![Rakul Preet Singh Did Not Want To Hide Relationship With Jackky Bhagnani - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/05/23/rakulj.jpg.webp?itok=cDIqXNMS)
టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ ఇటీవల 'రన్ వే 24', జాన్ అబ్రహం అటాక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల‍్ని అలరించింది. 'రన్ వే 24' మూవీలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్, ప్రేమపై పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది చాలా సహజం అని చెప్పుకొచ్చింది.
'జాకీ భగ్నానీ నేను మంచి స్నేహితులం. మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. మా రిలేషన్‌షిప్ గురించి ఓకే అనుకున్నప్పుడే వీలైనంత త్వరగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే రిలేషన్‌ను బయటకు చెప్పకపోతే మా గురించే వచ్చే వార్తలు, పుకార్లతో ప్రశాంతంగా ఉండలేం. నిజానికి మా వ్యక్తిగత జీవితం గురించి కాదు, మేము చేసే వర్క్ గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక రిలేషన్‌షిప్‌లో ఉండటం చాలా సహజం. మన లైఫ్‌లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మనకోసం ఒకరు ఉంటారు. సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి ఎక్కువగానే ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే మేము బహిరంగంగా చెప్పేశాం.' అని రకుల్ తెలిపింది.
చదవండి: ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్
వెబ్ సిరీస్‌గా మారిన అక్షయ్, రకుల్ చిత్రం..
Comments
Please login to add a commentAdd a comment