
సాక్షి,న్యూఢిల్లీ: కొంత విరామం తర్వాత మళ్లీ కెరియర్ ప్రారంభించాలనుకుంటున్న టెక్నాలజీ నిపుణుల కోసం ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ’రిటర్న్‌షిప్ ప్రోగ్రాం’ ప్రారంభించింది. ఇది 12 వారాల పాటు ఉంటుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిభావంతులైన నిపుణులకు అవసరమైన శిక్షణ కల్పించడం, సలహాలివ్వడం, ఇతరత్రా అవసరమైన వనరులను సమకూర్చేందుకు ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేష్ నంబియార్ తెలిపారు. మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే ప్రొఫెషనల్స్‌లో చాలామంది మహిళలు కూడా ఉంటున్నారని, తొలి బ్యాచ్‌లో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ విధులపై ఆసక్తి ఉన్న వారికి చోటు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (సుప్రీం తీర్పు నిరాశపర్చింది : సైరస్ మిస్త్రీ )