కొంతకాలంగా భారత్‌లో క్రీడాముఖ చిత్రం మారుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కినలూర్ (కేరళ): కొంతకాలంగా భారత్‌లో క్రీడాముఖ చిత్రం మారుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మైదానాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో పాటు చాలామంది క్రీడలను ఫుల్ టైమ్ కెరీర్‌గా మలుచుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు.
దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషకు చెందిన స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌లో ప్రపంచ స్థాయి సింథటిక్ ట్రాక్‌ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ‘ఇంతకుముందు క్రీడలను కెరీర్‌గా తీసుకునే వాతావరణ దేశంలో ఉండేది కాదు. అయితే ఇప్పుడా అభిప్రాయం మారుతోంది. ప్రతిభావంతులకు సరైన సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు.