
ఉప్పొంగుతున్న వరదలోంచి బైక్‌ను అతి కష్టం మీద తీసుకెళుతున్న టీచర్లు
వరదల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఒక రకంగా సాహసాలు చేయాల్సి వస్తోంది.
గూడెంకొత్తవీధి: వరదల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఒక రకంగా సాహసాలు చేయాల్సి వస్తోంది. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం పెదవలసకు చెందిన ఉపాధ్యాయులు రోజూ బూదరాళ్ల మీదుగా కొయ్యూరు బాలుర పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ నీరు కల్వర్టు మీదికి రావడంతో అతికష్టం మీద బైక్‌ను ఒడ్డుకు చేర్చి పాఠశాలకు చేరుకున్నారు.
ఇవీ చదవండి:
Facebook Whatsapp: దొంగచాటుగా మెసేజ్‌లు చదువుతూ..
అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్