ఫైనాన్షియల్ బేసిక్స్..
రవి వయసు 23 ఏళ్లు. కొత్తగా ఉద్యోగంలో చేరాడు. వచ్చే సంపాదనలో కొంత పొదుపు చేయాలనుకున్నాడు. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో అతనికి తన చిన్ననాటి స్నేహితుడు ఖలీద్ తారసపడ్డాడు. రవి తన సందేహాలను ఖలీద్‌కు చెప్పాడు. ఖలీద్ అతనికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అవేంటో చూద్దాం...
* ముందు ఎంత మొత్తంలో రిస్క్ భరించగలమో అంచనా వేసుకోవాలి. సాధారణంగా యుక్త వయసులోని వారు ఎక్కువ రిస్క్‌ను భరించగలరు.
* రిస్క్‌ను భరించగలిగినప్పుడు.. దానికి అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికను తయారు చేసుకోవాలి.
* ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలో ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలకు ప్రాధాన్యమివ్వాలి. వీటితోపాటు కమోడిటీ మార్కెట్లో (బంగారం) కొంత ఇన్వెస్ట్ చేయాలి.
* మనం సేవింగ్ చేయాలనుకుంటున్న మొత్తంలో 70-75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకుగానూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవాలి. ఇది లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఓరియెంటెడ్‌గా ఉండాలి.
* ఇక 25-20 శాతం మొత్తాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఆదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకు లిక్విడిటీ, స్థిరత్వం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి.
* పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం ఇకచివరగా మిగిలిన మొత్తాన్ని బంగారంలో పెట్టుబడిగా పెట్టాలి. చాలా మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
* ఇన్వెస్ట్‌మెంట్లను రెగ్యులర్‌గా చేయాలి. సిప్ పద్ధతిని అనుసరించడం ఉత్తమం.
కెరీర్ ప్రారంభంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
Published Mon, May 9 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM
Advertisement
Advertisement