gk veedhi
-
విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మళ్లీ రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీకే వీధి మండలం సిగినాపల్లి క్వారీని నెలరోజుల కిందట పోలీసులు మూసివేయించారు. దీంతో అంతర రాష్ట్ర రంగురాళ్ల వ్యాపారుల ముఠాలు వేరే క్వారీలపై దృష్టి సారించాయి. జి.మాడుగుల మండలంలోని మారుమూల గడుతూరు పంచాయతీ కూటికొండలు, ఇదే క్వారీకి సమీపంలోని చింతపల్లి సరిహద్దు నిట్టాపుట్టు అటవీ ప్రాంతంలోను, అడ్డతీగల మండలం తపస్వీకొండ అటవీ ప్రాంతంలోను రంగురాళ్ల క్వారీలు వెలుగు చూశాయి. ఆయా క్వారీల వద్ద వ్యాపారులు మకాం వేసి, గిరిజనులను ప్రోత్సహిస్తుండడంతో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. విశాఖ, రాజమహేంద్రవరాల్లో విక్రయాలు కొంతమంది వ్యాపారులు పాడేరు, వి.మాడుగుల, నర్సీపట్నం మండలాల్లో మకాం వేసి, రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. స్థానికంగా రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని నేరుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్న పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాటిని జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లకు పెద్ద వ్యాపారులు తరలిస్తున్నారు. జి.మాడుగుల మండలం కూటికొండలు, అడ్డతీగల మండలం తపస్వికొండపై గల క్వారీల్లో విలువైన క్యాట్ ఐ రకం(పిల్లికన్ను రంగు) రంగురాళ్లు లభ్యమవుతున్నాయని తెలిసింది. కూటికొండలు రంగురాళ్ల క్వారీ వద్దకు మైదాన ప్రాంతాల్లోని వి.మాడుగుల, రావికమతం, జి.మాడుగుల మండలాలకు చెందిన వ్యాపారులు రోజూ వెళుతూ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరిపిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ డబ్బు ఆశతో గిరిజనులు లోతుగా తవ్వుతున్నారు. తపస్వికొండపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అడ్డతీగల ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానిక వ్యాపారులే అక్కడ రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తూ అక్కడ సేకరించిన వాటిని రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి తరలిస్తు పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నారు. రంగురాళ్ల తవ్వకాలను నిరోధిస్తాం జి.కె.వీధి మండలంలో సిగినాపల్లి వద్ద రంగురాళ్ల క్వారీని పూర్తిగా మూసివేశాం. డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశాం. కూటికొండలు, తపస్వికొండల వద్ద తనిఖీలు నిర్వహించి వెంటనే ఆయా క్వారీలను కూడా మూసివేస్తాం. రంగురాళ్ల తవ్వకాలు, వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగురాళ్ల వ్యాపారుల ముఠాల సంచారంపై దృష్టి పెడతాం. కొండలపై తవ్వకాలు జరిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. తవ్వకాలను ఎవరైనా ప్రోత్సహిస్తే తమకు సమాచారం ఇవ్వాలి. – సతీష్‌కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
ఉప్పొంగుతున్న వరద.. టీచర్ల సాహసం
గూడెంకొత్తవీధి: వరదల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఒక రకంగా సాహసాలు చేయాల్సి వస్తోంది. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం పెదవలసకు చెందిన ఉపాధ్యాయులు రోజూ బూదరాళ్ల మీదుగా కొయ్యూరు బాలుర పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ నీరు కల్వర్టు మీదికి రావడంతో అతికష్టం మీద బైక్‌ను ఒడ్డుకు చేర్చి పాఠశాలకు చేరుకున్నారు. ఇవీ చదవండి: Facebook Whatsapp: దొంగచాటుగా మెసేజ్‌లు చదువుతూ.. అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
వణికిపోతున్న విశాఖ మన్యం
సాక్షి, పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి తాకిడితో ప్రజలు వణికిపోతున్నారు. ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తుంది. సోమవారం ఉదయం 9 గంటల వరకు మన్యంలో మంచు తెరలు వీడలేదు. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం, అరకులోయ కాఫీబోర్డు వద్ద 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతల ప్రాంతాలైన జి.కె.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో చలి తీవ్రత నెలకొంది. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రధాన రోడ్లలో వాహన చోదకులు ఉదయం 8 గంటల వరకు వాహనాలకు లైట్లు వేసుకునే ప్రయాణిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు మంచు, చలితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. జీకే వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరిగనట్టుగా సమాచారం. అయితే ఈ కాల్పులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతిచెందిన వారిని గిరిజనులుగా అనుమానిస్తున్నారు. . కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీకే వీధిలో కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల నేపథ్యంలో శనివారం పోలీసులు కూంబింగ్ తీవ్రతరం చేశారు. అందులోభాగంగా జీకే వీధి మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అందులోభాగంగా మావోయిస్టులకు సంబంధించిన కీలక కిట్లతోపాటు 303 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నడింవీధి అటవీ ప్రాంతంలో కూడా పోలీసులు జల్లెడపడుతున్నారు. -
సుమోలో వచ్చి.. గ్రామస్తులపై కాల్పులు
జిల్లాలోని జీకే వీధి మండలం చెరుకుపాకల గ్రామస్తులపై శుక్రవారం ఉదయం సుమోలో వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఉన్నట్టుండి తుపాకి పేలుళ్లు వినిపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీశారు. కాల్పులు జరిపింది దుండగులేమోనని భావించిన ప్రజలు చాలా సేపటివరకు ఇంళ్లనుంచి బయటికి రాలేదు. అయితే ఘటన జరిగిన మూడు గంటల తర్వాత.. కాల్పులకు పాల్పడింది సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులేనని విశాఖ ఎస్పీ కోయ ప్రవీణ్ దృవీకరించారు. కుంకుమపూడికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బు వసూలు చేసేందుకు మావోయిస్టులు వస్తున్న సమారం అందడంతో మాటువేసిన పోలీసులు నక్సల్స్ ను బంధించే క్రమంలోనే కాల్పులు జరిగాయని, ఒక మహిళా మావోయిస్టును అదుపులోకి తసుకున్నామని ఎస్పీ చెప్పారు. అయితే గ్రామస్తులను లెక్కపెట్టకుండా ఇష్టారీతిగా తూటాలు పేల్చడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.