రోజు’’ అంటున్నాడు రవి. సిగ్నల్స్ దగ్గర బెలూన్లు, పూలు అమ్మడం ద్వారా రవి రోజుకు కనీసం వంద రూపాయలు సంపాదిస్తాడు. ఆ మొత్తం ఇవ్వడంతో పాటు రవికి కొత్త బట్టలు, షూస్ కొనిచ్చారు ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ సభ్యులు. వీధి పిల్లలు, అనాథలు కేకు రుచి ఎప్పుడూ చూడకపోవచ్చు. అయితే ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పుణ్యమా అని తీయటి కేకు రుచి మాత్రమే కాదు... అంతకంటే తీయటి ‘ప్రేమ’ను రుచి చూస్తున్నారు! -
ఆదర్శ నేతలు
తమ పిల్లలను సర్కారు స్కూలుకు పంపిస్తున్న ప్రజాప్రతినిధులు సాధారణంగా సర్కారు బడంటేనే చిన్నచూపు.. కూలీ పనికి వెళ్లేవారు కూడా తమ పిల్లలను సర్కారు బడికి బదులు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.. ఇటువంటి రోజుల్లో కొందరు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరిపై ఈవారం సండేస్పెషల్ వారు ప్రజాప్రతినిధులు.. ఆర్థికంగా, సామాజికంగా పలుకుబడి కలిగినవారే.. పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్థోమత ఉన్నవారే.. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో తిరిగి, విద్యార్థులను సర్కారు బడులకే పంపాలని ప్రచారం చేశారు. తామే ఆదర్శంగా ఉండేందుకు పలువురు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్న నేతలపై సండే స్పెషల్.. బీర్కూర్ : తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు బీర్కూర్ ఎంపీపీ మీనా హన్మంతు. ఈనెల 9న గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం కోసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎంపీపీ మీనాహన్మంతు దంపతులు మాట్లాడారు. ఒకటో తరగతిలో తమ కుమారుడు శ్రీహర్షను చేర్పించడానికి అంగీకారం తెలిపారు. పాఠశాల పునఃప్రారంభం రోజు గ్రామంలోని గడివద్ద గల ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. 13న సర్కారు బడిలో అక్షరాభ్యాసం చేయించారు. శనివారం పాఠశాలలో విద్యారుథలకు పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తమ కుమారుడిని క్రమం తప్పకుండా సర్కారు బడికి పంపిస్తున్నామన్నారు. తన కుమారుడు అందిరితోపాటే క్యూలో వచ్చి పాఠ్యపుస్తకాలు తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుందని, సర్కారు బడులు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. మొదటినుంచీ.. నాగిరెడ్డిపేట : పోచారం సర్పంచ్ గోపాల్‌గౌడ్ తన కూతురు సాయిభవానిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. సాయిభవాని ఐదో తరగతి చదువుతోంది. తన కూతురును ఒకటో తరగతినుంచే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానని గోపాల్‌గౌడ్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే.. సర్కారు బడి బాగుపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఐదేళ్లుగా... సిరికొండ : తూంపల్లి సర్పంచ్ బూస దేవరాజ్ తన కూతురు హేమవర్షికను సర్కారు బడిలో చదివిస్తున్నారు. దేవరాజ్‌కు ఇద్దరు పిల్లలు. కూతురు హేమవర్షిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కుమారుడు రిషివర్ధన్‌కు మూడేళ్లు. తన కూతురును ఒకటో తరగతినుంచి సర్కారు బడిలోనే చదివిస్తున్నానని దేవరాజ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై గ్రామస్తులందరికీ నమ్మకం ఉండాలనే తన కూతురును ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానన్నారు. నమ్మకం పెంచేందుకే.. మాచారెడ్డి : ఘన్పూర్ (ఎం) ఎంపీటీసీ సభ్యుడు ఎడపల్లి శ్రీనివాస్ తమ ఇద్దరు పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆయన కూతురు మేఘనను చుక్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కుమారుడు కార్తీక్‌ను గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలల్లో చేర్చాలంటున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు.. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకే తన పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నానన్నారు. సర్పంచ్ కూతురు.. నిజాంసాగర్ : బూర్గుల్ సర్పంచ్ దుడ్డె అనితా సురేందర్ తన కూతురు షర్మిలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. షర్మిల మూడో తరగతి చదువుతోంది. సర్పంచ్ తన కూతురును ప్రభుత్వ పాఠశాలకు పంపుతుండడంతో గ్రామస్తులూ సర్కారు బడిని ఆదరిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు. -
ఆకాంక్ష గ్రామానికే ఆదర్శం
హర్యానా: హర్యానా రాష్ట్రం, గుర్గావ్ జిల్లా, బాజ్ఘెరా గ్రామానికి చెందిన ఆకాంక్ష ఇప్పుడు గ్రామానికే ఆదర్శంగా నిలిచింది. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక గ్రామంలో కనీస సౌకర్యాలు లేక పోవడం వల్ల ఎప్పుడూ చికాకు పడేది. రోజు వెళ్లే స్కూల్‌కు కూడా సరైన రోడ్డు లేక మురుగునీరు పారుతుంటే బాధ పడేది. ఓ రోజు ‘వియ్ ది పీపుల్’ అనే సంస్థ గ్రామంలో నిర్వహించిన ఓ పౌర కార్యక్రమానికి హాజరైంది. పౌరుల హక్కులే మిటో, బాధ్యతలు ఏమిటో, వారికి రాజ్యాంగం కల్పిస్తున్న భద్రత ఏమిటో ఆ కార్యక్రమంలో అవగాహన చేసుకొంది. ఊరి సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించుకుంది. అందుకు తోటి విద్యార్థులను తోడు చేసుకుంది. ఊరికి రోడ్లు వేయడం ఎవరి బాధ్యతో టీచర్లను అడిగి తెలుసుకొంది. తోటి విద్యార్థులతో కలసి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సరైన రోడ్లు వేయాల్సిందిగా కోరింది. ఆ సర్పంచ్ పట్టించుకోలేదు. ఆమె మాట వినలేదు. గుర్గావ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. గ్రామ రోడ్ల దుస్థితి గురించి వివరించింది. రోడ్లు వేయడం పంచాయతీ బాధ్యతంటూ రోడ్లు వేయాల్సిందిగా పంచాయతీని కోరుతూ ఓ సిఫారసు లేఖను తీసుకొచ్చింది. మళ్లీ సర్పంచ్‌ను కలిసింది. అయినా సర్పంచ్ పట్టించుకోలేదు. అయినా నిరుత్సాహ పడకుండా తోటి విద్యార్థులతో కలసి జిల్లా కలెక్టర్‌ను కలసుకుంది. విద్యార్థుల వివరించిన సమస్యలకు స్పందించిన జిల్లా కలెక్టర్ గ్రామానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేయడమే కాకుండా రోడ్ల పనులను వెంటనే చేపట్టాల్సిందిగా గ్రామ పంచాయతీని ఆదేశిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తీసుకొని వచ్చి మళ్లీ సర్పంచ్‌ను ఆకాంక్ష కలిసింది. కలెక్టర్ ఆదేశాలవడంతో సర్పంచ్ ఈసారి స్పందించారు. ఆగమేఘాల మీద రెండు నెలల్లో స్కూల్‌కు మంచి సిమ్మెంట్ రోడ్డు వేయించారు. ఆ తర్వాత గ్రామంలోని అన్ని రోడ్లను వేయించారు. ఊరు కళనే మారిపోయింది. ఎక్కడ మురుగు నీరు నిల్వకుండా కాల్వను కూడా తవ్వించడంతో గ్రామానికి కనీస సౌకర్యాలు సమకూరాయి. ఆకాక్ష కృషిని మెచ్చుకున్న గ్రామస్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని గ్రామానికి ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడి సాధించుకుంటున్నారు. ‘మన హక్కులేమిటో తెలుసుకున్నాక నాకో విషయం అర్థమైంది. పనులు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిందించడంకన్నా మన పనులను ప్రభుత్వంతో చేయించుకోవాలని. ముందుగా మన బాధ్యతలను నిర్వహిస్తే ప్రభుత్వం తన బాధ్యతను గుర్తిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనం గళం విప్పితేనే ప్రభుత్వం కదులక తప్పదు’ అన్న సందేశం ఆకాంక్ష ఇస్తోంది. ఆకాంక్ష పోరాటంతో గ్రామ సర్పంచ్ వైఖరి కూడా మారింది. -
నుదుటి రాత తిరగరాసి...
ఆదర్శం జీవితం బహుచిత్రమైనది. ‘ఇక అంతా మంచే జరుగుతుంది’ అనే నమ్మకంలో నుంచి పుట్టిన చిరునవ్వు పెదవుల మీద ఉండగానే... వెయ్యి రాక్షస హస్తాలతో చెడు ఎదురొస్తుంది. భయపడి బిక్కచచ్చేవాళ్లు ఉంటారు. జీవితం నుంచే పారిపోయే వాళ్లు ఉంటారు. కొందరు మాత్రం అదే చిరునవ్వుతో రాక్షసత్వానికి సవాలు విసురుతారు. జీవితాన్ని కొత్తగా వెలిగించుకుంటారు. ఆ మహా వెలుగు వారికి మాత్రమే కాదు... ఎందరో బాధితులకు దారి చూపుతుంది. ఏప్రిల్ 2006. వారణాసి నుంచి ఢిల్లీకి రైల్లో వెళుతున్నారు ప్రజ్ఞాసింగ్. రెండు వారాల క్రితమే ఆమెకు పెళ్లయింది. ఢిల్లీలోని ఒక కంపెనీలో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావడానికి బయలుదేరారు. ఆమె మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. తన ముందు పూలదారి ఒకటి కనిపిస్తుంది. తీయటి ఆలోచనలతో ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టింది... మంచి నిద్రలో ఉన్నప్పుడు ప్రజ్ఞాసింగ్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రజ్ఞా దూరపు బంధువు. తన కంటే పది సంవత్స రాలు పెద్దవాడు. ‘నిన్ను ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్రజ్ఞాకు ప్రపోజ్ చేశాడు. ప్రజ్ఞాతో పాటు, ఆమె తల్లిదండ్రులు కూడా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అవమాన భారంతో అతడు ప్రజ్ఞాపై విపరీతమైన కసి పెంచుకున్నాడు. ఆ కసి అతడిని రాక్షసుడిగా మార్చి యాసిడ్ దాడికి పాల్పడేలా చేసింది. ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయి. ప్రజ్ఞా రూపం పూర్తిగా మారిపోయింది. ఎడమ కన్ను బాగా దెబ్బతింది. కుడికంటి చూపు మందగించింది. ఒక దశలో ఇల్లు దాటి బయటికి రావడానికి భయపడేది. తనను తాను బతికున్న శవం అనుకునేది. చదువులో, సృజనాత్మక విషయాలలో ప్రతిభావంతురాలైన ప్రజ్ఞా ఫ్యాషన్ మేనేజ్మెంట్లో పీజీ, మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఏంబీఏ చేశారు. తన భవిష్యత్ గురించి కన్న అందమైన కలలన్నీ మసకబారిపోయాయి. కొద్దికాలం తరువాత ఆమె నిరాశ అనే చీకట్లలో నుంచి బయటకు వచ్చారు. భవిష్యత్ గురించి ఆలోచించారు. తనను తాను ఉత్సాహపరచు కున్నారు.యాసిడ్ దాడి జరగడానికి ముందు ప్రజ్ఞా ప్రజ్ఞాకు అన్ని విధాలా అండగా నిలబడ్డాడు భర్త సంజయ్‌సింగ్. ‘‘ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. నాకు అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచారు’’ అని భర్త సంజయ్ గురించి ప్రశంసపూర్వకంగా చెబుతారు ప్రజ్ఞా. యాసిడ్ దాడికి గురైన మహిళలకు అండగా నిలవడానికి 2013లో బెంగళూరులో ‘అతిజీవన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు ఆమె. యాసిడ్ దాడికి గురైన ఎందరో మహిళలకు ‘అతిజీవన్’ నుంచి అన్ని రకాలుగా సహాయ సహాకారాలు అందిస్తున్నారు. అందరూ ఆమెను ‘అక్క’ అని ఆత్మీయంగా పిలుస్తుంటారు. ‘‘యాసిడ్ దాడికి గురైన బాధితులను నా కుటుంబ సభ్యుల మాదిరిగానే భావిస్తాను. ఆశ్చర్యంగా చూస్తారనో, వెక్కిరిస్తారనో తమ అమ్మాయిని కొందరు తల్లిదండ్రులు బయటికి పంపించరు. అలాంటి వారితో ప్రత్యేకంగా మాట్లాడి మార్పు తెస్తున్నాను. నా జీవితం నుంచి వారికి ఎన్నో ఉదాహరణలు చెబుతున్నాను’’ అంటారు ప్రజ్ఞా. బాధితులకు ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు, స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన నైతికస్థైర్యాన్ని కూడా ఇస్తుంది ‘అతిజీవన్’. ఎందరో యాసిడ్ బాధితులు ‘అతిజీవన్’ ఆసరాతో విజయవంతమైన వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. ‘అతిజీవన్’ ప్రధాన లక్ష్యాలలో ఒకటి ‘స్కిన్ డొనేషన్’, ‘స్కిన్ బ్యాంకింగ్’ గురించి స్పృహను పెంచడం. అవగాహన కలిగించడం. కెమికల్, ఎలక్ట్రికల్, రేడియేషన్... వంటి వాటివల్ల చర్మం దెబ్బతిన్న వారికి, కాలిన గాయలకు గురైన వారికి స్కిన్బ్యాంక్లో స్టోర్ చేసిన స్కిన్ ఉపయోగపడుతుంది. యాసిడ్ బాధితులకు మరింతగా సహాయపడేందుకు ముంబైలోని ‘నేషనల్ బర్న్స్ సెంటర్’తో కలిసి పనిచేస్తున్నారు ప్రజ్ఞాసింగ్. ‘‘స్కిన్ డొనేషన్ గురించి స్పృహ కలిగించే ప్రచారాన్ని నిర్వహించినప్పుడు... అదేమిటి? అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కొద్దిమంది వైద్యులకు కూడా స్కిన్ బ్యాంకింగ్ గురించి సరియైన అవగాహన లేదు. స్కిన్డొనేషన్ కూడా ఐ డోనేషన్లాంటిదే’’ అంటున్నారు ప్రజ్ఞా. తాను కొత్తదారిలో నడవడమే కాదు... ఎందరికో దారి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆమె. -
దారి చూపుతున్న పాకెట్ మనీ
ఆదర్శం విద్యార్థికి చదువు అనేది విలువైన బహుమతి. విజ్ఞానం నుంచి మాత్రమే కాదు విషాదం నుంచి కూడా విలువైన పాఠాలు నేర్చుకునేవాళ్లే నిజమైన విద్యార్థులవుతారు. చెన్నైలోని ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూలు’ విద్యార్థులను గమనిస్తే వారు నేర్చుకునే పాఠాలు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదని, జీవితం నుంచి కూడా నేర్చుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది. గత సంవత్సరం చెన్నై వీధుల్లో భిక్షాటన చేసిన సరోజ... ఇప్పుడు పెరంబూర్ బస్‌స్టాప్ సమీపంలో రకరకాల ఫ్యాషన్ వస్తువులు అమ్ముతున్నారు. ఒక్క సరోజ మాత్రమే కాదు భిక్షాటనే ప్రపంచంగా బతికిన కొద్దిమంది యాచకులు ఇప్పుడు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సొంతకాళ్ల మీద నిలబడ్డామనే తృప్తి వారి కళ్లలో బలంగా కనిపిస్తోంది. ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూల్’ విద్యార్థులు తమ పాకెట్‌మనీతో యాచకులను మార్చడానికి, వారిని కొత్త దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. యాచకవృత్తిని వదిలి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్లలో సరోజ నుంచి నాగర్ వరకు ఎందరో ఉన్నారు. ‘‘ఒకప్పుడు రూపాయి కోసం కూడా చేయి చాపాల్సి వచ్చేది. ఇప్పుడు నేను సొంతకాళ్ల మీద నిలబడటమే కాదు కష్టాల్లో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాను. ఇదంతా ఆ పిల్లల చలవే. వారిది చల్లని మనసు’’ అంటోంది సరోజ. రోశమ్మ అనే యాచకురాలిని తమ స్కూల్లో హౌస్‌కీపర్ ఉద్యోగంలో చేర్పించడం ద్వారా ఆమెను యాచకవృత్తి నుంచి బయటికి వచ్చేలా చేశారు విద్యార్థులు. చిరిగిన మురికి దుస్తులతో దేవాలయాల దగ్గర యాచించే నాగర్ ఇప్పుడు ఆ పనికి స్వస్తి చెప్పాడు. ఒక స్టడీ టేబుల్ మీద చాక్లెట్లు అమ్ముతూ ఎవరినీ యాచించకుండా పొట్ట నింపుకుంటున్నాడు. అతడిలో మార్పు రావడానికి కారణం స్కూలు పిల్లలు. అయితే అందరు యాచకులు ఒకేలా స్పందించలేదు. ‘‘మాకు ఎవరి సహాయం అక్కర్లేదు’’ అని కొందరు ఎప్పటిలాగే యాచననే నమ్ముకున్నారు. అలాంటి వాళ్లలో కూడా కొందరిని మాటలతో మార్చారు ఆ విద్యార్థులు. ఆర్థిక సహాయం చేసి చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొనేలా చేయడమే కాదు... ఉద్యోగాలు చేయాలనుకున్నవారికి సెక్యూరిటీ గార్డ్, స్వీపర్...మొదలైన ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నారు. ఒక చిన్న సంఘటన విద్యార్థుల్లో పెద్ద మార్పు తీసుకువచ్చింది. ఒకసారి స్కూలు ముందు చిన్న అబ్బాయి, అమ్మాయి అడుక్కుంటూ కనిపించారు. ఈ దృశ్యం విద్యార్థుల మనసులను కదిలించింది. ఇక అప్పటి నుంచి ‘బెగ్గర్‌లెస్ సొసైటీ’ నినాదంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఉపాధ్యాయులు కూడా ఇందుకు మద్దతు పలికారు. ‘‘ఆనందం అనేది ఆటపాటల్లోనే కాదు...సేవ చేయడంలో కూడా ఉంటుందనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’’ అంటాడు క్రిస్టీ అనే విద్యార్థి. ‘‘యాచకులను చాలామంది దూరం పెడతారు. నిజానికి వారి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి మాటలు చెబితే... వారు యాచనకు దూరం అవుతారు. కొత్త జీవితాన్ని మొదలుపెడతారు’’ అంటోంది రోషిణి అనే విద్యార్థిని. ‘‘నేను మనిషిని అని చెప్పుకోవడం కంటే మానవత్వంతో కూడిన మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయడం ముఖ్యం. ఈ దిశలో అడుగులు వేయడానికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపల్ అనిత డేనియల్. విద్యార్థుల దగ్గర ధన సహాయాన్ని పొందిన వాళ్లలో కొందరు యాచకులు మళ్లీ కనిపించలేదు. కొందరు చిన్న చిన్న షాపులు పెట్టుకొని సొంతకాళ్ల మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నారు గానీ మద్యానికి బానిసై పక్కదోవ పడుతున్నారు. అయితే ఇవేమీ విద్యార్థులను నిరాశపరచడం లేదు. మార్పు అనేది ఒక్క అడుగుతో. ఒక్కరోజుతో మొదలు కాదనే విషయం వారికి తెలుసు. అందుకే భవిష్యత్ పట్ల ధీమాగా ఉన్నారు. బెగ్గర్‌లెస్ సొసైటీ గురించి చిన్న వయసులోనే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అందరితోనూ ‘శభాష్’ అనిపించుకుంటున్నారు. -
వీల్ పవర్!
ఆదర్శం ఇంటి నాలుగు గోడలే ఇక ఆమె ప్రపంచం అనుకున్నారు. వీల్‌ఛైర్ మీదే ఆమె జీవితం కాస్తా గడిచిపోతుందని అపోహపడ్డారు. విల్‌పవర్ గట్టిదైతే విజయాలు ఎలా క్యూ కడతాయో నిరూపించారు దీపామాలిక్! సుప్రసిద్ధ ‘జిందగీ ఏక్ సఫర్ హై’ పాట ఆమె నోట తరచుగా కవిత్వంగా వినిపిస్తుంటుంది. ఆ పాటలోని వెలుగు ఆమె కళ్లలో శక్తిగా స్థిరపడినట్లు అనిపిస్తుంది! ‘జిందగీ ఏక్ సఫర్ హై!’ నిజమే... ‘జీవితం అనేది ఒక అద్భుత ప్రయాణం’ రేపు ఏం జరగనుందో ఎవరికి మాత్రం తెలుసు?’ ఆర్మీ ఆఫీసర్ ముద్దుల కూతురిగా పెరిగిన దీపామాలిక్ (ఢిల్లీ)కి నాలుగు గోడల మధ్య ఉండడం కంటే వీలైనంత ఎక్కువ సమయం ఆరుబయట గడపడం అంటేనే ఇష్టం. ఎందుకంటే అక్కడ చెట్టు మాట్లాడుతుంది. పుట్ట మాట్లాడుతుంది. సమస్త ప్రకృతి తీయగా మాట్లాడుతుంది. రెండో అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు దీపకు అప్పుడప్పుడూ వెన్నునొప్పి వచ్చేది. వైద్యులను సంప్రదిస్తే పెరిగిన బరువే దీనికి కారణం అని చెప్పారు. రెండో అమ్మాయి పుట్టిన తరువాత కొంతకాలానికి పనిగట్టుకొని బరువు తగ్గారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే వెన్నెముకలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడుసార్లు జరిగిన సర్జరీల ప్రభావంతో ఆమె పక్షవాతానికి గురయ్యారు. చక్రాల కుర్చీలో ఇంటికే పరిమితం అయ్యారు. ‘‘విధిరాతను ఎవరు ఊహించగలరు? నిన్న మొన్నటి వరకు మన కళ్లముందే చలాకీగా తిరిగిన అమ్మాయికి ఈ నాలుగు గోడల గదే ప్రపంచం అయింది’’... ఇలాంటి చేదు సానుభూతి మాటలు తరచుగా వినిపించేవి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు చిన్న విషయాలుగా తోచినవే ఇప్పుడు చాలా పెద్ద సమస్యలై భయపెట్టసాగాయి. ఈ నిరాశ చీకట్లోనే ఒకవైపు నుంచి వెలుగు రేఖ ఒకటి దూసుకొచ్చింది. ‘నా జీవితం ఈ నాలుగు గోడల మధ్య ముగియడానికి ఎంత మాత్రం వీలులేదు’ అనుకున్నారు బలంగా. ముందు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలి. ప్రధానస్రవంతిలో తాను కూడా భాగం కావాలి. ఈ ఆలోచనతోనే ఒక చిన్న రెస్టారెంట్ మొదలు పెట్టారు. ఆ తరువాత కేటరింగ్ బిజినెస్ మొదలు పెట్టారు. రెండూ సూపర్ హిట్. దీప సాధించిన విజయం మీద ఒక టీవీ చానెల్ ప్రత్యేక షో చేసింది. ఆ షోలో దీప ఈత కొడుతున్న దృశ్యాన్ని చూసిన ఒక వ్యక్తి ‘పారా-స్పోర్ట్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉందా?’ అని అడిగాడు. అలా దీపా మాలిక్ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో ‘జీవితాన్ని మలుపు తిప్పే సందర్భం’ వస్తుంది. ముప్ఫైఆరు సంవత్సరాల వయసులో దీపకు అలాంటి అవకాశమే వచ్చింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పారా-స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను గెలుచుకున్నారు. ఇది మాత్రమే కాదు... స్విమ్మింగ్, జావెలిన్ త్రో, షాట్‌పుట్ మొదలైన ఆటల్లో జాతీయస్థాయిలో 54, అంతర్జాతీయ స్థాయిలో 13 బంగారు పతకాలను అందుకున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొని బైక్‌పై 1,700 కిలోమీటర్లు ప్రయాణించిన దీప అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో నాలుగుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ‘‘వీల్ చెయిర్ మీద ఆధారపడేవారు ఏమీ సాధించలేరనే మూస అభిప్రాయాన్ని చెరిపేయాలనుకున్నాను. నాలాంటి వాళ్లకు జీవనోత్సాహాన్ని ఇవ్వాలనుకున్నాను. జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు. జీవితం ఎంతో అనుకుంటే సాధించడానికి చాలా ఉంది’’ అంటారు దీప. కేవలం ఆటలకు మాత్రమే పరిమితం కాకుండా మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నారు దీపా మాలిక్. ‘మనలోకి మనం తొంగి చూసుకోవడం, భయాల స్థానంలో బలమైన సంకల్పాలను పాదుకొల్పడం, ఇతరుల నుంచి స్ఫూర్తి పొందడం, మనల్ని మనం ప్రేరేపించుకోవడం మొదలైనవి విజయం దిశగా మనల్ని తీసుకెళతాయి’ అంటారు దీప. ఒకప్పుడు ఉదయాన్ని చూస్తేనే చీకటి నరకంగా భయపడిన దీపా మాలిక్ ఇప్పుడు ‘జీవితం అంటే ఏమిటో కాదు... రోజూ జరుపుకునే ఏకైక పండగ’ అంటున్నారు! -
వెలుగు దారిలో...
ఆదర్శం రెండు సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయి నప్పుడు లోకమంతా చీకటి మయంగా తోచింది డా॥సంజయ్, డా॥శుభాంగి తంబ్వేకర్ దంపతులకు. తమ ముద్దుల కూతురు అరుంధతి లేని ఈ లోకంతో తమకు పనేమిటి అని కూడా అనిపించింది. చుట్టూ దట్టమైన చీకటి. ఆ చీకట్లో గోడ మీద అరుంధతి ఫోటోలో నవ్వు వెలుగుతోంది. ఆ అందమైన వెలుగును అజరామరం చేయాలంటే... తాము నిస్పృహలోకి, వైరాగ్యంలోకి జారిపోకూడదు. కూతురు పేరు మీద చేసే ప్రతి మంచి పని...ఆమెను తమ మధ్య సజీవంగా ఉంచుతుందని ఆశిస్తూ డా॥అరుంధతి ఫౌండేషన్ ప్రారంభించారు. చదువులో అత్యుత్త ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఫౌండేషన్ తరపున పురస్కారం ఇవ్వడం మాత్రమే కాదు.. రకరకాల మార్గాల్లో సేవాపథంలో పయనిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీక రిస్తున్నారు. రోడ్డు భద్రత గురించి కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించి వారితో ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు. దీనిలో... ‘నేను ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తాను’, ‘మద్యం తాగి ఎప్పుడు డ్రైవ్ చేయను’ ‘నా ఫోన్‌కు కాల్ వస్తే... బండి ఆపి మాట్లాడతాను’. ‘ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించను’ మొదలైన ప్రతిజ్ఞలు ఉంటాయి. అవగాహనా సదస్సులు, ప్రతిజ్ఞకు మాత్రమే పరిమితం కాకుండా రోడ్ల బాగోగులపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఫలానా చోట రోడ్డు చెత్తగా ఉంది అని తెలిస్తే సంబంధిత అధికారులు, ఆ ప్రాంత రాజకీయ నాయకులతో మాట్లాడి ఆ రోడ్డును మెరుగుపరిచే విధంగా ఫౌండేషన్ తరపున కృషి చేస్తున్నారు. కర్నాటకలోని కోలార్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీయంసీ)లో చదువు కుంటున్న అరుంధతి రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆమె హెల్మెట్ ధరించే ఉన్నారు. మితి మీరిన వేగంతో కూడా వెళ్లడం లేదు. రోడ్డు పరిస్థితి బాగోలేకపోవడం వల్లే అరుంధతి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అది తల్లిదండ్రులైన సంజయ్, శుభాంగిలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ‘‘అరుంధతికి కవిత్వం, భరత నాట్యంలో ప్రావీణ్యం ఉంది. తనలో సేవాదృక్పథం కూడా ఎక్కువే’’ అని కూతురు గురించి తడి కళ్లతో చెబుతారు డా॥శుభాంగి. ‘‘విధిరాత వల్లే ప్రమాదం జరుగు తుందనే మాటను నేను నమ్మను. ఏదో ఒక తప్పిదం లేకపోతే ప్రమాదం జరగదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ ప్రమాదాలను నివారించవచ్చు’’ అంటారు డా॥సంజయ్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్రమశిక్షణ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవు అంటున్న ఈ తంబ్వేకర్ దంపతులు స్కూలు, కాలేజీ స్థాయిలో విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్డు భద్రత గురించి అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. 5-10 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు కార్టూన్లు, కథల రూపంలో పై విషయాలపై అవగాహన కలిగిస్తున్నారు. 12-16 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థులకు డ్రైవింగ్‌లో జాగ్రత్తలు, జవాబుదారీతనం గురించి వీడియోల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేస్తున్న ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’లాంటి ఇతర సంస్థలతో కూడా కలిసి పని చేస్తుంది అరుంధతి ఫౌండేషన్. ట్రాఫిక్ నిబంధలకు తిలోదకలిచ్చే తల్లిదండ్రులను ఉద్దేశించి- ‘‘తల్లిదండ్రులే ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోతే... పిల్లలకు ఏది మంచో ఎవరు చెబుతారు?’’ అంటారు డా॥శుభాంగి. బెంగళూరులోనే కాదు ‘ఫ్రెండ్స్ ఆఫ్ ది అరుంధతీ ఫౌండేషన్’ పేరుతో దేశంలోని వివిధ నగరాల్లో రోడ్డు భద్రత గురించి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ, తమ కూతురు తమకు దూరమై నట్టుగా మరెవరూ అవ్వకూడదని తపిస్తున్నారు తంబ్వేకర్ దంపతులు. ‘‘మేము చేస్తున్న కృషి ఒక్కరి ప్రాణం కాపాడినా అంతకంటే కావాల్సింది ఏముంది!’’ అంటున్నారు ఇద్దరూ ఏక కంఠంతో. అరుంధతీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలతో ఎందరో ప్రభావితం అవుతున్నారు. ఈమధ్యే ఒక స్కూలు ప్రిన్సిపల్, సైకిల్‌పై వచ్చే తన విద్యార్థులకు ఉచితం హెల్మెట్లు కొని పెట్టారు. అంటే తంబ్వేర్ దంపతులు ఊహించిన స్పందన మొదలైనట్లే కదా! -
స్వచ్ఛ భారతీయుడు
ఆదర్శం ఇప్పుడంటే పారిశుధ్యం గురించి ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మారుమోగి పోతోందిగానీ, మూడు నాలుగు దశాబ్దాల క్రితం... అది ప్రజల్లో అంతగా అవగాహన లేని విషయం. ‘ఇది కూడా ఓ సమస్యేనా’ అనుకునే కాలం. అలాంటి కాలంలోనే డా॥మపుస్కర్ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కలిగించడానికి శంఖం పూరించారు. గత 50 ఏళ్లుగా పల్లెల్లో పారిశుధ్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. మెడిసిన్ పూర్తి చేసిన తరువాత పునే(మహారాష్ట్ర)కు దగ్గరిలోని దెహు గ్రామ హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారు మపుస్కర్. డ్యూటీలో చేరిన తొలిరోజు రాత్రి హాస్పిటల్ బయట పడుకోవడానికి సిద్ధమైనప్పుడు- ‘‘అయ్యా! ఇక్కడ పడుకోవడం ప్రమాదకరం. దెయ్యాలు తిరుగుతుంటాయి’’ అన్నారు ఒకరు. ఆ మాటలు తేలిగ్గా తీసుకొని హాయిగా నిద్రపోయాడు యువ డాక్టర్. తెల్లవారిన తరువాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి టాయిలెట్ కోసం వెతుకుతుంటే, ‘‘ఊళ్లలో టాయిలెట్లు ఉండవు సార్. చెట్ల చాటుకు వెళ్లాల్సిందే’’ అన్నాడు సిబ్బందిలో ఒకరు. అప్పుడే దృఢంగా అనుకున్నారు... ‘ఈ పరిస్థితిలో మార్పు తేవాలి’ అని! దానికి తోడు దెహు గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడు తున్నారని తెలిసింది. పారిశుధ్య లోపమే ప్రజల అనారోగ్యానికి కారణమవుతుందని ఆయనకు అర్థమైంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే బహిరంగ మలవిసర్జన అలవాటును మానిపించాలి. టాయిలెట్ల విలువ గురించి తెలియజేయాలి అనుకున్నారు మపుస్కర్. ‘దెయ్యాలున్నాయి’ అని చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్లి- ‘‘నిజమే... ఈ ఊళ్లో దెయ్యాలున్నాయి. అయితే అవి మీరనుకునే దెయ్యాలు కాదు. అపరిశుభ్రత అనే దెయ్యాలు’’ అన్నారు మపుస్కర్. తన కోసం హాస్పిటల్ పరిసరాల్లో తాత్కాలికంగా ట్రెంచ్ టాయిలెట్ నిర్మించారు. దీనికి మందుల బాక్సుల అట్టలను నలువైపులా గోడలుగా అమర్చారు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) వాళ్లు వేసిన ఒక పుస్తకం నుంచి ఓ నమూనాను ఎంపిక చేసుకుని, దాని ప్రకారం గ్రామంలో పది టాయిలెట్లు నిర్మించారు. కానీ డబ్ల్యూహెచ్‌వో పుస్తకంలోని డిజైన్లు ఇండియాకు సరిపోవనే విషయం అర్థమైంది. వానాకాలంలో అవి పనికి రాకుండా పాడైపోయాయి. అయినా తన ప్రయత్నం వీడకుండా పరిసరాల పరిశుభ్రత గురించి అలుపెరు గని ప్రచారాన్ని నిర్వహించారు మపుస్కర్. అయితే ఆయన తపనను తక్కువమంది అర్థం చేసుకున్నారు. ‘ఈయనకు పెద్దగా పని లేనట్లు ఉంది’, ‘చాదస్తం కాకపోతే పల్లెల్లో టాయిలెట్లు ఏమిటి?’ లాంటి కామెంట్లు ఎక్కువగా వినిపించేవి. అయినా తగ్గకుండా మరుగుదొడ్ల ప్రాము ఖ్యతను గురించి గ్రామంలో విసృ్తత ప్రచారం నిర్వహించారు. ఊరేగింపులు, చర్చలతో మొదలైన ప్రచారం చివరికి ఉద్యమ రూపం తీసుకుంది. ప్రజలు టాయిలెట్ల గురించి ఆసక్తిగా ఆరా తీయడం మొదలైంది. గ్రామ మరుగుదొడ్డి నిర్మాణ కమిటీ కూడా ఏర్పడింది. ‘నో ప్రాఫిట్-నో లాస్’ సూత్రంతో ఏర్పడిన ఈ కమిటీ ఒక్క నెలలోనే వంద టాయిలెట్లను నిర్మించింది. 1980 వచ్చేసరికి లక్ష్యానికి 90 శాతం చేరువయింది. ఆ తరువాత బయోగ్యాస్ టాయిలెట్ల గురించి ప్రచారం మొదలు పెట్టారు మపుస్కర్. దాంతో గ్రామంలో చాలామంది బయోగ్యాస్ టాయిలెట్ల నిర్మాణం వైపు మొగ్గు చూపారు. కేవలం దెహు గ్రామం దగ్గరే ఆగిపోలేదు మపుస్కర్. ‘జ్యోత్స్న ఆరోగ్య ప్రభోధన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా పారిశుధ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్యనే వృత్తి విరమణ పొందారు కానీ లక్ష్యం నుంచి మాత్రం కాదు! -
ఈ స్టార్... రెస్టారెంట్ల రూటే మార్చేశాడు!
ఆదర్శం వికలాంగుల కోసం నిపున్ మొదలు పెట్టిన పోరాటం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ప్రభుత్వాన్ని కదిలించింది. రెస్టారెంట్లలోనే కాక ఆఫీసులు ఇతరత్రా ప్రదేశాల్లో కూడా వికలాంగులకు ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆలోచించడం మొదలుపెట్టారు. ‘‘ఈరోజు సరదాగా అందరం కలసి రెస్టారెంట్‌కు వెళదాంరా...’’ ‘‘వెళదాం వెళదాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈరోజు మాత్రం తప్పకుండా వెళ్లాల్సిందే.’’ ‘‘ఆలస్యమెందుకు పదండి మరి.’’ ‘‘నాకైతే టైగర్ ప్రాన్స్ థాయి స్టైల్ కావాలి.’’ ‘‘నాకు క్రిస్పీ ఫిష్ విత్ రోస్టెడ్ చిల్లీ.’’ ‘‘నాకు ఇవేమీ వద్దు బాబూ... ఓల్డ్ ఫ్యాషన్డ చిల్లీ చికెన్ చాలు.’’ ‘‘ఆపండి మీ గోల... కెయా వచ్చేసింది.’’ సౌత్ ఢిల్లీ... కెయా రెస్టారెంట్. ఫ్రెండ్స్‌తో పాటు రెస్టారెంట్లోకి వస్తోన్న నిపున్ మల్హోత్రాను డోర్ దగ్గరే ఆపేశాడు మేనేజర్. ‘‘సారీ సార్. మా పాలసీ ప్రకారం వికలాంగులకు అనుమతి లేదు’’ అన్నాడు. ఆ స్నేహితుల బృందంలో అంత వరకూ ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా నీరు గారిపోయింది. ‘‘మీరు కానీయండిరా... నేను వెళతాను’’ అన్నాడు నిపున్. ‘‘నువ్వు లేకుండా పార్టీ ఏమిటి?!’’ అంటూ అందరూ వెనక్కి తిరిగి వచ్చారు. ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. నిపున్ తప్ప! మనసంతా చేదుగా ఉంది నిపున్కి. హోటల్లో తనకు ఎదురైన అనుభవం గుండెల్లో గుచ్చుతోంది. ఆ బాధ క్షణ క్షణానికీ హెచ్చుతోంది. ఎవరితో పంచు కోవాలో అర్థం కాలేదు. సోషల్ మీడి యాను ఆశ్రయించాడు. ఫేస్బుక్లో తన ఆవేదనను వెలిబుచ్చాడు. దానిపై పెద్ద చర్చ జరిగింది. వికలాంగుల హక్కుల సంఘాలు విరుచుకు పడ్డాయి. వెంటనే ఢిల్లీ ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. ఆ రోజుతో నిపున్ అందరికీ పరిచితుడు అయిపోయాడు. ఎందరో వికలాంగులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిపున్తో పంచుకున్నారు. అవన్నీ విన్న తరువాత మథనం మరింత ఎక్కువయ్యింది నిపున్లో. తనలాంటి వాళ్లందరి కోసం ఏదో ఒకటి చేయాలనే పట్టుదల పెరిగింది. అప్పుడే అతనికి ‘యెల్ప్’ గుర్తొచ్చింది. ‘యెల్ప్’ అనేది పాశ్చాత్య దేశాల్లో పాపులర్ యాప్. వికలాంగుల కోసం ప్రత్యేక సదుపాయలు ఉన్న రెస్టారెంట్ల గురించి యెల్ప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఒక కోర్స్ కోసం నిపున్ అమెరికాకు వెళ్లినప్పుడు దాని గురించి తెలిసింది. అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇలాంటి సదుపాయం ఇండియాలో ఎందుకుండకూడదు అనుకున్నాడు. అను కోవడమే కాదు, ఆ దిశలో ప్రయత్నం మొదలు పెట్టాడు. దానికోసం ‘జొమటో’ సహకారం తీసుకున్నాడు నిపున్. ‘జొమటో’ అనేది మన దేశంతో సహా 22 దేశాల్లో పనిచేస్తున్న సెర్చ్ అండ్ డిస్కవరీ సర్వీస్ వెబ్సైట్. 2008లో మొదలైన దీనిలో రెస్టారెంట్లకు సంబం ధించిన పూర్తి సమాచారం... మెనూ, ఫొటోలు, రివ్యూలతో సహా ఉంటుంది. ‘‘అమెరికా, బ్రిటన్ మొదలైన దేశాల్లో ఎటు వెళ్లినా డిజేబుల్డ్ ఫ్రెండ్లీ వాతా వరణం కనిపిస్తుంది. ఇలాంటిది మన దేశంలో కూడా కనిపించాలి’’ అంటూ రంగంలోకి దిగాడు నిపున్. ‘మన దేశంలో అది సాధ్యపడదు’ అని కొందరు నిరాశ పరిచినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వికలాంగుల హక్కుల కార్యకర్తలతో కలిసి ‘జొమటో’లో నమోదైన రెస్టారెంట్ల యజ మానులతో మాట్లాడాడు. వికలాంగుల ఇబ్బందుల గురించి వివరించాడు. వాళ్లకు అందరిలాగే జీవించి ఆనందించే అవకాశం కల్పించాలని కోరాడు. వాళ్ల మనసులు కదిలాయి. చాలామంది తమ రెస్టారెంట్లలో వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఇలాంటి రెస్టారెంట్ల గురించి చెప్పడానికి ‘డిజేబుల్డ్-ఫ్రెండ్లీ’ పేరుతో కొత్త ఫీచర్‌ను సైతం మొదలు పెట్టింది జొమటో. అయితే ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయి. డిజేబుల్డ్ అనేది పెద్ద ఏరియా. ఇందులోని అన్ని కోణాల గురించి ఆలోచించడం, వాటికి పరిష్కారా లను కనిపెట్టడం మనలాంటి దేశాల్లో కాస్త కష్టమే కావచ్చు. అందుకే ప్రస్తుతానికి రెయిలింగులు అడ్డం రాకుండా, వీల్ చెయిర్లు తిరగడానికి వీలుగా ఉండేలా తమ రెస్టారెంట్లను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు చాలామంది. బహుశా విక లాంగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించ డానికి అన్ని రెస్టారెంట్లూ మున్ముందు పూనుకోవచ్చు. తన ఆశయం సంపూర్ణంగా ఫలించినందుకు నిపున్ మల్హోత్రా పెదాలపై విజయపు నవ్వు కనిపించవచ్చు. -
బతుకు చిత్రాన్ని మార్చాడు!
ఆదర్శం చదువుకునే కుర్రాళ్లు రకరకాల కారణాలు చెప్పి, తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ పాకెట్ మనీ కొట్టేస్తుంటారు. స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటారు. రోహన్ పాటంకర్ కూడా ఒకప్పుడు అలా చేసినవాడే. కానీ ఇప్పుడు తను ఒక్క రూపాయి కూడా ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు చేయట్లేదు. కొందరు అభాగ్యులకు నీడ కల్పించడానికి ఖర్చు పెడుతున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మనసు చూపి ప్రశంసలు అందుకుంటున్నాడు! రోహన్ పాటంకర్... ఢిల్లీలోనే పుట్టి పెరిగాడు. అతనికి ఆర్కిటెక్చర్ అంటే ఇష్టం. అందుకే ఆ కోర్సులో చేరాడు. చదువు పూర్తయిపోవచ్చింది. ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సొచ్చింది. దాని కోసం నేపాల్ వెళ్లాడు. ఆ దేశం తనకి చాలా నచ్చేసింది. అక్కడి ప్రకృతి అందాల్ని చూసి ముగ్ధుడయ్యాడు. ప్రాచీన నిర్మాణాల నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. ఎప్పుడూ అక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. కానీ అదెలా కుదురుతుంది! ప్రాజెక్టు ముగిసింది. తిరిగి ఢిల్లీ వచ్చేశాడు. తన పనిలో పడిపోయాడు. కానీ సంవత్సరం తర్వాత తాను మళ్లీ నేపాల్ వెళ్తానని అతనప్పుడు అనుకోలేదు. 2015, ఏప్రిల్. వార్తలు చూస్తోన్న రోహన్ ఉలిక్కిపడ్డాడు. టీవీలో భయంకర మైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘోర భూకంపం నేపాల్ దేశాన్ని కుదిపేసింది. తాను చూసి మురిసిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. చెట్లను కూల్చేసింది. ఆ దేశపు అందాన్నే తుడిచి పెట్టేసింది. చాలా బాధేసింది రోహన్‌కి. ఆ దేశం అలా అయిపోవడాన్ని భరించలేక పోయాడు. అతనిని అన్నిటికంటే బాధిం చింది ఇంకోటింది... ఇళ్లు కూలిపోవడంతో వేలమంది ప్రజలు రోడ్ల మీద పడు కున్నారు. వాళ్లను చూసి రోహన్ మనసు అదోలా అయిపోయింది. తనకెంతో ఇష్టమైన దేశానికి, ఆ దేశ ప్రజలకి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఏం చేయగలనా అని పరిపరి విధాల ఆలోచించాడు. చివరికి ఓ మార్గం కనిపెట్టాడు. సాయపడాలి అనుకున్నదే తడవుగా ఫండ్స్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టాడు రోహన్. అయితే అది తేలిక కాదని అర్థమైంది తనకి. ఎవరూ అడిగిన వెంటనే ఇచ్చేయడం లేదు. కొందరు ఇచ్చినా ఏదో కాస్త ఇస్తున్నారు. దాంతో తాను ఏం చేయ గలడు! ఎంతని చేయగలడు! అందుకే ఓ ప్లాన్ వేశాడు. నేపాల్ అందాలను చక్కని స్కెచ్‌లుగా గీశాడు. వాటితో అందమైన పుస్తకాల్ని రూపొందించాడు. వాటిని తీసుకెళ్లి అందరికీ చూపించసాగాడు. అలా ఉండే దేశం ఇలా అయిపోయింది అంటూ భూకంపం తర్వాత పరిస్థితులను కళ్లకు కట్టే ఫొటోలను కూడా చూపించసాగాడు. దాంతో చాలామంది మనసులు కది లాయి. విరాళాలు ఇవ్వడానికి ముందు కొచ్చారు. అలాగే తాను వేసిన స్కెచ్లను ఫ్రేములు కట్టించి, పుస్తకాలుగా ముద్రించి అమ్మడం ద్వారా కూడా చాలా సొమ్మును సేకరించాడు. డబ్బు చేతికొచ్చింది. కానీ దానితో ఏం చేయాలి? ఆహారం కొని పంచి పెట్టాలా? లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చే యాలా? ఆలోచించాడు రోహన్. ఆహారం పంచిపెడితే ఒక్కసారో, రెండుసార్లో చేయడంతో సరిపోతుంది. ప్రభుత్వానికి ఇస్తే అది సద్వినియోగం అవుతుందో లేదో తెలీదు. కాబట్టి ఏదైనా శాశ్వత సహాయం నేపాలీయులకు అందేలా చేయాలి. అదే రోహన్ తపన. ఆ తపన అతనిలోని ఆర్కిటెక్ట్ బుర్రని తట్టి లేపింది. ఆ వెంటనే అతి తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించే విధానాన్ని కనిపెట్టాడు రోహన్. వెంటనే తన స్నేహితులు కొందర్ని తీసుకుని నేపాల్ బయలుదేరాడు. లక్ష్యం ఉన్నతమైనదైనప్పుడు దాన్ని సాధించడంలో ఓటమి ఉండదంటారు. రోహన్ విషయంలో అది నిజమయ్యింది. తన ప్రణాళికలను నేపాల్ ప్రభుత్వం ముందు ఉంచాడు రోహన్. స్థానికంగా దొరికే మెటీరియల్‌తో, అతి తక్కువ ఖర్చుతో ఇండ్లు ఎలా నిర్మించవచ్చో అతడు చెబుతుంటే అధికారులు ఆశ్చర్యంగా విన్నారు. ఆ ఆలోచనను అమలు పర్చడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. దాంతో తాను తీసుకెళ్లిన సొమ్ముతో నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించడం మొదలు పెట్టాడు రోహన్. ఖాట్మండుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పనౌటీ గ్రామంలో చకచకా ఐదు ఇళ్లు కట్టేశాడు. మరో ఐదు ఇళ్లు కట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అవి పూర్తవగానే అలాంటి ఇళ్లు మరికొన్ని కడతానని, ఆశ్రయం లేని పరిస్థితి ఎవరికీ లేకుండా చేస్తానని అంటున్నాడు రోహన్. నేను, నాది, నావాళ్లు అంటూ ఆలోచించేవాళ్లే ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో... ఓ యువకుడు తన సరదాలను, సంతోషాలను పక్కనబెట్టి, దేశం కాని దేశం వెళ్లి, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయడం సామాన్యమైన విషయం కాదు. అతడి మంచి మనసుకి, సేవానిరతికి అభినందనలు చెప్పి తీరాలి. నేపాల్‌లో రోహన్ కట్టించిన ఇల్లు ఇది. మన దేశంలో కూడా ఎంతోమంది ఆశ్రయం లేక అలమటిస్తున్నారు. వాళ్లందరికీ కూడా తన ప్రణాళికల ప్రకారం ఇళ్లు కట్టిస్తే బాగుంటుందని, ఖర్చు చాలా తక్కువ కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలనీ అంటున్నాడు తను. -
మనసున్నవాడు.. మార్గం చూపాడు!
ఆదర్శం ప్రతి మనిషికీ మనసుంటుంది. అయితే ప్రతి మనసూ స్పందించదు. ఎదుటివారి కోసం పరితపించదు. ఇతరులకు ఏదో ఒకటి చేయాలని ఆరాట పడదు. ధ్రువ్ లక్రాది స్పందించే మనసు. అందరి కోసమూ ఆలోచించే మనసు. అందుకే ఇవాళ అతని కారణంగా ఎంతోమంది జీవితాల్లోకి సంతోషం వచ్చింది. ముంబైకి చెందిన ధ్రువ్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత డీఎస్పీ మెరిల్ లించ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా జాయిన్ అయ్యాడు. జీతం, జీవితం బాగానే ఉన్నాయి. కానీ మనసే బాలేదు. ఏదో అసంతృప్తి. డబ్బు వద్దు. విలాసాలూ వద్దు. సరదాలు అసలే వద్దు. ఇంకేదో కావాలి. ఏమిటది? సేవ. పదిమందికి ఉపయోగపడాలి. లేకపోతే జీవితానికి అర్థమే ఉండదు. అలా ఆలోచించి దస్రా అనే సేవా సంస్థలో చేరాడు. చిన్న పిల్లల అక్రమ రవాణా నుంచి ఎన్నో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే సంస్థ అది. ఆ పోరాటంలో తానూ భాగమయ్యాడు ధ్రువ్. కానీ అంతలోనే ఆక్స్ఫర్డ్ యూని వర్సిటీలో ఎంబీయే సీటు వచ్చింది. దాంతో లండన్ వెళ్లిపోయాడు. తర్వాత ఇండియా తిరిగి వచ్చి ఓ బిజినెస్ పెట్టుకున్నాడు. మళ్లీ సేవ గురించి ఆలోచిస్తున్నప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. ఓ రోజు తన కారు చెడిపోతే.. ఆఫీసు నుంచి ఇంటికి సిటీ బస్సులో బయలు దేరాడు ధ్రువ్. అతని ముందు సీటులో ఒకబ్బాయి కూర్చున్నాడు. అతని దగ్గరకు కండక్టర్ వచ్చి, టికెట్ ఎక్కడికి ఇవ్వాలని అడిగాడు. ఆ అబ్బాయి సైగలతో చెప్పాడు. కండక్టర్‌కి అర్థం కాక మళ్లీ అడిగాడు. అతను మళ్లీ సైగ చేశాడు. అలా చాలాసేపు నడిచాక కండక్టర్‌కి విసుగొచ్చే సింది. దిగిపొమ్మని అరిచాడు. దాంతో ఆ యువకుడు ఓ పేపర్ పైన అతను ఎక్కడికి వెళ్లాలో రాసి చూపించాడు. ఇది చూసిన ధ్రువ్‌లో ఏదో చలనం. మనసులోని మాటలను బయటికి చెప్పాలని ఉన్నా చెప్పలేకపోవడం ఎంత బాధాకరమో కదా అనుకున్నాడు. గతంలోనూ అలాంటి చాలామందిని చూశాడు. చూసినప్పుడల్లా మథనమే. ఈరోజూ అంతే. అవే ఆలోచనలతో ఇంటికి చేరాడు. సరిగ్గా అప్పుడే ఓ కొరియర్ బాయ్ వచ్చాడు. ధ్రువ్‌ని చూసి చిరునవ్వు నవ్వి, కవర్ అందించాడు. సంతకం చేసి కవర్ అందుకుని లోపలికి వచ్చేశాడు ధ్రువ్. ఆ క్షణం... అతని మెదడులో ఓ కొత్త ఆలోచన మెదిలింది. అర నిమిషం కూడా పట్టలేదు కొరియర్ తీసుకోవడానికి. కొరియర్ బాయ్‌తో మాట్లాడే అవసరమూ రాలేదు. అంటే ఈ పనికి మాట, వినికిడి అవసరం లేదు. కాబట్టి ఆ రెండూ లేనివాళ్లు కొరియర్ బాయ్స్‌గా పని చేయవచ్చు. ఆ ఆలోచన వచ్చిందో లేదో... ఇక ఆగలేక పోయాడు ధ్రువ్. వెంటనే మిరాకిల్ కొరియర్ కంపెనీకి పునాది వేశాడు. మిరాకిల్ కొరియర్స్‌కు 2009లో హెలెన్ కెల్లర్ అవార్డు, 2010లో జాతీయ అవార్డులు దక్కాయి. అప్పటి అధ్యక్షురాలు ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ధృవ్ ఆ అవార్డును అందుకున్నాడు. మిరాకిల్ కొరియర్స్‌లో ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తుంటాడు. కొత్తగా వచ్చిన వారికి ఇంగ్లిష్, కంప్యూటర్లో శిక్షణ ఇస్తుంటాడు. జీవితంలో ఎదిగేందుకు ఏం చేయాలో, వైకల్యాన్ని ఎలా అధిగమించాలో చెప్పి వారిలో స్ఫూర్తిని నింపుతుంటాడు. మొదట ముగ్గురితో ప్రారంభమైన మిరాకిల్ కొరియర్స్‌లో ప్రస్తుతం 70 మందికి పైగా బాయ్స్ ఉన్నారు. అందులో అందరూ వినికిడి లోపం ఉన్నవారే. ఆడ పిల్లలకేమో కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి డేటా ఆపరేటర్లుగా నియమించాడు. ఆర్డర్లు, డెలివరీల వివరాలను వాళ్లు ఆన్ లైన్లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ నెలకు అరవై అయిదు వేల డెలివరీలకు పైగా చేస్తోందట. మహీంద్ర అండ్ మహీంద్ర, ఆదిత్య బిర్లా గ్రూప్, గోద్రెజ్, విక్టరీ ఆర్ట్ ఫౌండేషన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ కంపెనీ క్లయింట్సే. ఆరెంజ్ కలర్ యూనిఫామ్‌లో, నగరమంతా చకచకా తిరుగుతూ, తమ వైకల్యాన్ని మర్చిపోయిన ఆ యువకులని చూసి మురిసిపోతుంటాడు ధ్రువ్. ఇప్పు డతని మనసులో అసంతృప్తి అన్నదే లేదు. - నిఖిత నెల్లుట్ల -
పచ్చని కల!
ఆదర్శం తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. రికిన్ గాంధీ విషయంలో అది నిజమని తేలింది. న్యూజెర్సీలో పుట్టి పెరిగిన రికిన్... ఎప్పుడూ ఆకాశం వైపు చూసేవాడు. ఎందుకంటే పైలట్ కావాలనేది కల. కానీ దైవం మరొకటి తలచినట్లుంది. అందుకే పెద్దయ్యాక అతను భూమి వైపు చూశాడు. ఎండి పోయిన పంట పొలాల వైపు చూశాడు. రైతు కళ్లల్లోని నీళ్ల వైపు చూశాడు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ కుమారుడైన గాంధీకి చిన్నప్పట్నుంచీ అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై మక్కువ ఎక్కువ. వాటి గురించి ఏ చిన్న సమా చారం పేపర్లో వచ్చినా కట్ చేసుకొని భద్రపరుచుకునేవాడు. ఆస్ట్రోనాట్స్ జీవిత చరిత్రలను శ్రద్ధగా చదివేవాడు. వారిలాగా తనూ ఆకాశంలో ఎగరాలని తపించేవాడు. కానీ ఓ చిన్న కంటి సమస్య అతని కలకు అడ్డుపడింది. లేజర్ సర్జరీ చేయించుకుని తన చిరకాల లక్ష్యాన్ని అందుకోవాలను కున్నాడు. ఈలోపు బెంగుళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ ల్యాబ్‌లో కొన్నాళ్లు పనిచేయడానికని ఇండియా వచ్చాడు. ఆ క్రమంలో తన మిత్రుడితో కలిసి ఎన్నో గ్రామాలు తిరిగాడు. అది అతడి లక్ష్యాన్ని అమాంతం మార్చేసింది. గ్రామాలను చూడడం రికిన్కి అదే మొదటిసారి. వెళ్లిన చోటల్లా రైతులు తారసపడేవారు. భూములు ఎండి, పంటలు పండక తాము పడుతున్న కష్టాల గురించి చెబుతుండేవారు. వారి దీనస్థితి రికిన్ మనసును కదిలించింది. ‘వీరి కోసం నేనేమీ చేయలేనా?’ అని ఎంతో ఆలోచించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘డిజిటల్ గ్రీన్’ స్వచ్ఛంద సంస్థ. ఏదో ఒకటి చేసి రైతుల సమస్యలు తీర్చే తీరాలనుకున్న రికిన్, అందుకు తగ్గ ప్రణాళికల్ని పక్కాగా వేసుకున్నాడు. డిజిటల్ గ్రీన్ సంస్థకు పునాది వేశాడు. వీడియోల ద్వారా రైతుల సమస్యలను రికార్డ్ చేయడం, పరిష్కారాలను వీడియోల ద్వారానే రైతులకు చేర్చడం, సక్సెస్ స్టోరీలను హైలెట్ చేయడం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా ప్రశ్న-జవాబుల కార్యక్రమం నిర్వహించి నిపుణుల ద్వారా రైతులకు సలహాలు అందించడం ‘డిజిటల్ గ్రీన్’ లక్ష్యం. ఇప్పటివరకు 2,600 వీడియోలను 7 రాష్ట్రాల్లో, రెండు వేలకు పైగా గ్రామాల్లో,1,50,000 మందికి పైగా రైతులు చూశారు. ఎనిమిది నుంచి పది నిమిషాల నిడివి గల ఈ వీడియోలు... పంటలను ఎలా పండించాలి, ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి వంటి పలు అంశాలను వివరిస్తాయి. అది మాత్రమే కాదు. పంటలు పండక, నిరాశ పెరిగి, ఇక వ్యవ సాయం చేయడమే దండగ అనిపించి నప్పుడు ఆ నిస్పృహను ఎలా మనసు నుంచి పారద్రోలాలో చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాలూ ఉంటాయి. వీటితో పాటు రైతుల విజయగాథలు మిగతా రైతులకు ఆత్మస్థైర్యాన్నిస్తున్నాయి. ‘‘ఈ వీడియోల పుణ్యమా అని పంట ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది’’ అని ఎవరైనా రైతు చెబితే... తాను చేస్తోన్న పని మీద మరింత గౌరవం కలుగుతుందంటాడు గాంధీ. ఈ ఆనందంలో పైలట్ కావాలన్న లక్ష్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. రైతుల కంట తడి కాకుండా సంతోషం చూడటమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నాడు. ఢిల్లీలోని తన ఆఫీసులో రైతులతో సంభాషించడం, వ్యవసాయంపై వచ్చిన తాజా పుస్తకాలను చదవడం ఇప్పుడు గాంధీకి ఇష్టమైన పని. ‘‘కొందరు రైతులు వ్యవసాయం చేస్తూ, మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. కొందరు రైతులు లాభాలు గడించకపోగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఏమిటీ వైరుధ్యం అనిపించింది. సమస్య ఇక్కడే ఉంది. సమాధానం ఇక్కడే ఉంది. ఆ సందేహాన్ని, సమాధానాన్ని ఒక్కచోట చేరిస్తే ఎంతోమంది రైతులకు ప్రయోజనం ఉందనిపించింది. అదే లక్ష్యమైంది. అదే నా జీవితమైంది’’ అంటాడు గాంధీ. వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబడి ఉన్న ఇండియాని ఆ దిశగా ముందుకు నడిపించ డమే ప్రస్తుతం రికిన్ కంటోన్న పచ్చటి కల. ఆ కల నిజమవ్వడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు! ఆ స్ఫూర్తితో... అంతరిక్షయానం చేసిన కొందరు పై నుంచి భూమిని చూసి... ఇంత అందమైన, అద్భుతమైన గ్రహంపై యుద్ధాలు, పేదరికం ఉండడం దురదృష్టం అనుకున్నారట. భూమి మీదికి వచ్చిన తరువాత సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపాధ్యాయులుగా మారారట. కొందరయితే వ్యవసాయం కూడా చేశారట. ఇలాంటివన్నీ చదివిన తరువాత తనలోనూ మార్పు వచ్చిందని, అదే ‘గ్రీన్ డిజిటల్’ స్థాపనకు దారితీసిందని చెబుతుంటాడు రికిన్. ఎవరినో చూసి అతడు స్ఫూర్తిని పొందాడు. ఇప్పుడు తనే ఎందరికో స్ఫూర్తినిస్తున్నాడు! -
నిర్మల హృదయుడు!
ఆదర్శం * ఆశయమే అతడి ఊపిరి * అందరి క్షేమమే అతడి లక్ష్యం * మరి ఆ లక్ష్యం నెరవేరిందా?! మంచి పనులు అనేవి గాల్లో నుంచి ఊడిపడవు. మనం చూసిన సంఘటనలే... మంచి పనులకు పునాదులవుతాయి. నిజం చెప్పాలంటే పవన్‌కు పుస్తక ప్రపంచం గురించి తప్ప వాస్తవ ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. అలాంటి వ్యక్తికి ‘సెర్చ్’ పుణ్యమా అని వాస్తవ పరిస్థితులను చూసే అవకాశం దొరికింది. ‘సెర్చ్’ (సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్)లో రెండున్నర సంవత్సరాల ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చింది పవన్‌కి. గడ్చిరోలిలోని చాలా గ్రామాల్లో డయేరియా సోకి జనాలు చనిపోతుం టారు. అంతగా డయేరియా ప్రబలడానికి అపరిశుభ్ర పరిస్థితులే కారణమని తన స్టడీ ద్వారా గుర్తించాడు పవన్. ఒక గ్రామంలో 64 కుటుంబాలు ఉంటే, కేవలం 6 కుటుంబాలకు మాత్రమే టాయ్‌లెట్‌కి వెళ్లాక సబ్బుతో చేతులు కడు క్కోవాలనే అవగాహన ఉందని తెలిసి ఆశ్చర్య పోయాడు. అయితే అది సబ్బులు లేక పోవడం వల్ల వచ్చిన సమస్య కాదు. లక్స్ నుంచి సంతూర్ వరకు వారి దగ్గర అన్ని రకాలైన సబ్బులూ ఉన్నాయి. అయితే వారి దృష్టిలో సబ్బు అంటే సౌందర్య సాధనం మాత్రమే. మురికి వదిలించుకోవడానికి సబ్బును ఉపయోగించాలి అనే అవగాహన వారిలో లేదు. ఈ పరిస్థితిని నివారించి ప్రజలలో ఆరోగ్యస్పృహ కలిగించడం ఎలా అని ఆలోచించాడు పవన్. సరిగ్గా అప్పుడే తన ఫ్రెండ్ డా॥మానస్ కౌశిక్ ద్వారా టిప్పీ టాప్ గురించి విన్నాడు. డా॥జిమ్ వాట్ తయారు చేసిన హ్యాండ్ వాషింగ్ పరికర మైన ‘టిప్పీ టాప్’కు న్యూజిలాండ్‌లో మంచి ఆదరణ ఉంది. ధర కూడా చాలా తక్కువ. దాని స్ఫూర్తితో ఒక తాడు, సబ్బు, కొన్ని పుల్లలతో ఒక హ్యాండ్ వాషింగ్ పరికరాన్ని డిజైన్ చేసి దానికి ‘నిర్మల్’ అని పేరు పెట్టాడు. ఓ చిన్న క్యాన్ లాంటి దానికి గొట్టం మాదిరిగా ఉంటుంది. దాన్ని నొక్కగానే లిక్విడ్ బయటకు వస్తుంది. దాంతో చేతులు కడుక్కోవచ్చు. అదీ నిర్మల్ పరికరం. తన ప్రాజెక్ట్‌కు ప్రచార సారథులుగా బడి పిల్లలను ఎంచుకున్నాడు పవన్. మొదటిసారిగా... కుడకువయి ప్రైమరీ స్కూల్లో ‘నిర్మల్’ను పరిచయం చేసి ఎలా తయారు చేయాలో పిల్లలకు చెప్పాడు. చేతులను కడుక్కునే విషయంలో వరల్డ్ హెల్త్ ఆర ్గనైజేషన్ ఇచ్చిన సూచనలను తమాషా పాఠాల రూపంలో రాసి పిల్లలకు నేర్పించాడు. ‘నిర్మల్’ను ఎలా ఉపయోగించాలనేది ఆటల రూపంలో చూపాడు. ఈ ప్రయోగం విజయం సాధించడం, నలభై రూపాయల లోపే ‘నిర్మల్’ను తయారు చేసుకొనే సౌలభ్యం ఉండడంతో ఈ ప్రాజెక్ట్ వేగంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. ఒకవైపు ఫిజీషియన్‌గా పని చేస్తూనే మరోవైపు, తన ఖాళీ సమయాన్ని పూర్తిగా ‘నిర్మల్’ కోసం ఉపయోగించేవాడు పవన్. పిల్లల్నే కాదు, పెద్దలను కూడా నిర్మల్‌లో భాగస్వాములను చేయాలనుకున్నాడు. ఊళ్లో ఏ పండగ జరిగినా బహిరంగ ప్రదేశాల్లో ‘నిర్మల్’ పరికరాలను ఏర్పాటు చేసి ఆ ఊరి ఆడవాళ్లతో పూజలు చేయించే వాడు. దాంతో ‘నిర్మల్’ వారి సంస్కృతిలో భాగమైపోయింది. ఇప్పుడు చేతుల శుభ్రత గురించి మాత్రమే కాదు... పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన నీటిని గురించిన అవగాహన కూడా ప్రజలకు వచ్చింది. డయేరియా మరణాలు తగ్గిపోయాయి. గడ్చిరోలి గ్రామీణ ప్రాంతాల్లో ‘పొగ తాగడం’ అనేది కూడా ఎక్కువగా కని పిస్తుంది. నాలుగైదు సంవత్సరాల పిల్లలు కూడా పొగ తాగుతుంటారు. దీనిపై కూడా దృష్టి పెట్టాడు పవన్. ‘మంచిది కాదు, మానండి’ అంటే వారు వినరని తెలుసు. అందుకే పొగ నుంచి వారి దృష్టి మళ్లించడానికి రకరకాల ఆటలను ఎంచు కొని, పిల్లల్తో ఆడిస్తూ, ఆటల ద్వారానే పొగతాగడం వల్ల కలిగే దుష్పరిణా మాలను ఒక కథలా చెప్పడంతో చాలామంది పొగతాగే అలవాటు నుంచి దూరమయ్యారు.రెండు ఘన విజయాలను సాధించిన పవన్... ప్రస్తుతం సైన్స్‌ను సామాన్య జనానికి చేరువ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. -
ఇదేమి ఆదర్శం?
రామచంద్రపురం: కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే సాకుతో ప్రభుత్వం ఉన్నబడులకు మంగళం పాడేందుకు, ఉపాధ్యాయులను బోధనేతర విధులకు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేతకు తెర తీసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఈనెల 6న మార్గదర్శకాలను జారీ చేసి ఈనెల 15లోగా నివేదికలు అందించాలని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అటు ఉపాధ్యాయుల్లో, ఇటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని 3,842 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 7 వేల మంది సెకండరీ గ్రే డ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గ్రామీణ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుందనే నెపంతో ఇటీవల మండలంలో క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభు ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావటంతో విరమించుకుంది. తాజాగా పంచాయతీ, మున్సిపాలిటీలను యూనిట్‌గా తీసుకుని ఒక్కో ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పంచాయతీల్లో ఒక కిలోమీటరు పరిధిలో గల ప్రాథమిక పాఠశాల లేదా 30 మందికి తక్కువ విద్యార్థులున్న పాఠ శాలలను విలీనం చేసి వంద మంది విద్యార్థులతో ఆదర్శపాఠశాలను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒక్కో ఆదర్శ పాఠశాలలో అయిదుగురు ఉపాధ్యాయులను నియమించి తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనే విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 584 పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని విద్యాశాఖాధికారుల అంచనా. కొత్త ఎస్జీటీల నియూమకం ఎక్కడ? ఆదర్శ పాఠశాలల్లో సర్దుబాటు కాకుండా మిగిలిపోయిన ఉపాధ్యాయులను బోధనేతర విధులకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాలో సుమారుగా 3 వేల మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు బోధనకు దూరం కానున్నారని అంచనా. వారిని ఎంఈఓ, డీవైఈఓ, డీఈఓ, డైట్ సర్వశిక్షాభియాన్ కార్యాలయాల్లో, ఇతరత్రా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవటం తగదని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పాఠశాలల విలీనంతో 3 వేల మందికి పైగా ఎస్జీటీలు ఖాళీ అవుతుంటే తాజా డీఎస్సీ ద్వారా నియమితులు కానున్న 844 మందిని ఎక్కడ నియమిస్తారని ప్రశ్నిస్తున్నారుు. -
వివేకానందుని మార్గం ఆదర్శనీయం
కేంద్ర మంత్రి సదానందగౌడ బెంగళూరు: వివేకానందుని ఆదర్శాలు నే టి తరానికి ఆదర్శనీయమని కేంద్ర న్యాయశా ఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో భాగంగా సోమవారమిక్కడి యశ్వంతపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివేకానందుని విగ్రహాన్ని సో మవారం ఆయన లాంఛనంగా ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఏ విధంగా ఆలోచించాలో, ఎలా ఉండాలో వివేకానందుడు మార్గనిర్దేశనం చేశారన్నారు. ఆ మార్గంలో యువత సాగితే విజయాలను సొం తం చేసుకోవచ్చునన్నారు. కేంద్ర ఎరువులు, ర సాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మా ట్లాడుతూ స్వామి వివేకానందుని మార్గాన్ని అ నుసరిస్తూ దేశాన్ని మరింత బలోపేతం చేసే ది శగా యువత ముందుకు సాగాలని సూచించా రు.మాజీ మంత్రి ఎస్.సురేష్‌కుమార్, ఎమ్మెల్యే అశ్వత్థనారాయణ పాల్గొన్నారు. -
అందరికీ ఆదర్శంగా నిలిచిన మంత్రి!
బెంగళూరు: ఉన్నవాళ్లూ లేనివాళ్లూ అందరూ ఖర్చుకు వెనకాడకుండా అతిగా ఖర్చు చేసి పెళ్లిళ్లు చేసే ఈ రోజులలో ఓ మంత్రి తన కుమార్తె వివాహాన్ని అతి నిరాడంబరంగా చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ తన కుమార్తె వివాహాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సాధారణంగా నిర్వహించారు. తన కుమార్తె కోసం దాచిన మొత్తంతో సామూహిక వివాహాలను నిర్వహించారు. అదే వేదికపై తన కుమార్తె వివాహాన్ని సైతం జరిపించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ కుమార్తెను కూడా అందరూ అభినందించారు. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ స్వయంగా సామూహిక వివాహాలు నిర్వహించడంతో పాటు తన కుమార్తె పెళ్లి కూడా అందులో జరిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన కుమార్తె వివాహాన్ని ఘనంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించకుండా పేదల మధ్యే ఎలాంటి హంగూ.. ఆర్భాటాలకు తావివ్వకుండా నిరాడంబరంగా చేపట్టారు. చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, మఠాధీశులు హాజరయ్యారు. చిత్రదుర్గం : జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణంలో బుధవారం సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి జే.ఆంజనేయ నేతత్వంలో 97 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన కుమార్తె అనుపమతో శాశ్వత్ వివాహం కూడా జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన వారి పెళ్లిళ్లతో పాటు మంత్రి కూతురు పెళ్లి జరగ డంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మఠాధీశులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఇదే వేదికపై మంత్రి తన కుమార్తె పెళ్లి కూడా జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం నూతన వధువరులను సీఎం, మఠాధీశులు ఆశీర్వదించారు. కాగా ఈ సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఒక్కొక్క జెర్సీ ఆవును కానుకగా అందించడం గమనార్హం. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఐడియల్’
జిన్నూరు (పోడూరు) : స్థానిక ఐడియల్ స్కూల్ విద్యార్థులు 14 మంది ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు. సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ‘నైమిశ వేంకటేశ శతకం’లోని 108 పద్యాలను 1,850 మంది ఏకకాలంలో ఏక కంఠంతో గానం చేసిన శతకధారణ కార్యక్రమం ద్వారా తమ విద్యార్థులు ఈ ఘనత సాధించినట్టు కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. గుంటూరు సం పత్‌నగర్‌లోని శారదా పరమేశ్వరి ఆలయం లో ఈ నెల 19న ఈ కార్యక్రమం జరిగిందన్నారు. 1,850 మందిలో తమ విద్యార్థులు కలిగొట్ల మేఘన, యాండ్ర తేజస్వి, పెన్మెత్స రేణుక, బొర్రా మౌనిక, గోపరాజు కృష్ణలహరి, మల్లుల భావన, ఎస్.వెన్నెల, రావూరి నవ్యశ్రీ, సిరిమల్ల లక్ష్మీప్రియ, నుదురుపాటి సుబ్రహ్మణ్యం, సిరిమల్ల మణికంఠ కార్తీక్, ఎస్.శ్రీకార్తికేయ, మామడిశెట్టి బేబీ శ్రీ మంజు, కె.సాయిశ్రీ పవన్ ఉన్నారని చెప్పారు. వీరిని, శిక్షణనిచ్చిన టీచర్ మణిని అభినందించారు. -
అన్నార్తులను వెతుక్కుంటూ వెళ్తాడు!
ఆదర్శం రేగిన జుట్టు, మాసిన బట్టలు, వాడిన ముఖంతో, బిక్కచూపులు చూస్తూ ఎవరైనా అనామకుడు మన ముందు చెయ్యి చాస్తే ఏం చేస్తాం? వెంటనే ముఖం తిప్పేస్తాం. అంతకీ జాలేస్తే రూపాయో, రెండు రూపాయలో చేతిలో పెడతాం. కానీ ఆ యువకుడు అలా కాదు. అతడి దగ్గరకు వచ్చి ఎవరూ చేయి చాచనక్కర్లేదు. అలాంటి వారిని పనిగట్టుకుని వెతుక్కుంటూ తానే వెళ్తాడు. వాళ్ల కడుపు నింపి వస్తాడు. ఆకలి కడుపులు నింపడం కన్నా పుణ్యం ఏముంటుంది! కానీ అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నోరు తెరచి అడిగితే పట్టెడన్నం పెడతారేమో కానీ, పట్టెడన్నం పెట్టడం కోసమే ఆకలితో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లడం అనేది అందరూ చేయగలిగేది కాదు. ఖాదర్‌బాబు లాంటి ఏ కొందరో మాత్రమే చేయగలిగే గొప్ప పని అది! కృష్ణాజిల్లా, ఎ.కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన అతడు మానవసేవలో తరిస్తున్నాడు. మనుషుల్లోనూ మాధవుడు ఉంటాడని నిరూపిస్తున్నాడు. ఫుట్‌పాత్‌లు, పేవ్మెంట్లపై ఆకలితో లుంగచుట్టుకుపోయి, ముడుచుకుని పడుకున్న వారిని లేపి, వారికి కడుపునిండా అన్నం తినిపించి, మంచినీళ్లు తాగించి వారి ఆకలి తీరితే చాలు... కోటి రూపాయలు దొరికినంతగా సంబర పడతాడు ఖాదర్‌బాబు. అతని తండ్రి అతావుల్లా ఖాదరీబాబా కూడా అంతే! రోజూ కొన్ని వేలమంది అన్నార్తులకు భోజనం పెట్టి, వాళ్లు ఆవురావురుమని తింటుంటే... సంతోషపడిపోతారు. అదే ఖాదర్కీ అలవడింది. అయితే తేడా ఒక్కటే. తండ్రేమో తన దగ్గర కు వెళ్లినవారి కడుపులు నింపుతాడు. తనయుడేమో ఒకడుగు ముందుకు వేసి... ఆహారం పొట్లాలు కొనుక్కుని వెళ్లి, తానే స్వయంగా తినిపించి మరీ వస్తాడు. అలా అని ఈ తండ్రీ కొడుకులు కోట్లకు పడగెత్తిన వారేమీ కారు. సాటివారికి సేవ చేయాలన్న సంకల్పం బలంగా ఉన్నవారు మాత్రమే! బాల్యంలోనే బీజం... ఖాదర్‌బాబు తండ్రి అతావుల్లా ఖాదరీబాబా వ్యవసాయం చేసేవారు. ఎనిమిది మంది పిల్లలు. అంటే ఇంట్లో మొత్తం పదిమంది. అందరికీ ఆయన సంపాదన ఒక్కటే ఆధారం. అయినా కూడా ఉన్నంతలో అందరికీ పెట్టే స్వభావం ఆయనది. ఇంటికెవరొచ్చినా కడుపునిండా భోజనం పెట్టి పంపడం ఆయనకు అలవాటు. అందుకు ఆయన భార్య కూడా సహకరించేది. విసుగు లేకుండా ఎంతమందికైనా వండి పెట్టేది. ఆ దంపతుల దాతృత్వం గురించి తెలిసి ఆకలితో అల్లాడుతున్న ఎంతోమంది వచ్చి చేయి చాచేవారు. వాళ్లందరికీ సుష్టుగా భోజనం లభించేది ఆ ఇంట్లో. అది ఖాదర్బాబులో స్ఫూర్తిని నింపింది. సేవ చేయాలన్న తపన బాల్యం నుంచే పెరిగింది. ఇంటికొచ్చినవాళ్లకి తన తండ్రి ఎలాగూ పెడుతున్నాడు కాబట్టి ఇంటిదాకా రాలేకపోతున్నవారి కోసం తానే వెళ్లాలి అనుకునేవాడు. ఓసారి అనుకోకుండా రోడ్డు పక్కన ఉన్న వృద్ధ యాచకుడికి ఆహారం తినిపించాడు ఖాదర్. కడుపు నిండిన ఆ యాచకుడి కళ్లలో ఆకలి తీరిన ఆనందం కదలాడింది. దానికితోడు అతను ఖాదర్ తలమీద చేయి వేసి... ‘నువ్వు చల్లగా ఉండాలి బాబూ’ అని దీవించడం ఎంతో తృప్తినిచ్చింది ఖాదర్‌కి. తన గమ్యం ఎటువైపో అప్పుడే అర్థమయిందతనికి! తన ముగ్గురన్నలు, నలుగురు అక్కలతో పాటు తానూ చదువుకున్నాడు ఖాదర్. వాళ్లంతా జీవితాల్లో స్థిరపడ్డారు. ఖర్జూరాల వ్యాపారం చేసే ఖాదర్ తన సంపాదనలో అధిక భాగాన్ని అన్నార్తుల కడుపు నింపడం కోసమే కేటాయిస్తుంటాడు. అందుకు అతడి సహధర్మచారిణి సల్మా కూడా సహకరిస్తుంది. ఆమె ప్రతిరోజూ వంట చేసి, ఓ ఐదారు ఆహార పొట్లాలు తయారు చేసి భర్తకు ఇస్తుంది. వాటితో పాటు కొన్ని మంచినీళ్ల బాటిళ్లు కొనుక్కుని బ్యాగులో వేసుకుని బయలుదేరుతాడు ఖాదర్. రోడ్ల పక్కన, బస్టాపుల్లో, గుడి మెట్ల మీద... ఎక్కడ ఎవరు పట్టెడన్నం కోసం ఎదురు చూస్తున్నా వారికి తన దగ్గరున్న ఆహారాన్ని స్వయంగా తినిపించి, మంచినీళ్లు తాగించి మరీ అక్కడ్నుంచి వెళ్తాడు. ఒక్కసారి ఒకచోట ఒక వ్యక్తికి అన్నం పెడితే... అప్పట్నుంచి రోజూ పెడుతూనే ఉంటాడు. అది మాత్రమే కాదు, చలికి అల్లాడిపోయే వారికి రగ్గులు, దుస్తులు ఇస్తుంటాడు. ఎవరైనా చింపిరి జుత్తుతో కనిపిస్తే చాలు... వెంటనే క్షురకుణ్ని తీసుకుని అక్కడ ప్రత్యక్షమైపోతాడు. శుభ్రంగా క్షవరం చేయిస్తాడు. ఆశ్రయం లేనివాళ్లని ఆశ్రమాలకి తరలిస్తుంటాడు. అయితే ఇంత చేస్తున్నా తనకి తృప్తి లేదంటాడు ఖాదర్. ఎప్పటికైనా తానే ఒక ఆశ్రమాన్ని పెట్టి, దిక్కులేని వాళ్లందరినీ అందులో ఉంచి, వాళ్లకి కడుపునిండా తిండి పెట్టి అన్నీ తానై చూసుకోవాలని ఆశిస్తున్నాడు. ఆలోచన మంచిదైనప్పుడు ఆచరణకు మార్గం తప్పక దొరుకుతుంది. అదే జరిగితే ఖాదర్ వల్ల మరెందరివో కడుపులు నిండుతాయి! - డి.వి.ఆర్.భాస్కర్ -
ఆదర్శనీయుడు వివేకానందుడు
పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : స్వామి వివేకానందుడి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత అన్ని రంగాల్లో ముందుకు పోవాలని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. స్వామి వివేకానంద 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని దోమలగూడ రామకృష్ణమఠంలో జరుగనున్న జాతీయ యువజన సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వివేకానందుడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచం మొత్తం వృద్ధులను మోస్తుంటే భారత్ మాత్రం యువకళను సంతరించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద,బేలూరు మఠం రామకృష్ణ మిషన్ వివేకానంద యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ స్వామి ఆత్మ ప్రియానంద, మఠం అసిసెంటంట్ సెక్రటరీ స్వామి బోధశరణానంద తదితరులు పాల్గొన్నారు. -
ఎడతెగని సేవా గుణం...
ఎనిమిది పదుల సాహస కోణం... ఆదర్శం హైదరాబాద్ నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరిన విమానంలో పదిమంది భారతీయులు ఉన్నారు. వారంతా వారంరోజుల పాటు ఈజిప్ట్‌లో విహరించడానికి బయలుదేరారు. ఆ పదిమందిలో సీతా పెయింటాల్ ఉన్నారు. ఆమె తన బ్యాగ్‌లోంచి ఓ ఐపాడ్ తీసి మెసేజెస్ చెక్ చేసుకుంటూ రిప్లైలు ఇవ్వడం మొదలుపెట్టారు. అది చూసిన వారంతా ‘అంత పెద్దావిడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీ వాడటమా’ అని ఆశ్చర్యపోయారు. కాశ్మీర్ సిక్కు కుటుంబానికి చెందిన సీతా పెయింటాల్కి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పుట్టిందీ, పెరిగిందీ, చదువుకున్నదీ అంతా ఢిల్లీలోనే. ఎం.ఏ. ఎకనామిక్స్ చదివి, నాలుగేళ్లపాటు లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. భారత నౌకాదళంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న దల్జీత్ సింగ్ పెయింటాల్తో వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి గృహిణిగా మారారు. ‘‘నాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. వారి ఆలనపాలనలతోటే సమయమంతా గడిచిపోయేది. మా పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలంటే కష్టమనిపించి, బి.ఇడి. చేశాను. ఇప్పుడు మా పెద్దమ్మాయి డాక్టరు. రెండో అమ్మాయి సైకాలజీలో ఆనర్స్ చేసింది. అబ్బాయి ఐ.ఐ.టి. పూర్తయ్యాక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎమ్.బి.ఏ, చేసి కెనడాలో స్థిరపడ్డాడు. మా వారి ఉద్యోగరీత్యా అనేక నగరాల్లోనే కాక ఇంగ్లాండ్‌లోనూ ఉన్నాం. ఆయన ఉద్యోగ విరమణ చేశాక ఢిల్లీలోనే స్థిరపడ్డాం’’ అని తన గురించి క్లుప్తంగా వివరించారు సీతా పెయింటాల్. కుటుంబ బాధ్యతలు చూసుకోవడమే కాకుండా, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవడం ప్రారంభించారు పెయింటాల్. మొబైల్ క్రష్‌లో... కార్మికుల పిల్లలకు విద్య, వైద్యం కోసం ఎన్నో సేవలు చేశారు. అంధ విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి కోసం చరిత్ర, ఆర్థికశాస్త్రం మొదలైనవి తన గొంతులో రికార్డ్ చేసి వినిపించారు. అక్కడితో ఆగలేదామె. ప్రత్యేకించి క్యాన్సర్ బాధితులకు ఎన్నోరకాలుగా తన సేవలు విస్తరించారు. ఆమె అలా క్యాన్సర్ బాధితుల పక్షాన నిలవడానికి కారణం... ‘‘ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్న మా చెల్లికి రొమ్ము క్యాన్సర్ సోకిందని తెలిసింది. నాకు ఎంతో బాధ అనిపించింది. ఆ వ్యాధి గురించి తెలుసుకోవాలనుకున్నాను. క్యాన్సర్ గురించిన పుస్తకాలు తెచ్చుకుని కూలంకషంగా అధ్యయనం చేశాను. ఆ వ్యాధి బారిన పడ్డవాళ్లకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు. అందుకు తగ్గట్లే ఆమె ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వారి క్యాన్సర్ సహయోగ్ ఢిల్లీ శాఖలో చేరి, ఆరోగ్యసేవ కొనసాగిస్తున్నారు. ఈ సేవాస్ఫూర్తిని మరింతమందిలో రగిలించడానికి ఎంతోమందిని వలంటీర్లుగా తయారుచేసి వారి ద్వారా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ‘‘ఇప్పుడు ఆ సంస్థలో వందలాదిగా స్వచ్ఛంద సేవకులు వచ్చి చేరుతున్నారు. సంస్థకు వచ్చే విరాళాలతో రొమ్ము క్యాన్సర్ పీడితులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నాం’’ అని వివరించారు సీతా పెయింటాల్. వయసెరుగని... ఇటీవలే ఆమె తన కుటుంబ సభ్యులతో ఈజిప్ట్ పర్యటించారు. తనతో పాటు ఓ బుల్లి కెమెరాను తెచ్చుకున్నారు. పిరమిడ్లను చకచకా ఎక్కుతూ ఎన్నో ఫోటోలు తీసుకున్నారు. నైలునదిలో నౌకావిహారం చేస్తూ అక్కడి దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. స్వయంగా తాను కూడా క్యాన్సర్ బారినపడ్డ ఆమె, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, తమ దైనందిన జీవితం ఎలా గడపాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వారి భావోద్వేగాలను పంచుకుని, వ్యాధిని ఎదుర్కొనడానికి తగిన సలహాలు ఇస్తున్నారు. అప్పుడే ఆమె ఇద్దరు చెల్లెళ్లూ, భర్త మరణించారు. అయినా ఆమె తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. ‘‘క్యాన్సర్ వ్యాధి మీద మరింత మందికి అవగాహన కల్పించాలనుకున్నాను. ‘క్యాన్సర్ సహయోగ్ సంస్థ’ ద్వారా ఢిల్లీలోని ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నాను. ‘నాకు హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినవారెవరైనా ప్రతి రోజూ రాత్రి నాకు ఫోన్ చేయచ్చు (ఫోన్ నం. 9818488122). వారికి నైతిక స్థైర్యాన్ని అందజేస్తాను’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పే ఈ పండుటాకును జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే వారందరూ ఆదర్శంగా తీసుకుని తీరాలి. ఆమెలోని అనుకూల దృక్పథాన్ని అందరూ అలవరచుకోవాలి. - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
శభాష్... స్ట్రాంగెస్ట్ మాన్!
ఆదర్శం ‘‘జైశంకర్ పని అయిపోయినట్లే’’ అనుకున్నారు అందరూ. రెండు సంవత్సరాల క్రితం అతనికి జరిగిన ప్రమాదం చిన్నాచితకాది కాదు. వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి బయటపడ్డాడు. చాలారోజులు ఆస్పత్రిలో బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. ఒంటి మీద మొత్తం 42 ఫ్రాక్చర్లు! తాను యాక్సిడెంట్ నుంచి బయటపడిన రోజు తన అసలైన జన్మదినం అంటాడు ఢిల్లీకి చెందిన జైశంకర్. ‘‘మహా అయితే నడవగలడు. అంతకు మించి వేరే పనులు చేయడం కష్టం’’ అన్నారు వైద్యులు. అయితే వారి అంచనా తప్పని రుజువు కావడానికి ఎంతో కాలం పట్టలేదు. యాక్సిడెంట్ జరిగిన ఆరునెలల తరువాత తనకు బాగా ఇష్టమైన వ్యాయామాలు చేయడం ప్రారంభించాడు. నడవడమే కాదు...‘ఇండియాస్ స్ట్రాంగెస్ట్ మ్యాన్’ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. 70-90 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాడు. ‘‘శక్తి అంటే శారీరకశక్తి మాత్రమే కాదు. మానసిక, శారీరకశక్తుల సమన్వయం’’ అంటున్నాడు ఇరవెరైండు సంవత్సరాల జైశంకర్. ‘‘చాలామంది శక్తిమంతులకు తమ శక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేదాని మీద సరైన అవగాహన ఉండదు’’ అంటున్న జైశంకర్ పాఠశాల విద్యార్థులకు రకరకాల వ్యాయామాలలో శిక్షణ ఇస్తున్నాడు. ‘‘శిక్షణ ఇవ్వడం అనేది ఒక కళ’’ అని నమ్ముతున్న జైశంకర్ ‘‘స్ట్రెంత్ ట్రైనింగ్ మీద అవగాహన పెంచడమే నా లక్ష్యం’’ అంటున్నాడు. ఆయన లక్ష్యాలలో మరొకటి ‘వరల్డ్స్ స్రాంగెస్ట్ మాన్’ టైటిల్ గెలుచుకోవడం. -
అమ్మ మనసంటే అదేనేమో!
ఆదర్శం క్షమాగుణాన్ని మించిన గొప్ప గుణం లేదంటారు. తప్పు చేసిన వాడిని క్షమించమని మహా పురుషులు ఎందరో కూడా సెలవిచ్చారు. అయినా మనిషి భావోద్వేగాల ముందు క్షమాగుణం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. మనల్ని బాధపెట్టినవారిని క్షమించి వదిలేద్దామంటే మనసు ఎదురు తిరుగుతుంది. నీ బాధ అవతలివారిని కూడా రుచి చూడనివ్వమంటూ పోరు పెడుతుంది. కానీ ఆ తల్లి విషయంలో అలా జరగలేదు. తన కొడుకుని చంపినవాడిని సైతం ఆమె క్షమించింది. క్షమాగుణానికి, తల్లి మనసుకి మారుపేరుగా నిలిచింది. ఏడేళ్ల క్రితం ఇరాన్‌లోని మజాందరన్ ప్రావిన్‌సలో అబ్దుల్లా అనే యువకుడిని నడిరోడ్డు మీద పొడిచి చంపాడు బలాల్ అనే వ్యక్తి. విచారణలు, వాదోపవాదాలు జరిగిన తరువాత అతడిని బహిరంగంగా ఉరి తీయమని న్యాయస్థానం ఆదేశించింది. ఎట్టకేలకు అతడిని ఉరితీసే సమయం ఆసన్నమయ్యింది. పోలీసులు బలాల్ని తీసుకొచ్చారు. బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఉరికొయ్య వద్ద అతడిని నిలబెట్టారు. కళ్లకు గంతలు కట్టారు. మెడకు ఉరి బిగించారు. కొద్ది క్షణాల్లో అతడిని ఉరి తీసేవారే. కానీ అంతలోనే జరిగింది ఓ ఊహించని సంఘటన! జరిగేది చూడడానికి వచ్చిన జనంలో నుంచి ఓ మహిళ ముందుకు వచ్చింది. ఉరికొయ్య దగ్గరకు వెళ్లి ఓ కుర్చీ కావాలని పోలీసును అడిగింది. అతడు కుర్చీ ఇచ్చాక, దాని మీదకు ఎక్కి బలాల్ని లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టింది. ‘‘నిన్ను క్షమించాను’’ అనేసి వెళ్లిపోయింది. ఆమె ఎవరో కాదు... బలాల్ చేతిలో హత్యకు గురైన అబ్దుల్లా తల్లి మర్యామ్. కొద్ది రోజుల క్రితం అబ్దుల్లా కలలో కనిపించి, ‘నేను బాగున్నాను, నువ్వు బాధపడొద్దు’ అని తల్లితో చెప్పాడట. దాంతో ఆమె బలాల్ని క్షమించింది. అతడిని చంపొద్దు, వదిలేయమంటూ అధికారులను కోరింది. బిడ్డను కోల్పోయి తాను అనుభవించిన కడుపుకోత మరో తల్లికి కలగకూడదని ఆశించింది. తల్లి మనసంటే ఏంటో చూపించింది. మనల్ని బాధపెట్టినవాళ్లని క్షమించాలంటే గొప్ప మనసుండాలి. ఆ మనసు మర్యామ్కి ఉంది. ఆమెకి హ్యాట్సాఫ్! -
చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలి
బేగంపేట, మెగాస్టార్ చిరంజీవిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ సినీ నటుడు నాగబాబు కోరారు. శనివారం బేగంపేట మనోహర్ హోటల్లో నిర్వహించిన శ్రీశక్తి హోటల్ మేనేజ్మెంట్ కళాశాల 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరంజీవికి ఓ విజన్ ఉందని, దానికనుగుణంగానే ఆయన ఎంతో కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్నాడన్నారు. విద్యార్థులు కూడా ఆయనలాగే ఉన్నత లక్ష్యాలతో మరింత ఉన్నతస్థితికి ఎదగాలని నాగబాబు ఆకాంక్షించారు. రెండు దశాబ్దాల ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన శ్రీశక్తి హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మరింత అభివృద్ధి చెందాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అతిథులుగా పాల్గొన్న కేంద్ర విజిలెన్స్ క మిషనర్ (రిటైర్డ్) రంజనికుమార్ , కళాశాల డెరైక్టర్ యమునా రంగారావులను సత్కరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, కాలేజి వార్షిక మ్యాగజైన్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో హోటల్ చైర్మన్ డీవీ మనోహర్, డెరైక్టర్ సత్యపింజల, పలువురు విద్యార్థ్దులు పాల్గొన్నారు. -
అవును...ఇది పిల్లలు ఆడుకునే బ్యాంకు కాదు!
ఇది పిల్లల ఆట బ్యాంకు కాదు. వెలుగు బ్యాంకు. దిక్కూ మొక్కూ లేని ఎందరో పిల్లల జీవితాలకు భరోసా ఇచ్చి వారి కళ్లలో వెలుగు నింపే బ్యాంకు. అక్కడ ఖాతాదారులతో పాటు... ఉద్యోగులు కూడా పిల్లలే! ఢిల్లీలో విజయవంతమై, ప్రపంచంలో పలు ప్రాంతాలకు విస్తరిస్తోన్న ‘ది చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఖజానా’ గురించి తెలుసుకుందాం... ‘‘ఖజానా బ్యాంకు ఎక్కడండీ?’’ ‘‘మీరు అడిగేది ఆ పిల్లల బ్యాంకు గురించేనా?’’ ‘‘అవును’’ ‘‘కాస్త ముందుకు వెళ్లి లెఫ్ట్‌కు తిరగండి. బోర్డ్ కనిపిస్తుంది’’ పాత ఢిల్లీలోని ఫతేపురిలో ఇలాంటి సంభాషణ తరచుగా వినిపిస్తుంటుంది. ఆ బ్యాంకుకు వచ్చే వాళ్లలో కస్టమర్లు మాత్రమే కాదు, ‘పిల్లల బ్యాంక్ అట!’ అని ఆశ్చర్యపడేవాళ్లు, పత్రికా ప్రతినిధులు, స్వచ్ఛందసేవకులు...ఎందరెందరో ఉంటారు. అందరూ ఒకే గొంతుతో అనేమాట: శభాష్! ఆ పిల్లలు ధనికుల పిల్లలు కాదు. మధ్యతరగతి పిల్లలు కూడ కాదు. వీధిబాలలు. ఒక పూట తిండి ఉండి మరో పూట లేని అనాధలు. ‘‘ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన నేను ఒక టీ స్టాల్లో పనిచేసేవాడిని. కాని అక్కడి పరిస్థితులు మరీ దుర్భరంగా ఉండేవి. పని చేయాలనిపించేది కాదు. ఆ సమయంలోనే కొందరు వాలంటీర్లను కలిశాను. వాళ్లు ఈ బ్యాంకు గురించి చెప్పారు. అలా ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు స్కూలుకు వెళుతున్నాను. ఈ బ్యాంకుకు నేనే మేనేజర్‌ను కూడా’’ అని ఒకింత గర్వంగా చెబుతాడు సోను. ఇక, పద్నాలుగు సంవత్సరాల ‘షేరు’కు రైల్వే ఫ్లాట్‌ఫామే ఇల్లూ వాకిలీ! ‘‘రైల్వేస్టేషన్లో వాటర్ బాటిళ్లు అమ్ముతుంటాను. ఈ బ్యాంకు గురించి తెలిసిన తరువాత డబ్బు పొదుపు చేస్తున్నాను. ఇప్పటివరకు ఆరు వేల రూపాయల వరకు పొదుపు చేశాను. భవిష్యత్తులో మరింత డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నాను’’ అంటున్నాడు షేరు. ఫొటోగ్రాఫర్ కావాలనేది షేరు కల. ఏదో ఒకరోజు మాంచి కెమెరా ఒకటి కొనాలనేది అతని ఆలోచన. కూలీ పనులు చేసే రహిమాకు కూడా ఈ బ్యాంకులో ఖాతా ఉంది. ‘‘నేను తరుచుగా డబ్బులు పోగొట్టుకునేదాన్ని. ఒకరోజు బట్టర్ఫ్లై స్వచ్ఛందసంస్థలో పని చేసే అక్కను కలిశాను. ఆమె చిల్డ్రన్స్ బ్యాంకు గురించి చెప్పింది. ఇక అప్పటి నుంచి ఈ బ్యాంకులో డబ్బులు పొదుపు చేస్తున్నాను. ఇప్పుడు నేను చాలా స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నాను. నా డబ్బులు భద్రంగా ఉన్నాయి అనే ఆలోచన సంతోషానికి గురిచేస్తోంది’’ అంటుంది రహిమా. రహిమా మాటల్లో వినిపించిన ‘బట్టర్ఫ్లై’ స్వచ్ఛందసంస్థ వీధి పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. బ్యాంకు పెట్టాలనే ఆలోచన శశిధర్ షబ్నవీస్ బుర్రలో నుంచి పుట్టిందే. ఆయన ‘బట్టర్ఫ్లై’ చారిటీ ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనతో ఒక పిల్లాడు ఒకరోజు ఇలా అన్నాడు...‘‘రోజూ బాగానే సంపాదిస్తాను. తిండికి పోగా చాలా డబ్బులే మిగులుతాయి కూడా. కానీ ఎప్పుడూ డబ్బుల్ని పోగొట్టుకుంటుంటాను. ఒకవేళ నా జేబులో డబ్బు ఉంటే...అది ఖర్చు చేసేవరకు మనసు నెమ్మదించదు.’’ ఇది ఆ అబ్బాయి సమస్య మాత్రమే కాదనీ వీధిబాలలందరి సమస్య అనీ శశిధర్‌కు అర్థమైంది. ‘బట్టర్ఫై’్ల సభ్యులతో ఈ విషయం గురించి చర్చించాడు. అందరూ ఒక పరిష్కారానికి వచ్చారు. అదే...పిల్లల బ్యాంక్! పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పాటయిన ‘ది చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఖజానా’ విజయవంతమవడమే కాదు ప్రపంచంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఆగిపోయిన చదువును కొనసాగించడానికి, వృత్తి విద్యలను నేర్చుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకులో పొదుపు చేసిన డబ్బు పిల్లలకు ఉపయోగపడుతుంది. ఢిల్లీలో ‘ఖజానా’ శాఖలు మొత్తం పన్నెండు ఉన్నాయి. తొమ్మిది నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న వెయ్యిమంది పిల్లలు ఈ బ్యాంకులలో ఖాతాదారులు. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఖాతాదారులు తమ గ్రూప్ నుంచి ఇద్దరు మేనేజర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అడుక్కునే పిల్లలు, డ్రగ్స్ అమ్మే పిల్లలకు ఈ బ్యాంకులలో సభ్యత్వం ఇవ్వరు. కష్టాన్ని నమ్ముకునే పిల్లల కోసం మాత్రమే ‘ఖజానా’ బ్యాంకు. ఎవరైనా వచ్చి ‘‘నా డబ్బు తీసుకోవాలనుకుంటున్నాను’’ అని అడిగితే ఉన్నపళంగా ఇవ్వకుండా కారణం ఏమిటో తెలుసుకుంటారు. తోటి సభ్యులను సంప్రదించిన తరువాతే వారి ఆమోదంతోనే డబ్బు ఇస్తారు. ‘‘బ్యాంకులో డబ్బును దాచుకోవడం ద్వారా పొదుపు విలువను పిల్లలు తెలుసుకోగలుగుతున్నారు. దాచుకున్న డబ్బంతా తమ భవిష్యత్తుకు సోపానంగా ఉపయోగపడుతుందనే ఎరుక వారిలో వచ్చింది’’ అంటున్నాడు స్వచ్ఛందసేవకుడు ఆనంద్. ఈ ‘ఖజానా’ బ్యాంకు ఎంత విజయవంతమయిందంటే, ఢిల్లీలో మరిన్ని ప్రాంతాలలో శాఖలు ఏర్పాటు చేయాలనే అభ్యర్థనలు అందుతున్నాయి. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతలలో కూడా చిల్డ్రన్స్బ్యాంకులను ఏర్పాటు చేసే పనిలో ఉంది బట్టర్ఫ్లై. ‘ఖజానా’ బ్యాంకు పిల్లలకు ఏమిచ్చింది? అంటే ఒక్కమాటలో పొడిగా ముగించడం కష్టం. జీవననైపుణ్యం, ఆర్థికనైపుణ్యాలతో పాటు... వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ‘ఖజానా’ బ్యాంకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ‘ఖజానా’ బ్యాంకు పిల్లలకు ఏమిచ్చింది? అంటే ఒక్కమాటలో పొడిగా ముగించడం కష్టం. జీవన నైపుణ్యం, ఆర్థిక నైపుణ్యాలతో పాటు... వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ‘ఖజానా’ బ్యాంకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. -
ఊరంతటికీ టీచర్లు
ఆదర్శం గురువుది పాఠాలు చెప్పి ఊరుకునే మనస్తత్వమే అయితే పల్లెటూరి విద్యార్థులు పెద్దచదువులు చదవలేరు. బడికి వచ్చినవారికే నాలుగక్షరాలు నేర్పి పుస్తకం మూసేస్తే గ్రామం ఎన్నటికీ అభివృద్ధికి నోచుకోదు. పిల్లలకు చదువుతోబాటు దాని విలువ కూడా తెలియజెప్పే గురువులు కావాలి. ప్రైవేట్, కాన్వెంట్ చదువులదే రాజ్యమైన ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నారు. విద్యకు దూరంగా ఉన్నవారిని బడికి తీసుకొచ్చి బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులున్నారు కనుకనే మారుమూల పల్లెల నుంచి మంచి ముత్యాలు పుట్టుకొస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తకోటపాడు గ్రామంలో ఓ ఇద్దరు ఉపాధ్యాయులు ఇటు పిల్లల్నీ, అటు తల్లిదండ్రుల్నీ కూడా విద్యావంతులుగా మారుస్తున్న వైనం తెలిస్తే వారికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేం. గరిమెళ్ల అరుణ... కొత్తకోటపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని. సుధాలత టీచర్. ఐదు తరగతులకు వీళ్లిద్దరే టీచర్లు. ఈ ఇద్దరు టీచర్లు ఆ పాఠశాలకొచ్చి రెండేళ్లు దాటింది. ‘‘నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో పాఠశాలను, పిల్లల్ని చూసి చాలా ఆందోళనపడ్డాను. వీరికి కేవలం పాఠాలు మాత్రమే చె ప్పి వదిలేస్తే సరిపోదని మొదటిరోజే అర్థమయింది. దీనికి తోడు ఆ ఊరిలో ఎవరికీ కూడా చదువుపై పెద్దగా శ్రద్ధ లేదని తెలిసింది. ‘మాకు చదువు ముఖ్యం కాదు, ఏదో పిల్లలు నీడపట్టున ఉంటారనే ఉద్దేశ్యంతో బడికి పంపుతున్నాం’ అని గ్రామపెద్దలు చెప్పినపుడు మనసంతా చేదు తిన్నట్లయింది. వెంటనే నేను, సుధాలత కలిసి గ్రామపరిస్థితులపై మాట్లాడుకుని ఒక అవగాహనకొచ్చాం. పొద్దస్తమానం పాఠాలే చెబుతుంటే పిల్లలకు విసుగు పుడుతుంది. అందుకే వాటితో పాటు బొమ్మలు వేయించడం, పద్యాలు నేర్పడం, కథలు చెప్పడం, పాటలు పాడించడం వంటివి ప్రారంభించాం. దాంతో పిల్లలకి పాఠశాలపై ఆసక్తి పెరిగింది. అప్పటివరకూ ఏదో తప్పదన్నట్లుగా ఏడుపు ముఖంతో వచ్చేవారు కాస్తా ఉత్సాహంగా, సంతోషంగా బడికి రావడం మొదలుపెట్టారు’’ అంటూ తాను పాఠశాలలో అడుగుపెట్టినప్పుడున్న పరిస్థితులని గుర్తు చేసుకున్నారు అరుణ. గత ముప్పై ఏళ్లుగా అనేక ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అరుణ టీచర్‌కు పల్లెపాఠశాలలంటే ప్రాణం. ఆణిముత్యాలు... గడిచిన రెండేళ్లలో ఆ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు పద్యాలు, పెయింటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఊర్మిళ అనే మూడవతరగతి విద్యార్థిని పద్యాలు చెప్పడంలో మండలస్థాయిలో, పెద్దాపురం డివిజన్ స్థాయిలో బోలెడన్ని బహుమతులు గెలుచుకుని వీరి కృషికి గుర్తింపు తెచ్చింది. ‘‘నూటయాభై పద్యాలు...గుక్కతిప్పుకోకుండా చెప్పగలదు ఊర్మిళ. 2012లో తిరుపతి మహాసభలు జరిగిన సమయంలో మండలస్థాయిలో తను మొదటి బహుమతి గెలుచుకున్నప్పుడు మాకు చాలా ఆనందమేసింది. ఊర్మిళ గురించి పత్రికల్లో వచ్చినపుడు మమ్మల్ని అందరూ అభినందించారు. గంగాధర్ అనే నాలుగోతరగతి అబ్బాయి చిత్రలేఖనంలో చక్కని ప్రతిభ కనబరుస్తున్నాడు. సొంతంగా కథలు రాస్తూ వాటికి నప్పే బొమ్మలు కూడా గీస్తూ ఉపాధ్యాయుల మన్ననలతో పాటు బయటివారి మనసు కూడా గెలుచుకుంటున్నాడు. అమ్మ చేతిలోనే... బిడ్డ భవిష్యత్తు తల్లి చేతిలోనే ఉంటుందంటారు ఈ ఉపాధ్యాయులు. ‘‘అమ్మ కోరుకుంటే... అమ్మ పట్టుదలతో ఉంటే బిడ్డలు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. అందుకే మా దృష్టి మొత్తం పిల్లల తల్లులపై పెట్టాం. రోజూ పిల్లలకు పాఠాలు చెబుతూనే అప్పుడప్పుడు తల్లుల్ని కూడా పిలిపిస్తూ వారికి చదువు విలువను తెలియజేస్తున్నాం. మొదట్లో అంతగా ఆసక్తి చూపేవారు కాదు కానీ, మా కృషిని గుర్తించి క్రమేణా తల్లులందరూ కూడా తమ పిల్లలతో కలిసి బడికి రావడం మొదలుపెట్టారు’’ అంటూ తమ బోధన విశేషాలను చెప్పుకొచ్చారు అరుణ టీచర్. పాఠశాలలో హాజరుశాతం పెంచడం, పరిసరాల పరిశుభ్రత, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, పాఠశాలలో విద్యార్థులు సాధించిన ప్రగతిని, ఇతర విశేషాలని తల్లిదండ్రులతో పంచుకోవడం, పాఠశాల కార్యక్రమాలకు తల్లిదండ్రులు కూడా హాజరయేలా చూడటం... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రెండేళ్లలో ఈ ఇద్దరు టీచర్లు చాలా మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలలో, ఊరివాళ్లలో ఈ ఉపాధ్యాయులు తీసుకొచ్చిన మార్పు గురించి ఆ ఊరి పెద్ద కె. శ్రీరామమూర్తి మాట్లాడుతూ... ‘‘గురువు తలుచుకుంటే ఎంతటివారినైనా మార్చగలరని అరుణ టీచర్, సుధాలత టీచర్ నిరూపించారు. మా ఊరంతా వారికి రుణపడి ఉంటుంది’’ అని అంటారు. చదువులమ్మపై ఉన్న అభిమానంతో రానూపోనూ రోజూ డెబ్భైకిలోమీటర్లు ప్రయాణించి మరీ ఈ ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఆలోచనలను కూడా మారుస్తుండడం ఎంతోమందికి ఆదర్శప్రాయం! - భువనేశ్వరి ఫొటోలు: లోలభట్టు శ్రీనివాసరాజు -
మంచి కోసం మనువాడారు!
ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, చుట్టూ వందలాది మంది అతిథులు, నగల ధగధగలు, అలంకరణల మిలమిలలు... ఇవి లేకుండా పెళ్లి చేసుకోడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఆ ఇద్దరూ ఇవేమీ వద్దనుకున్నారు. అసలు తమ పెళ్లి తమ ఆనందం కోసం కాకుండా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అనుకున్నారు. ఇందుకే ఈ రోజున అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, తనని ఎంత బాగా చూసుకుంటారు అని అంచనా వేసుకున్న తరువాతే ఎవరైనా పెళ్లికి సిద్ధపడతారు. కానీ చెన్నైకి చెందిన తిలక్, ధన ఇవేమీ చూసుకోలేదు. ఎంత మంచివారు, ఎంత సేవ చేస్తారు, ఇతరుల కోసం జీవితాన్ని ఎంతవరకూ అంకితమివ్వగలరు అని చూసుకున్నారు. తిలక్ తన స్నేహితుడు నందన్‌తో కలిసి ఓ సేవాసంస్థను నడుపుతున్నాడు. గ్రామాల్లోని పేద పిల్లలను చదివిస్తుంటాడు. ఓ కార్యక్రమంలో అతడికి పరిచయమయ్యింది ధన. అతడు చేస్తోన్న సేవ గురించి తెలిసి ముగ్ధురాలయ్యింది. ఆమెలో ఉన్న సేవాగుణం అతడినీ ఆకర్షించింది. కొన్ని మంచి పనుల కోసం ఇద్దరూ కలిసి అడుగులు వేయాలనుకున్నారు. తరువాత ఆ ఆశయం వారితో ఏడడుగులు వేయించింది. ఓసారి ఎయిడ్సతో బాధపడుతోన్న ఓ చిన్నారిని చూసింది ధన. ఆ బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమను ఇవ్వాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తిలక్‌ని అడిగింది. అంతలోనే మరో మనసున్న దంపతులు ఆ పాపని దత్తత చేసుకున్నారు. అయితే ఇద్దరూ కలిస్తే కొందరికి జీవితాన్ని ఇవ్వొచ్చు అన్న ఆలోచన బలపడింది. సేవ చేయడం కోసం ఇద్దరూ ఒకటవ్వాలనుకున్నారు. చివరకు తమ పెళ్లి కూడా పేదపిల్లలకే ఉపయోగపడేలా చేయాలనుకున్నారు. అందుకే తమ పెళ్లికి వచ్చేవారిని బహుమతులు తీసుకురావొద్దని, ఏదిచ్చినా ధన రూపంలోనే ఇవ్వాలని ముందే చెప్పారు. అతిథులతో పాటు పేదపిల్లలను కూడా పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లిరోజున వాళ్లిద్దరూ పట్టుబట్టలు కట్టుకోలేదు. పందిళ్లు వేయలేదు. అలంకరణలు లేవు. అతి సింపుల్‌గా మనువాడారు. వచ్చిన కానుకల్ని, తమ పెళ్లికి ఖర్చు చేయాలని ఇంట్లోవాళ్లు దాచిన మొత్తాన్నీ కూడా పేదపిల్లల సంక్షేమానికి వినియోగించారు. నాటినుంచి నేటివరకూ... అంటే దాదాపు రెండేళ్లుగా వారు చిన్నారుల జీవితాలను తీర్చిదిద్దేందుకే పాటు పడుతున్నారు. ఆదర్శ దంపతులుగానే కాదు... ఆదర్శనీయమైన వ్యక్తులుగానూ అభినందనలు అందుకుంటున్నారు! -
ఆదర్శం అదృశ్యం!
ఆదర్శ రైతులకు ఏడాదిగా అందని భృతి బకాయిలు రూ.1.88 కోట్లు జిల్లాలో 389 పోస్టులు ఖాళీ నియామకంపై దృష్టి సారించని ప్రభుత్వం అన్నదాతలకు దూరమవుతున్న ప్రయోజనం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ‘ఆదర్శ’ం మంటకలుస్తోంది. వ్యవసాయాభివృద్ధికి దోహదపడేందుకు ఏర్పాటు చేసిన ఆదర్శ రైతు వ్యవస్థ నిర్వీర్యమవుతోంది.ఏడాదిగా గౌరవ భృతి లేక.. ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని నియమించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయాలంటూ ఆదర్శ రైతులు ఉద్యమిస్తున్నా.. ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుతోంది. విశాఖ రూరల్/నర్సీపట్నం, న్యూస్‌లైన్: అన్నదాతలకు అండగా ఉంటూ, ఆధునికసాగు పద్ధతులను రైతులకు చేరవేసే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 2007లో ఆదర్శరైతు పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానాల అమలుతోపాటు అధికారులు, రైతులకు అనుసంధానంగా వ్యవహరించడం దీని ముఖ్యోద్దేశం. పొలంబడి, శ్రీవరి వంటి నూతన ప్రయోగాలను రైతులకు వివరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 1958 మందిని ఆదర్శ రైతులుగా నియమించారు. ఏడాదిగా గౌరవ వేతనం లేదు : ఆదర్శ రైతులు ఒక్కొక్కరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. కనీస వేతనం కోసం వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం వారికిచ్చే రూ.వెయ్యి కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఐదు ఆరు నెలలకు ఒకసారి నిధులను మంజూరు చేస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వీరికి రూపాయి కూడా విడుదల చేయలేదు. వ్యవసాయాభివృద్ధి కోసం రైతుల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాల్సిన ఆదర్శ రైతులు గౌరవ భృతి కోసం రోడ్డెకేలా చేసింది. ఇప్పట్లో వారికి రూ.1.88 కోట్లు అందించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో 389 ఖాళీలు : జిల్లాలో 1958 మంది ఆదర్శ రైతులను గతంలో నియమించగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనితీరు బాగోలేదంటూ వారిలో కొంత మందిని అధికారులు తొలగించారు. మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేయడం, ఇతరత్రా కారణాల వల్ల జిల్లాలో 389 ఆదర్శ రైతుల పోస్టులు ఖాళీ అయ్యాయి. రెండేళ్లుగా వీటిని భర్తీ చేయలేదు. వాస్తవానికి కొత్త వారి నియామకానికి సంబంధించి జిల్లా ఇన్చార్జి మంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండేళ్లలో జిల్లాకు ముగ్గురు ఇన్చార్జి మంత్రులు మారారు. ఏ ఒక్కరూ ఆ దిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇప్పట్లో ఖాళీలను భర్తీ చేసే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. దీని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తులో ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగిస్తుందా.. లేక నిర్వీర్యం చేస్తుందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
ఆదర్శం... వాస్తవం!
దేశంలో అవినీతిని అంతమొందించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించి వారంరోజులు కూడా కాలేదు. మహారాష్ట్రలో వెల్లడై అందరినీ దిగ్భ్రాంతిపరిచిన ఆదర్శ్ హౌసింగ్ స్కాంను అక్కడి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం కప్పెట్టడానికి ప్రయత్నిస్తోంది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన రోజు కాంగ్రెస్ పెద్దలు ఆ ఘనత తమదేనని చెప్పుకున్నారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ బిల్లు సాకారం కావడానికి పట్టుదలగా పనిచేశారని, ఆయన అభీష్టం మేరకు ఈ వరసలో మరిన్ని బిల్లులు తీసుకురావడం కోసం త్వరలోనే మళ్లీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్నామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని మాటలు చెప్పిన పెద్దలు... మహారాష్ట్రలో తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆదర్శ్ కుంభకోణంపై వ్యవహరిస్తున్న తీరును మౌనంగా వీక్షిస్తున్నారు. ఆదర్శాలు చెప్పడానికి, ఆచరించడానికి ఎంత తేడా! ఈ స్కాంలో ఉన్న డజనుమంది నిందితుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి సీబీఐ అనుమతి కోరితే మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్ తిరస్కరించారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ సైతం చవాన్‌ను దోషిగా చూపింది. క్విడ్ ప్రో కో జరిగిందని నిర్ధారించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్)-2 నిబంధనలకు విరుద్ధంగా భవనం ఎత్తును పెంచడానికి ఆయన అనుమతించారని, అందుకు ప్రతిగా ఆయన బంధువులకు ఇందులో ఫ్లాట్లు దక్కాయని కమిషన్ తెలిపింది. అయినాసరే, ఆయనను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అసలు విచారణ కమిషన్ నివేదికను సభ ముందుకు తీసుకొచ్చే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదు. బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకుని దీనిపై ప్రశ్నించేసరికి తప్పనిసరై నివేదికను సభకు సమర్పించారు. అదికూడా సమావేశాల ముగింపురోజున! ఈ స్కాంపై సభలో చర్చిస్తే రచ్చవుతుందని, తమ పరువుప్రతిష్టలు పాతాళానికి పోతాయని కాంగ్రెస్ పెద్దలు భయపడ్డారు. పరిమాణంలో చూస్తే ఆదర్శ్ హౌసింగ్ స్కాం యూపీఏ పాలనలో బయట పడిన ఇతర కుంభకోణాలకన్నా పెద్దదేమీ కాదు. ముంబై మహానగరంలో ప్రఖ్యాత తాజ్ హోటల్‌కు సమీపంలోని అత్యంత విలువైన భూమిలో వెలిసిన 31 అంతస్తుల భవన సముదాయమది. సైన్యానికి చెందిన జాగాలో 2002లో ఈ భవన నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పుడు చెప్పింది వేరు. అటు తర్వాత జరిగింది వేరు. సైన్యంలో పనిచేస్తున్న, రిటైరైన సిబ్బంది సంక్షేమం కోసం ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యంగా కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు ఫ్లాట్లు అందజేయడమే దీని వెనకున్న లక్ష్యమని చెప్పారు. కాలక్రమంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సైనిక ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి తమకోసం, అయినవాళ్ల కోసం ఫ్లాట్లను కైంకర్యం చేయడం ప్రారంభించారు. రూ.8 కోట్ల విలువైన ఫ్లాట్‌ను రూ.60 లక్షలకు సొంతం చేసుకున్నారు. అయినవాళ్లకు పంచిపెట్టారు. కొందరైతే బినామీ పేర్లతో రెండు, మూడు ఫ్లాట్లు కూడా కాజేశారు. అన్ని కుంభకోణాల్లాగే ఇందులో కూడా కాంగ్రెస్ నేతలదే ప్రధాన పాత్ర. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్ షిండేతోసహా నలుగురు ముఖ్యమంత్రులు ఆ పార్టీకి చెందినవారే. మరో ఇద్దరు మంత్రులు మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందినవారు. ఇందులో డజను మంది ఉన్నతాధికారులు భాగస్వాములని దర్యాప్తు మొదలెట్టినప్పుడు సీబీఐ తెలిపింది. తమ పదవులను అడ్డుపెట్టుకుని నిబంధనలను ఉల్లంఘించి వీరంతా దీన్ని కాజేయడానికి చూశారని ఆరోపించింది. నగర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేయడానికి అధికారంలో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో తెలియడానికి ఆదర్శ్ స్కాం ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నిస్తున్న అశోక్ చవాన్ ముఖ్యమంత్రిగానే కాదు... రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. రక్షణ సిబ్బందికి చెందిన ఈ సొసైటీలో రక్షణేతర వ్యక్తులకు సభ్యత్వం కల్పించాలని షరతు విధించింది ఆయనే. అక్కడ నుంచి మొదలుకొని భవంతి ఎత్తు పెంచడానికి అనుమతించడం వరకూ ఆయన ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఆదర్శ్ పేరు పెట్టుకున్నందుకైనా కాస్తయినా నిజాయితీగా వ్యవహరిద్దామని ఎవరూ అనుకోలేదు. అందరూ కలిసి నిస్సిగ్గుగా వ్యవహరించారు. కోట్లాది రూపాయల ఆస్తులున్నవారు, ప్రభుత్వంలో కీలక పదవులు వెలగబెడుతున్నవారు తమ నెలసరి ఆదాయం రూ.13,000గా అఫిడవిట్లు దాఖలుచేసి ఈ సొసైటీలో సభ్యత్వం సంపాదించారు. ఒకరిని చూసి ఒకరు అత్యాశకు పోయి ఒకటికి మించి ఫ్లాట్లు సొంతంచేసుకుందామని ప్రయత్నించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారి కుటుంబాల పేరు చెప్పి మొదలెట్టిన ందుకైనా అలాంటివారిలో కొందరికైనా లబ్ధి చేకూరుద్దామని వీరెవరూ అనుకోలేదు. దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ ఎంపీ పదవిని రక్షించడానికి యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోయినప్పుడు, లోక్‌పాల్ బిల్లు విషయంలోనూ అవినీతి వ్యతిరేక ఛాంపియన్‌గా కనబడేందుకు తాపత్రయపడిన రాహుల్‌గాంధీకి మహారాష్ట్ర పరిణామాలు తెలియవని అనుకో లేం. అయినా ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు! పారదర్శకత లేనిచోట, జవాబుదారీతనం కరువైనచోట ఎలాంటి కుంభకోణాలు చోటుచేసుకుంటాయో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ అన్నీ నిరూపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా స్వీయ రక్షణ ప్రయత్నాలకు స్వస్తిచెప్పి ఆదర్శ్ స్కాంలో దోషుల దండనకు మహారాష్ట్ర సర్కారు ముందుకు రావాలి. కాంగ్రెస్ పెద్దలు ఆ దిశగా వారిని కదిలించాలి.