సాక్షి గ్రూప్ ఆధ్వర్యంలో కెరీర్ ఫెయిర్ | Group under the auspices of the witness of the Career Fair | Sakshi
Sakshi News home page

సాక్షి గ్రూప్ ఆధ్వర్యంలో కెరీర్ ఫెయిర్

Published Thu, May 15 2014 2:11 AM | Last Updated on Mon, Aug 20 2018 8:10 PM

సాక్షి గ్రూప్ ఆధ్వర్యంలో కెరీర్ ఫెయిర్ - Sakshi

సాక్షి గ్రూప్ ఆధ్వర్యంలో కెరీర్ ఫెయిర్

 హైదరాబాద్: పదో తరగతి పూర్తయింది.. ఇంటర్ పాసయ్యారు.. ఆ తర్వాత ఏమిటి..? ఏ కోర్సు ఎంచుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది..? వాటికి కావాల్సిన అర్హతలేమిటి..? భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండే రంగం ఏది..? ఇలాంటి గందరగోళంలో మునిగిపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ సూచనలు అందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో.. ‘సాక్షి కెరీర్ ఫెయిర్-2014’ మీ ముందుకు వస్తోంది. త్వరలో జరుగనున్న ఈ ఫెయిర్‌లో బుక్‌లెట్లు, డిస్‌ప్లే బోర్డులు, ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో పాటు ప్రముఖ యూనివర్సిటీలు, కళాశాలల ప్రతినిధులు తమ సూచనలు, సలహాలతో విద్యార్థుల సందేహాలను తీర్చడంతోపాటు, మార్గనిర్దేశనం చేస్తారు.

రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతగానో తోడ్పడుతున్న సాక్షి ‘భవిత’లో విస్తృత సమాచారాన్ని ఇచ్చే ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు ఈ ఫెయిర్‌లో పాల్గొని కెరీర్ ఆప్షన్లు, ఉన్నత విద్య, అర్హతలు వంటి వాటిపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి.. సూచనలు ఇస్తారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ ఫెయిర్‌లోకి ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఈ ఫెయిర్‌లో స్టాల్‌లు ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీలు, కాలేజీలు, ఇనిస్టిట్యూట్‌లు, కెరీర్ అకాడమీలను ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆహ్వానిస్తోంది. ఈ స్టాల్‌లను బుక్ చేసుకొనేందుకు 9505551099 నంబర్‌పై సంప్రదించవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement