
ఆకాశంలో సగం అన్న పోవూరి లలిత కుమారి (ఓల్గా) మాటలు నిజమవుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మహిళలు అభివృద్ధి చెందుతున్నారు. ప్రస్తుతం ఇండియా టెక్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 36 శాతం మంది స్త్రీలే ఉన్నారు. కానీ నాయకత్వ పాత్రల దగ్గరకు వచ్చేసరికి ఈ సంఖ్య తగ్గుతోంది. కార్యనిర్వాహక స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల శాతం 4 నుంచి 8 శాతం మాత్రమే.
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GenAI) ఈ సంఖ్యను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 2027 నాటికి గ్లోబల్ AI మార్కెట్ 320 నుంచి 380 బిలియన్లకు చేరుతుందని అంచనా. వృద్ధి 25 నుంచి 35 శాతానికి పెరుగుతుంది. జెన్ ఏఐ ఇందులో 33 శాతం ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని సమాచారం.
మహిళల ఎదుగుదలకు జెన్ ఏఐ గణనీయంగా సహాయపడుతుంది. వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి.. విభిన్న బృందాలలో కీలకమైన బాధ్యతలు అందిపుచ్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
భారతదేశ సాంకేతిక రంగానికి వైవిధ్యం అవసరం. ఇది పక్షపాతాలను తొలగించడం, విభిన్న నైతికతలను కలుపుకోవడం ద్వారా సమర్థవంతమైన వ్యవస్థలను నిర్ధారిస్తుంది. టెక్ పరిశ్రమలో లింగ అసమతుల్యతను సరిచేయడానికి అవకాశాలను చేజిక్కించుకోవాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'శ్రీషా జార్జ్' (Sreyssha George) అన్నారు.
నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ 'సంగీతా గుప్తా' మాట్లాడుతూ.. టెక్ పరిశ్రమలో జెన్ఏఐ ఆధిపత్యం చెలాయిస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మహిళలు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా స్వంత విజయాన్ని పెంచుకోవడమే కాకుండా ఆయా రంగాల్లో ఆధిక్యత కూడా సాధ్యమవుతుందని అన్నారు.
ఇదీ చదవండి: ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు - ఎవరీ 'రాహుల్ రాయ్'?
కొత్త టెక్నాలజీకి మద్దతు ఇచ్చే, ప్రోత్సహించే వాతావరణాలను సృష్టించడం ద్వారా GenAI స్వీకరణ సాధ్యమవుతుంది. దీనికి కంపెనీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. వృద్ధి మార్గాలను అన్వేషించడం, అధికారిక & అనధికారిక మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మార్గనిర్దేశం, నైతిక శిక్షణ అందించడం, సాధికారత, వైవిధ్యం సంస్కృతిని నిర్మించడం వంటి వాటికి జెన్ఏఐ దోహదపడుతుంది.