UN chief
-
'ఒకే భూమి ఒకే కుటుంబం.. ఈ స్ఫూర్తి ఉపనిషత్తులదే..'
ఢిల్లీ: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమున్నాయని చెప్పారు. ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని పేర్కొన్న ఆయన.. వాతావరణం, సుస్థిర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని జీ20 నాయకులకు పిలుపునిచ్చారు. జీ20కి హాజరవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. జీ20కి ఆహ్వానం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపిన గుటెరస్.. భారత్ సారథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించడం ప్రపంచ మార్పుకు సంకేతమని అన్నారు. గ్లోబల్ సౌత్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కావాల్సినంత చేస్తోందని చెప్పారు. ఉపనిషత్తుల నుంచి వచ్చిన వసుధైక కుటుంబం అనే పదం నేటి ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. #WATCH | G 20 in India | UN Secretary-General António Guterres says, "...One Family, One Earth, One Future - this phrase is inspired by the Maha Upanishad and finds profound resonance in today's world not just as a timeless ideal but as an indictment of our times. If we are… pic.twitter.com/cW6qwELreb — ANI (@ANI) September 8, 2023 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'పై దృష్టి పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. ఉపనిషత్తుల నుంచి ప్రేరణ పొందిన పదం నేటి ప్రపంచ సమస్యలకు సరైన పరిష్కారాలను సూచిస్తుంది. ప్రపంచంలో విభేదాలు, ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో ఈ స్ఫూర్తి అవసరం' అని గుటెరస్ అన్నారు. #WATCH | G 20 in India | UN Secretary-General António Guterres says, "...Let me begin by expressing my gratitude to India for the warm welcome and my hope that India's presidency at the G20 will help lead to the kind of transformative change our world so desperately needs in line… pic.twitter.com/7VFzfJWDA5 — ANI (@ANI) September 8, 2023 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భాగం కావడానికి భారతదేశం బలమైన పోటీదారుగా భావిస్తున్నారా అనే ప్రశ్నకు గుటెర్రెస్ స్పందిస్తూ.. "భద్రతా మండలిలో ఎవరు ఉండాలనేది నేను నిర్ణయించలేను. ఆ పని సభ్య దేశాలది. భారతదేశం నేడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ప్రపంచంలో భారతదేశ పాత్ర గొప్పది. వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి సంస్కరణ అవసరమని నేను నమ్ముతున్నాను.' అని గుటెరస్ అన్నారు. ఇదీ చదవండి: భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన చాలా ప్రత్యేకం: రిషి సునాక్ -
ముందుంది పెను ముప్పు తట్టుకోలేరు: యూఎన్ చీఫ్ సంచలన హెచ్చరిక
బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార కొరతపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి సంక్షోభం లాంటి సమస్యలకు తోడు ఉక్రెయిన్ యుద్ధంతో తలెత్తిన పరిస్థితుల కారణంగా గ్లోబల్ ఆహార విపత్తు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికాలో ఇప్పటికే వందల మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న తీవ్ర ప్రపంచ ఆకలి సంక్షోభం 2022 లో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కుటుంబాల్లో ఆకలి కేకల్ని రగిలించనుందని యూఎన్ చీఫ్ చెప్పారు. 2023లో పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చన్నారు. బెర్లిన్‌లో ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాల అధికారుల కిచ్చిన వీడియో సందేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎరువుల ధరలు, ఇంధన ధరలతో రైతులు సతమతమవుతున్నందున ఆసియా, ఆఫ్రికా, అమెరికా అంతటా పంటలు దెబ్బ తింటాయని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆహార ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యలే వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు సంక్షోభానికి కారణం కానున్నాయని తెలిపారు. ఈ సంక్షోభం, ఆకలి విపత్తుతో ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక పరిణామాలను తట్టుకునే శక్తి ఏ దేశానికి లేదన్నారు. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై విధించిన పాశ్చాత్య ఆంక్షలు ఆహార కొరతకు కారణమని మాస్కో చేసిన వాదన "పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని బెర్లిన్ సమావేశంలో పాల్గొన్న జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ అన్నారు. 2021 అదే నెలల్లో రష్యా ఈ సంవత్సరం మే, జూన్లలో ఎక్కువ గోధుమలను ఎగుమతి చేసిందని బేర్బాక్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆకలి సంక్షోభానికి అనేక అంశాలు కారణమన్న గుటెర్రెస్ చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతిచ్చారు. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి సునామీగా పరిణమించిందన్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్ల నుండి కీలకమైన వస్తువులను వెనక్కి తీసుకున్న రష్యాను క్షమించలేమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మండిపడ్డారు. అనేక ఇతర దేశాలతో కలిపి రష్యాపై తాము విధించిన ఆంక్షల్లో ఆహారం, ఆహార ఉత్పత్తులు, ఎరువులు, తదితరాలకు మినహాయింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు. -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
మయన్మార్ నుంచి భారత్‌కు 15వేల మంది: ఐరాస
ఐక్యరాజ్యసమితి: మయన్మార్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. ప్రజల నిరసనలపై మయన్మార్ సైన్యం ఉక్కుపాదం మోపింది. విచ్చలవిడిగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 1,120 మంది చనిపోయినట్లు అంచనా. ఘర్షణలు, హింసాకాండ నేపథ్యంలో మయన్మార్ నుంచి 15,000 మందికిపైగా పౌరులు సరిహద్దు దాటి, భారత్‌లోకి ప్రవేశించారని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు? ఈ మేరకు ఆయన ‘మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలు, ఇతర మైనార్టీల మానవ హక్కుల పరిస్థితి’పేరిట ఒక నివేదికను ఐరాస సర్వ సభ్య సమావేశంలో సమర్పించారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఫిబ్రవరి 1 కంటే ముందే సంక్షోభ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా 3.36 లక్షల మంది సొంత ప్రాంతాలను వదలిపెట్టారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 తర్వాత 2.20 లక్షల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారని వివరించారు. మరో 15వేల మందికిపైగా జనం సరిహద్దు దాటి, పొరుగు దేశమైన భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. చదవండి: నేడు గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు -
యూఎన్ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియా గుటెరస్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్‌ను నియమించాలని యూఎన్ భద్రతా మండలి సిఫారసు చేసింది. యూఎన్ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియాకే అవకాశం ఇవ్వాలని మంగళవారం జరిగిన సమావేశంలో 15 దేశాల భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. గుటెరస్ పేరుని సూచిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభకు తీర్మానాన్ని పంపింది. 193 సభ్యదేశాలున్న సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) ఆమోదిస్తే వరుసగా రెండోసారి... 2022 జనవరి 1 నుంచి అయిదేళ్ల పాటు గుటెరస్ ఈ పదవిలో ఉంటారు. మరోవైపు భారత్ భద్రతామండలి తీర్మానాన్ని స్వాగతించింది. (చదవండి: గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలుశిక్ష ) -
శాంతికోసం రంగంలోకి దిగుతా
వాషింగ్టన్:భారత్, పాకిస్థాన్ లు సంయమనం పాటించాలని, శాంతి కోసం ముందడుగు వేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఇరు దేశాలతో మాట్లాడటానికి తాను సిద్దమని ప్రకటించారు. ఇటీవలి సర్జికల్ స్ట్ర్రైక్ అనంతరం ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ లు అంగీక.రిస్తే ఇరు దేశాల ఉన్నతాధికారులతో కశ్మీర్ తో సహా అనేక విషయాలపై చర్చించడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18 న ఉడీలోని సైనిక క్యాంపు కార్యాలయంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 19 మంది జవాన్లు మరణించారు. మరికొంత మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేసేందుకు పొంచి ఉన్నారన్న సమాచారంతో ఇండియన్ ఆర్మీ సెప్టెంబర్ 28,29 న 'సర్జికల్ స్ట్ర్రైక్' పేరుతో దాడులు నిర్వహించి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. -
ఐరాస చీఫ్‌గా ఆంటోనియో!
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గట్టర్స్ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. సోమవారం ముగిసిన 15 దేశాల భద్రతా మండలి మూడో దశ ఎన్నికల్లో ఆంటోనియోకు అనుకూలంగా 11 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు రాగా, ఒక అభిప్రాయం నమోదు కాలేదు. అనధికారికంగా జరిగిన గత రెండు దశల్లోనూ ఆయనే ఆధిక్యంలో కొనసాగారు.ఈ దశలో ఆయన గెలుపు లాంఛనమే కానుంది. గట్టర్స్ పేరును అధికారికంగా అసెంబ్లీకి పంపగానే ఆయన సభ్యత్వాన్ని ఖరారు చేయనున్నారు. గట్టర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగానికి 10 సంవత్సరాలపాటు హై కమిషనర్‌గా పనిచేశారు. కాగా, ఈ పదవికి పోటీ పడిన స్లొవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. సెర్బియన్ విదేశాంగ మంత్రి వుక్ జెరిమిక్, యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకోవా మూడో స్థానంలో నిలిచారు. 70 సంవత్సరాలుగా యూఎన్ సెక్రటరీ జనరల్‌గా పురుషుడే ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ఒక మహిళను ఎన్నుకోవాలని సూచనలు వచ్చాయి. అయితే ఈ సారికూడా పాత పద్ధతే కొనసాగబోతోంది. -
పాక్‌తో చర్చలు అనుమానమే!
భారత్ - పాక్‌ల ఎన్ఎస్ఏ చర్చలపై ‘హురియత్’ నీలినీడలు కశ్మీర్ వేర్పాటు నేతలతో పాక్ ఎన్ఎస్ఏ భేటీ కావాలనుకోవడంపై భారత్ ఆగ్రహం అది సరికాదని, ఆ ఆలోచన విరమించుకోవాలని పాక్‌కు సూచన * భారత్ సలహాను తోసిపుచ్చిన పాకిస్తాన్; హురియత్ నేతలను కలుస్తామని స్పష్టీకరణ * సంయమనం పాటించాలని ఇరుదేశాలకు ఐరాస చీఫ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాక్ మొండి పట్టుదలతో చర్చలకు పురిట్లోనే సంధి కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. చర్చల కోసం రేపు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ కశ్మీర్ వేర్పాటు నేతలతో భేటీ కావాలనుకోవడంపై ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం చర్చల ప్రక్రియ నిలిపివేతకు దారితీసేలా కనిపిస్తోంది. వేర్పాటువాద నేతలతో భేటీ సరికాదని భారత్ సున్నితంగా ఇచ్చిన సూచనను పాక్ పెడచెవిన పెట్టింది. ఎన్ఎస్ఏ చర్చల కోసం భారత్ వస్తున్న పాక్ అధికారి.. కశ్మీర్ వేర్పాటు నేతలను కలుసుకోవడం తమకు ఆమోదయోగ్యం కాదన్న భారత్ సలహాను పాక్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భారత్ వెళ్లే తమ నేతలు, అధికారులు వేర్పాటువాదులతో భేటీ కావడం సాధారణమేనని, ఆ సంప్రదాయాన్ని కాలదన్నే ఆలోచన తమకు లేదని అధికారికంగానే తేల్చిచెప్పింది. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, హురియత్ నేతలే ‘భారత్ ఆక్రమిత కశ్మీరీ’ల నిజమైన ప్రతినిధులంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేసింది. చర్చల బంతి భారత్ కోర్టులో ఉందని, చర్చల్లో పాల్గొంటారా? లేక బంతిని తీసుకుని పారిపోతారా? చూడాల్సి ఉందంటూ పాక్ సమాచార మంత్రి పర్వేయిజ్ రషీద్ అన్నారు. పాక్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది. నిర్మాణాత్మక చర్చలు జరపాలంటూ రష్యాలోని ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్‌లు తీసుకున్న నిర్ణయం నుంచి పాక్ తప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. ‘హురియత్ నేతలతో భేటీ కావాలనుకునే పాక్ పట్టుదల ఉఫా ఒడంబడికకు సంపూర్ణ ఉల్లంఘనే కాకుండా ఆమోదిత ఎజెండానుంచి తప్పుకోవడమే’ అని స్పష్టం చేసింది. ‘ద్వైపాక్షిక సంబంధాల్లో ఇద్ద రు ప్రతినిధులు మాత్రమే ఉంటారు. ముగ్గురు కాదనే విషయంలో భారత్ స్పష్టతతో ఉంది. ఆ విధానానికే కట్టుబడి ఉంది. ఏకపక్షంగా షరతులు, ఆమోదిత ఎజెండాను ఉల్లంఘించడం చర్చలకు ప్రాతిపదిక కాబోవు’ అని తేల్చిచెప్పింది. భారత్ ఆగ్రహాన్ని పట్టించుకోని పాక్.. సోమవారం ఉదయం 9.30 గంటలకు పాక్ ఎన్ఎస్ఏ అజీజ్ కశ్మీర్ అతివాద వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీతో భేటీ అవుతారని ప్రకటించింది. అంటే, భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌తో భేటీకి ముందే గిలానీతో అజీజ్ సమావేశమవుతారు. కాగా, పాక్‌తో జరిగే చర్చల్లో ఉగ్రవాదం మాత్రమే ఎజెండా అని భారత హోంమంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. చర్చలకు కట్టుబడి ఉన్నామని, అయితే, పాక్ విధిస్తున్న ఏకపక్ష షరతులు చర్చల కొనసాగింపునకు ప్రాతిపదిక కాబోవని భారత్ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఉఫాలో రెండు దేశాల ప్రధానులు అంగీకరించిన ఎజెండాపై పాక్ వెనక్కి వెళ్తోందని, అది చర్చలను పాక్ సీరియస్ తీసుకున్నట్లు కనిపించడం లేదంది. అది మా సంప్రదాయం: పాక్ అర్థంలేని కారణాలు చూపుతూ భారత్ ముందస్తు షరతులు విధించడం తమకు నిరుత్సాహం కలిగిస్తోందని పాక్ పేర్కొంది. ముందు అంగీకరించిన నిర్ణయాలపై భారత్ వెనక్కు వెళ్తోందంటూ పాక్ విదేశాంగ శాఖ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. హురియత్ నేతలతో తమ చర్చలుంటాయని స్పష్టం చేసింది. భారత్ ఆజ్ఞలను పాటించబోమని, భారత్-పాక్ చర్చలు షరతులతో కూడిన దౌత్యంపై ఆధారపడిలేవని పేర్కొంది. చర్చల నుంచి పారిపోయేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఇప్పటికీ చర్చల ఎజెండాను భారత్ తమకు పంపించనేలేదని ఆరోపించింది. చర్చలకు ముందస్తు షరతులు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదంది. పాక్ సైన్య, పౌర నాయకత్వంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక సమాలోచనలు జరిపిన అనంతరం ఈ స్పందన వెలువడింది. ‘అమలు చేయని ఐరాస భద్రతామండలి తీర్మానం ప్రకారం.. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతం. భారత్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల వాస్తవ ప్రతినిధులు హురియత్ నేతలే. కశ్మీర్ సమస్య పరిష్కార యత్నాల్లో వారిదే వాస్తవ ప్రాతినిధ్యం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉఫా ప్రకటన మేరకు కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలతో ఎజెండాను ఈ చర్చల నిమిత్తం భారత్‌కు ప్రతిపాదించాం’ అని తెలిపారు. హురియత్ నేతలతో భేటీ కావడమనే సంప్రదాయం నుంచి తప్పుకోదల్చుకోలేదని పాక్‌లోని భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్‌కు పాక్ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ అహ్మద్ చౌధరి శుక్రవారం సందేశం పంపించారు. దౌత్యంలో షరతులుండవు: హురియత్ న్యూఢిల్లీ/శ్రీనగర్: దౌత్య వ్యవహారాల్లో హద్దులు, షరతులు ఉండకూడదని జమ్మూ కశ్మీర్ మితవాద వేర్పాటువాది, హురియత్ నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ అన్నారు. భారత్, పాక్‌లు చిత్తశుద్ధితో చర్చల ప్రక్రియ కొనసాగించగలిగితే, ఆ చర్చల్లో ఎప్పుడు పాలు పంచుకోవాలనే విషయంలో తమకు పట్టింపు లేదన్నారు. కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యలు పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమన్నారు. కశ్మీర్ సమస్యను పక్కనపెట్టడమో, పట్టించుకోకపోవడమో చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. ‘కశ్మీర్ సరిహద్దు సమస్య కానే కాదు. అది 1.25 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. కశ్మీరీలు తృతీయ స్థాయి ప్రతినిధులు కాదు. వారే మౌలికప్రతినిధులు’ అని ఆయన స్పష్టం చేశారు. చర్చలు జరపండి.. కాగా, సంయమనం పాటించాలని ఇరు దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ బాన్‌కి మూన్ విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్చలను జరపాలన్నారు. పాక్, ఐఎస్ఐఎస్ జెండాల ప్రదర్శన శ్రీనగర్: శ్రీనగర్‌లో శుక్రవారం కొంతమంది యువకులు భారత జాతీయ పతాకాన్ని తగులబెట్టి, పాక్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. నౌహట్టా ప్రాంతంలోని జామియా మసీదులో ప్రార్థనలు ముగిశాక ఆందోళనకారులు అక్కడి దగ్గర్లో నిరసన తెలిపారు. త్రివర్ణ పతాకంతోపాటు పీడీపీ పార్టీ జెండాలనూ దగ్ధం చేశారు. వారిలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వేర్పాటువాద నేత అహ్మద్ షాకు గృహనిర్బంధం కశ్మీర్ వేర్పాటువాద నేత, డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ చీఫ్ షాబిర్ అహ్మద్ షాను శుక్రవారం ప్రార్థన నేపథ్యంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసులు ఆయనకు ప్రార్థనల కోసం బయటకెళ్లేందుకు అనుమతించలేదని పార్టీ ప్రతినిధి తెలిపారు. మరోపక్క.. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ గృహనిర్బంధం కొనసాగుతోంది. హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్ తదితర వేర్పాటు నేతలను గురువారం పోలీసులు కొన్నిగంటల పాటు గృహనిర్బంధంలో ఉంచి తర్వాత విడుదల చేశారు. ఉఫా స్ఫూర్తిని కాలదన్నడమే: భారత్ పాక్ తీరు ‘ఉఫా’ స్ఫూర్తిని కాలదన్నేలా ఉందని భారత్ పేర్కొంది. ‘అన్ని ఉగ్రవాద అంశాలపై చర్చించాలని ఉఫాలో ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతికి చర్యలు తీసుకోవాలని అంగీకరించారు. కానీ జరుగుతున్నదేంటి? సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిగాయి. ఓ పాక్ ఉగ్రవాదిని పట్టుకున్నాం. ఇవన్నీ చర్చల సందర్భంగా పాక్‌కు ఇబ్బంది కలిగించేవే. అందుకే చర్చల నుంచి తప్పుకునేందుకు పాక్ ఈ ఎత్తులు వేస్తోంది’ అని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ జైపూర్‌లో అన్నారు. చర్చల ఎజెండాను పాక్‌కు పంపామని, దానికి విరుద్ధమైన ఎజెండాను పాక్ పంపిందని వెల్లడించారు. -
స్వలింగ సంపర్క చట్టంపై యూఎన్ చీఫ్ హర్షం
ఐక్యరాజ్యసమితి: అమెరికాలో స్వలింగ సంపర్క పెళ్లిళ్లకు చట్టబద్దత కల్పించడంపై ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరి బాన్ కీ మూన్ హర్షం వ్యక్తం చేశారు. యూఎస్ లోని 50 రాష్ట్రాల్లో స్వలింగ సంపర్క పెళ్లిళ్లకు ఆమోద ముద్ర లభించడం నిజంగానే మానవహక్కుల పరిరక్షణలో ఓ భాగమని ఆయన స్పష్టం చేశారు. గేలు మరియు లెస్బియన్స్ కు చట్టపరంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకారం లభించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆయన పేర్కొన్నారు. స్వలింగ సంపర్క చట్టంపై అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశంలో నివసించే స్వలింగ సంపర్క పౌరులకు ఇది చట్టపరంగా లభించిన హక్కుగా తెలిపింది. ఇప్పటికీ 14 రాష్ట్రాల్లో స్వలింగ సంపర్క చట్టంపై నిషేధం కొనసాగడంపై ధర్మాసనం తనదైన శైలిలో స్పందించింది. వారిపై బలవంతంగా నిషేధం విధించాలని ప్రయత్నించినా అది ఎంతో కాలం నిలవదని పేర్కొంది. గత సంవత్సరం నవంబర్ లో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.