రామచంద్రపురం: కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే సాకుతో ప్రభుత్వం ఉన్నబడులకు మంగళం పాడేందుకు, ఉపాధ్యాయులను బోధనేతర విధులకు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేతకు తెర తీసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఈనెల 6న మార్గదర్శకాలను జారీ చేసి ఈనెల 15లోగా నివేదికలు అందించాలని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అటు ఉపాధ్యాయుల్లో, ఇటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలోని 3,842 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 7 వేల మంది సెకండరీ గ్రే డ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గ్రామీణ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుందనే నెపంతో ఇటీవల మండలంలో క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభు ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావటంతో విరమించుకుంది. తాజాగా పంచాయతీ, మున్సిపాలిటీలను యూనిట్‌గా తీసుకుని ఒక్కో ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పంచాయతీల్లో ఒక కిలోమీటరు పరిధిలో గల ప్రాథమిక పాఠశాల లేదా 30 మందికి తక్కువ విద్యార్థులున్న పాఠ శాలలను విలీనం చేసి వంద మంది విద్యార్థులతో ఆదర్శపాఠశాలను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒక్కో ఆదర్శ పాఠశాలలో అయిదుగురు ఉపాధ్యాయులను నియమించి తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనే విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 584 పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని విద్యాశాఖాధికారుల అంచనా.
కొత్త ఎస్‌జీటీల నియూమకం ఎక్కడ?
ఆదర్శ పాఠశాలల్లో సర్దుబాటు కాకుండా మిగిలిపోయిన ఉపాధ్యాయులను బోధనేతర విధులకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాలో సుమారుగా 3 వేల మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులు బోధనకు దూరం కానున్నారని అంచనా. వారిని ఎంఈఓ, డీవైఈఓ, డీఈఓ, డైట్ సర్వశిక్షాభియాన్ కార్యాలయాల్లో, ఇతరత్రా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవటం తగదని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పాఠశాలల విలీనంతో 3 వేల మందికి పైగా ఎస్‌జీటీలు ఖాళీ అవుతుంటే తాజా డీఎస్సీ ద్వారా నియమితులు కానున్న 844 మందిని ఎక్కడ నియమిస్తారని ప్రశ్నిస్తున్నారుు.
ఇదేమి ఆదర్శం?
Published Thu, Jun 11 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement
Advertisement