Nagababu Shares Emotional Post About Chiranjeevi And Pawan Kalyan - Sakshi
Sakshi News home page

Nagababu: నా జీవితం మైలులో నవ్వులు రెట్టింపు చేసే నా బ్రదర్స్‌..

Published Tue, Aug 24 2021 5:20 PM | Last Updated on Tue, Aug 24 2021 7:56 PM

Nagababu Shares Emotional Post About Chiranjeevi And Pawan Kalyan - Sakshi

Nagababu Emostional Post: మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు, రాఖీ పౌర్ణమి ఒకే రోజు రావడంతో మెగావారి ఇంట రెండు పండగల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెగా కుటుంబం, బంధువులు అంత ఒకచోట చేరి సందడి చేశారు. అయితే ఎప్పుడూ కుటుంబ వేడుకులను దూరంగా ఉండే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ సారి హజరవ్వడంతో మెగా అభిమానులు, పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆనందం మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్‌ నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఏమోషన్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. సోదరుడు చిరు, పవన్‌లతో సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో షేర్‌ చేస్తూ వీరే నా బలం అంటూ భావోద్యేగానికి లోనయ్యాడు.

చదవండి: చిరంజీవి బర్త్‌డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్‌, ఏమైంది..

‘నా ప్రతి మైలులో చిరునవ్వులు రెట్టింపు చేసి, ప్రతి క్షణం నా జీవితంలో మ్యాజిక్‌ను నింపే నా సోదరులు.. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లు నా బలం, నా జీవితం’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా ఆదివారం(అగష్టు 22) రాఖీ పౌర్ణమితో పాటు చిరు బర్త్‌డే కూడా వచ్చింది. దీంతో మెగా ఆడపడుచులు మెగా బ్రదర్స్‌కు రాఖీ కట్టి ఆశ్వీర్వాదలు తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య మెగాస్టార్‌ కేక్‌ కట్‌ చేశాడు. ఈ కార్యక్రమంలో మెగా హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌లు, అల్లు అరవింద్‌, ఆయన భార్య, ఉపాసన కొణిదెల, మెగాస్టార్‌ కూతుళ్లు సుస్మిత, శ్రీజతో పాటు నిహారిక ఆమె భర్థతో పాటు పలువురు హాజరయ్యారు. కానీ ఈ వేడుకలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యామిలీ లేకపోవడం బన్ని ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. 

చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్‌, మేకప్‌కు అంత సమయమా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement