ఆదర్శనీయుడు వివేకానందుడు | Ideal man to vivekanandha | Sakshi
Sakshi News home page

ఆదర్శనీయుడు వివేకానందుడు

Published Sat, Aug 9 2014 1:11 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

ఆదర్శనీయుడు వివేకానందుడు - Sakshi

ఆదర్శనీయుడు వివేకానందుడు

పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్
 
హైదరాబాద్ : స్వామి వివేకానందుడి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత అన్ని రంగాల్లో ముందుకు పోవాలని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. స్వామి వివేకానంద 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని దోమలగూడ రామకృష్ణమఠంలో జరుగనున్న జాతీయ యువజన సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వివేకానందుడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.

ప్రపంచం మొత్తం వృద్ధులను మోస్తుంటే భారత్ మాత్రం యువకళను సంతరించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద,బేలూరు మఠం రామకృష్ణ మిషన్ వివేకానంద యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ స్వామి ఆత్మ ప్రియానంద, మఠం అసిసెంటంట్ సెక్రటరీ స్వామి బోధశరణానంద తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement