జిల్లాలోని జీకే వీధి మండలం చెరుకుపాకల గ్రామస్తులపై శుక్రవారం ఉదయం సుమోలో వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఉన్నట్టుండి తుపాకి పేలుళ్లు వినిపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీశారు. కాల్పులు జరిపింది దుండగులేమోనని భావించిన ప్రజలు చాలా సేపటివరకు ఇంళ్లనుంచి బయటికి రాలేదు. అయితే ఘటన జరిగిన మూడు గంటల తర్వాత.. కాల్పులకు పాల్పడింది సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులేనని విశాఖ ఎస్పీ కోయ ప్రవీణ్ దృవీకరించారు.
కుంకుమపూడికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బు వసూలు చేసేందుకు మావోయిస్టులు వస్తున్న సమారం అందడంతో మాటువేసిన పోలీసులు నక్సల్స్ ను బంధించే క్రమంలోనే కాల్పులు జరిగాయని, ఒక మహిళా మావోయిస్టును అదుపులోకి తసుకున్నామని ఎస్పీ చెప్పారు. అయితే గ్రామస్తులను లెక్కపెట్టకుండా ఇష్టారీతిగా తూటాలు పేల్చడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.