
‘పటాస్’తో బ్రేక్ వచ్చింది!
15 ఏళ్లు... 260 చిత్రాలు... 400 పాటలు.. క్లుప్తంగా ఇదీ నా కెరీర్.
‘‘15 ఏళ్లు... 260 చిత్రాలు... 400 పాటలు.. క్లుప్తంగా ఇదీ నా కెరీర్. మాస్, క్లాస్, మెలోడీ.. ఇలా అన్ని రకాల పాటలూ రాసే అవకాశం దక్కింది. ‘పటాస్’ చిత్రం కోసం రాసిన ‘టప్ప.. టప్పం.. పోరి..’ పాట నా కెరీర్‌కి మంచి బ్రేక్ అయ్యింది’’ అని గీత రచయిత తైదల బాపు చెప్పారు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ -‘‘15 ఏళ్ల క్రితం పాటలు రాయాలనే ఆకాంక్షతో ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశా.
రచయితగా నా తొలి చిత్రం ‘6 టీన్స్’. అప్పట్నుంచీ ఎన్నో విజయవంతమైన పాటలు రాశాను. ‘పటాస్’ కారణంగా ఇప్పుడు పెద్ద సినిమాలకు రాస్తున్నాను. హీరోలు గోపీచంద్, రవితేజ, సుశాంత్‌ల చిత్రాలతో పాటు మరో ఆరు చిత్రాలకు రాస్తున్నా’’ అని చెప్పారు.