‘ఎంట్రీ లెవల్’కు పెరగనున్న డిమాండ్!
న్యూఢిల్లీ: కొత్తగా కెరీర్ ప్రారంభించిన ఉద్యోగులకు మంచి కాలం రానుంది. వచ్చే మూడు (జూలై-సెప్టెంబర్ త్రైమాసికం) నెలల్లో ప్రారంభ స్థాయి ఉద్యోగుల డిమాండ్ అధికంగా ఉంటుందని టైమ్స్‌జాబ్స్.కామ్ తెలిపింది. ఈ డిమాండ్ ఏడాది మొత్తం కొనసాగుతుందని అంచనా వేసింది. 2011 నుంచి 0-2 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగుల డిమాండ్ వృద్ధి జూలై-సెప్టెంబర్ నెలల్లో సగటున 6 శాతంగా ఉందని పేర్కొంది. గత రెండే ళ్లలో వీరి డిమాండ్ సగటున 7 శాతం పెరిగిందని తెలిపింది. గత ఐదేళ్లలో జూలై-సెప్టెంబర్ నెలల్లో ప్రారంభ స్థాయి ఉద్యోగుల డిమాండ్ ఏమాత్రం తగ్గుదల కనిపించలేదని వివరించింది. పెద్ద పెద్ద కంపెనీలు జూలై-సెప్టెంబర్ నెలల్లోనే అధికంగా నియామకాలను చేపడతాయని తెలిపింది. ఇదే కాలంలో ఈ-కామర్స్ సంస్థలు కూడా అధిక నియామకాలను చేపట్టడానికి ఉత్సాహం చూపుతాయని పేర్కొంది. ఈ సమయంలో ప్రారంభ స్థాయి ఉద్యోగుల డిమాండ్ పెరుగుదలకు బోనస్ చెల్లింపులతోపాటు చాలా భారతీయ కంపెనీలు వాటి ఉద్యోగుల వేతనాల ఇంక్రిమెంట్ చెల్లింపులను సాధారణంగా ఏప్రిల్ నుంచి అమలుచేయడమే కారణం.