పొగతో కెరీర్‌కు సెగ
పరిపరి శోధన
పొగతాగే అలవాటుతో ఆరోగ్యానికి మాత్రమే కాదు, కెరీర్‌కూ సెగ తప్పదని తాజా అధ్యయనాల్లో తేలింది. పొగతాగే అలవాటు ఉన్నవారి కంటే పొగతాగని వారే కెరీర్‌లో ముందుకు దూసుకుపోతారని, పొగరాయుళ్లు తమ అలవాటు కారణంగా కెరీర్‌లో వెనుకబడిపోతున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు.
ఇదిలా ఉంటే, పొగరాయుళ్లకు ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమవుతోందని తమ అధ్యయనంలో తేలినట్లు కాలిఫోర్నియా కాలేజీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ అష్టకష్టాలు పడి ఉద్యోగం సంపాదించినా, పొగరాయుళ్ల ఆదాయం పొగతాగని వారి ఆదాయం కంటే తక్కువగానే ఉంటోందని వారు అంటున్నారు.