
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు, కుమారుడు రామ్ చరణ్ తేజ్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌లో చిరంజీవి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిరంజీవి, రామ్‌చరణ్ అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు చిరంజీవి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయాలనుకుని నిర్ణయించుకున్న మెగా బ్లడ్ బ్రదర్స్‌ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తన పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి, రక్తదానం చేసిన, చేస్తున్న రక్తదాక్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. రక్త దానం చేయండి, ప్రాణ దాతలుకండి అంటూ చిరంజీవి తన వాయిస్ వీడియో ద్వారా సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని అందించారు.
ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Comments
Please login to add a commentAdd a comment