చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలి | The process should ideally | Sakshi
Sakshi News home page

చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలి

Published Sun, Mar 9 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలి

చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలి

 బేగంపేట,  మెగాస్టార్ చిరంజీవిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ సినీ నటుడు నాగబాబు కోరారు.  శనివారం బేగంపేట మనోహర్ హోటల్‌లో నిర్వహించిన శ్రీశక్తి హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరంజీవికి ఓ విజన్ ఉందని, దానికనుగుణంగానే ఆయన ఎంతో కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్నాడన్నారు. విద్యార్థులు కూడా ఆయనలాగే ఉన్నత లక్ష్యాలతో మరింత ఉన్నతస్థితికి ఎదగాలని నాగబాబు ఆకాంక్షించారు. రెండు దశాబ్దాల ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన శ్రీశక్తి హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మరింత అభివృద్ధి చెందాలన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అతిథులుగా పాల్గొన్న  కేంద్ర విజిలెన్స్ క మిషనర్ (రిటైర్డ్)  రంజనికుమార్ ,  కళాశాల  డెరైక్టర్ యమునా రంగారావులను సత్కరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, కాలేజి వార్షిక మ్యాగజైన్‌ను ఆయన ప్రారంభించారు.  కార్యక్రమంలో హోటల్ చైర్మన్ డీవీ మనోహర్, డెరైక్టర్ సత్యపింజల, పలువురు విద్యార్థ్దులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement