
సైకో లవర్‌లా ప్రేమించిన అమ్మాయిని వేధించినా... కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసే ప్రియుడిగా కనిపించినా వెండితెర మెప్పు పొందడం అతనికే చెల్లించింది. రాజ్ మేరా నామ్ అంటూ రోమాంటిక్ హీరోగా అంతులేని పాపులిటీ సొంతం చేసుకున్నాడు. దీవానగా ప్రయాణం మొదలెట్టి ‘దిల్‌వాలే’గా ఎదిగి... డాన్‌గా, రా.వన్‌గా కొత్త ఎత్తులకు చేరాడు. అసలు పేరు షారుఖ్‌ఖాన్ అయితే బాలీవుడ్ బాద్షా, కింగ్‌ఖాన్ సర్వనామాలుగా మార్చుకున్నాడు. వెండితెరపై 29 ఏళ్లుగా ప్రేక్షకులను రంజిప చేస్తూ... ఈ 30వ ఏట పఠాన్‌గా మనల్ని అలరించబోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment