ఇటు వంట... అటు ఉత్కంఠ! | trisha new Horror thriller movie | Sakshi
Sakshi News home page

ఇటు వంట... అటు ఉత్కంఠ!

Aug 4 2016 12:04 AM | Updated on Sep 4 2017 7:40 AM

ఇటు వంట... అటు ఉత్కంఠ!

ఇటు వంట... అటు ఉత్కంఠ!

ఎప్పుడూ షూటింగులేనా? ఖాళీ సమయాల్లో ఇంటి పనులేమైనా చేస్తారా?

ఎప్పుడూ షూటింగులేనా? ఖాళీ సమయాల్లో ఇంటి పనులేమైనా చేస్తారా? అసలు మీకు వంట చేయడం వచ్చా? అని త్రిషను అడిగితే.. ‘తినడం మాత్రం బాగా వచ్చు’ అని కూల్‌గా అంటారు. ‘‘మా ఇంట్లో కిచెన్ చూసి చాలా రోజులైంది. ఇక, గరిటె తిప్పే టైమ్ ఎక్కడుంది?’’ అని కూడా అంటున్నారు. కథానాయికగా దాదాపు పదమూడేళ్ల నుంచి వరుస సినిమాలతో త్రిష ఎప్పుడూ బిజీగానే గడిపారు. ఇప్పుడామెకు వంట చేసే అవకాశం లభించింది. అంటే.. అంత ఖాళీగా ఉన్నారా? అనుకోవద్దు.

ఎందుకంటే.. వంట చేసేది ఇంట్లో కాదు, షూటింగులో. ప్రస్తుతం మాదేశ్ దర్శకత్వంలో త్రిష నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘మోహిని’. ఈ చిత్రంలో చెఫ్‌గా నటిస్తున్నారామె. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ పాత్రలో కనిపించనున్నారామె. పాత్రలో పర్‌ఫెక్షన్ కోసం షూటింగ్ ప్రారంభించడానికి ముందు చెఫ్స్ నుంచి సలహాలు తీసుకున్నారట. వంటతో పాటు ప్రేక్షకులను ఆమె ఉత్కంఠకూ గురి చేయనున్నారు. ఈ హారర్ థ్రిల్లర్‌లో దెయ్యంగానూ కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement