
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెళ్లకెరె రూరల్(కర్ణాటక) : వినికిడి లోపంతో పాటు మాటలు రాని ఓ జంట ఆదివారం వివాహం ద్వారా ఒక్కటయ్యారు. తాలూకాలోని సిద్దా పుర గ్రామానికి చెందిన మంగళమ్మ, మంజునాథ్ దంపతుల కుమార్తె సౌమ్య, దావణగెరెకు చెందిన యమునమ్మ మంజణ్ణ దంపతుల కుమారుడు పరశురామలు పెద్దల సమక్షంలో ఒక్కటవ్వానుకున్నారు .
ఈ క్రమంలో, ఆదివారం కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహం చేసుకున్నారు. వీరికి మాటలు రావు, వినపడవు. నూతన దంపతులను పెద్దవాళ్లందరు ఆశీర్వదించారు. ఒకరి మనసును మరొకరు తెలుసుకుని అన్యోన్యంగా ఉండాలని పెద్దవాళ్లు ఆశీర్వదించారు. వీరి పెళ్లి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర..
Comments
Please login to add a commentAdd a comment