'ఒకే భూమి ఒకే కుటుంబం.. ఈ స్ఫూర్తి ఉపనిషత్తులదే..' | One Earth One Family Timeless Ideal Inspired By Maha Upanishad | Sakshi
Sakshi News home page

G20 Summit: 'ఒకే భూమి ఒకే కుటుంబం.. ఈ స్ఫూర్తి ఉపనిషత్తులదే..'

Published Fri, Sep 8 2023 8:47 PM | Last Updated on Fri, Sep 8 2023 9:06 PM

One Earth One Family Timeless Ideal Inspired By Maha Upanishad - Sakshi

ఢిల్లీ: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమున్నాయని చెప్పారు. ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని పేర్కొన్న ఆయన.. వాతావరణం, సుస్థిర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని జీ20 నాయకులకు పిలుపునిచ్చారు. జీ20కి హాజరవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

జీ20కి ఆహ్వానం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపిన గుటెరస్.. భారత్ సారథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించడం ప్రపంచ మార్పుకు సంకేతమని అన్నారు. గ్లోబల్ సౌత్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కావాల్సినంత చేస్తోందని చెప్పారు. ఉపనిషత్తుల నుంచి వచ్చిన వసుధైక కుటుంబం అనే పదం నేటి ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. 

'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'పై దృష్టి పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. ఉపనిషత్తుల నుంచి ప్రేరణ పొందిన పదం నేటి ప్రపంచ సమస్యలకు సరైన పరిష్కారాలను సూచిస్తుంది. ప్రపంచంలో విభేదాలు,  ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో ఈ స్ఫూర్తి అవసరం' అని గుటెరస్ అన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భాగం కావడానికి భారతదేశం బలమైన పోటీదారుగా భావిస్తున్నారా అనే ప్రశ్నకు గుటెర్రెస్ స్పందిస్తూ.. "భద్రతా మండలిలో ఎవరు ఉండాలనేది నేను నిర్ణయించలేను. ఆ పని సభ్య దేశాలది. భారతదేశం నేడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ప్రపంచంలో భారతదేశ పాత్ర గొప్పది. వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి సంస్కరణ అవసరమని నేను నమ్ముతున్నాను.' అని గుటెరస్ అన్నారు. 

ఇదీ చదవండి: భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన చాలా ప్రత్యేకం: రిషి సునాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement