Naga Shaurya Birthday Special: Talented Young Hero career and growth, Details Inside - Sakshi
Sakshi News home page

Naga Shaurya: టాలెంటెడ్‌ హీరో కెరియర్‌ అండ్‌ గ్రోత్‌ ఎలా ఉందంటే!

Published Sat, Jan 22 2022 9:55 AM | Last Updated on Sat, Jan 22 2022 4:07 PM

Talented Young Hero Naga Shaurya career and growth  - Sakshi

Happy Birthday Naga Shaurya: వరుస ఆఫర్లతో సక్సెస్‌పుల్‌గా కరియర్‌ను ట్రాక్‌లో నడిపిస్తున్న  టాలెంటెడ్‌ అండ్‌ హార్డ్‌ వర్కింగ్‌ టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య.'చందమామ కథలు' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి 'ఊహలు గుసగుసలాడే' అంటూ అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టాడు. క్యూట్‌ లుక్స్‌తో, లవర్‌ బాయ్‌లా ఛలో అంటూ సూపర్‌ హిట్‌  కొట్టేశాడు. ఇటీవల ఎయిట్‌ ప్యాక్‌ బాడీతో అదరగొట్టి ‘లక్ష్య’న్ని మిస్‌ చేసుకున్నాడు. ఇపుడిక వరుడు కావలెను అంటూ ఓటీటీలో సందడి చేస్తున్నాడు. జనవరి 22 నాగశౌర్య పుట్టినరోజు  సందర్భంగా  ఈ లవర్‌బాయ్‌  గురించిన విశేషాలపై ఓ లుక్కేద్దామా!

మాంచి ఒడ్డూ పొడుగుతో అందమైన నవ్వుతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య.   తొలి సినిమాతో ఎట్రాక్ట్‌ చేసి వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. 'కల్యాణ వైభోగమే' 'దిక్కులు చూడకు రామయ్యా' 'జ్యో అచ్యుతానంద' 'ఒక మనసు' చిత్రాతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. ఇక అక్కడినుంచి  వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస  అవకాశాలను దక్కించుకున్నాడు. ముఖ్యంగా  రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన 'ఛలో' తో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య  ఆ తరువాత దూకుడును మరింత పెంచాడు.

నాగశౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. సినీరంగంలో ప్రవేశానికి ముందుగా టెన్నిస్ ఆడేవాడట. విజయవాడలో ఉంటున్న రోజులనుంచి సినిమాలలో నటించాలనేకోరిక పుట్టింది. అలా తన డ్రీమ్స్‌ సాకారం కోసం హైదరాబాదు షిప్ట్‌ అయ్యాడు. ఐదు సంవత్సరాలు నటనలో  శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక సినిమాలు మన వల్ల కాదులే అనుకుంటున్న  టైంలో  అనూహ్యంగా 2011లో సినీ రంగంలోకి   ఎంట్రీ దొరికింది. అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న ఊహలు గుసగుసలాడే మూవీలో లీడ్‌ రోల్‌ పోషించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకున్నాడు. తరువాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి,  2015లో జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి  మూవీల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో మెగా డాటర్‌ నీహారిక కొణిదెలకు జోడీగా ఒక మనసు, మాళవిక నాయర్  హీరోయిన్‌గా కళ్యాణ వైభోగమే సినిమాలతో ఆకట్టుకున్నాడు. 

ఇక ఆ తరువాత వరుడు కావలెను, 'లక్ష్య'  సినిమాల్లో నటించాడు.  కానీ ఛలో మూవీ  అంతటి  రేంజ్ హిట్  దక్కలేదు. వరుస  ఆఫర్లు వస్తున్నా బ్లాక్‌ బ్టస్టర్‌  హిట్‌ కొట్టడంలో మాత్రం విఫలమవుతున్నాడు. అందుకే  ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టే  తన మూవీలను ఓటీటీ బాట పట్టించాడు.  ముఖ్యంగా  ఆర్చరీ నేపథ్యంలో తీసిన ‘లక్ష్య’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. కండలు తిరిగిన బాడీతో కసరత్తు చేసినా లక్ష్య టార్గెట్‌ రీచ్‌ కాలేదు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన వరుడు కావలెను,  కేతికశర్మ హీరోయిన్‌గా నటించిన లక్ష్య మూవీలను ఓటీటీద్వారా విడుదల చేసితన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్న సంగతి తెలిసిందే. ఈ  రెండు సినిమాలు గత ఏడాది చివరలో రిలీజయ్యాయి. మరోవైపు నాగశౌర్య బర్త్ డే స్పెషల్‌గా  అప్‌ కమింగ్‌ మూవీలపై  ఇవ్వనున్న అప్‌డేట్స్‌  కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement