relaunch
-
ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది!
హీరో కరిజ్మా బైక్ మళ్లీ వస్తోంది. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన పాత బైక్‌లన్నీ ఇప్పుడు సరికొత్త హంగులు, ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి. గత నెలలో బజాజ్ తన సక్సెస్ ఫుల్ బైక్ పల్సర్ ని మళ్లీ మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హీరో మోటోకార్ప్ కూడా ఒకప్పుడు బాగా ఆదరణ పొందిన కరిజ్మా బైక్‌ను తిరిగి ప్రవేశ పెట్టనుంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్.. భారత్‌లో సమావేశాలన్నీ రద్దు! హీరో కరిజ్మా బైక్ దాని స్పోర్టీ లుక్స్, పెర్ఫార్మెన్స్తో లాంచ్ అయిన వెంటనే భారత మార్కెట్లో బాగా పాపులర్ అయింది. ఆ సమయంలో హీరో కరిజ్మా అత్యంత ఆకర్షణీయమైన మోటార్‌సైకిళ్లలో ఒకటి. హీరో కరిజ్మా ఆర్, హీరో కరిజ్మా ZMR విక్రయాలు అప్పట్లో భారీగా జరిగాయి. ఆ తర్వాత ఆ బైక్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపేసింది. చాలా బైక్ తయారీ సంస్థలు ఇటీవల పాత మోడళ్లను పునరుద్ధరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరిజ్మా బైక్‌ను కొత్త హంగులతో తిరిగి తీసుకొచ్చేందుకు హీరో సంస్థ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో కరిజ్మా 2023 కొత్త డిజైన్, శక్తివంతమైన ఇంజన్ ప్రస్తుతం తయారీలో ఉన్నట్లు రష్లేన్ నివేదించింది. కరిజ్మా 2023 టెస్ట్ మ్యూల్ చిత్రాలను కూడా షేర్ చేసింది. అత్యంత ఆదరణ పొందిన ఏ బైక్ అయినా సరే ఆ కంపెనీకి మంచి గుర్తింపుని తీసుకువస్తుంది. అలానే ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో హీరో మోటోకార్ప్ తీసుకువచ్చిన కరిజ్మా బైక్ చాలా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఈ బైక్ పై వెళ్తున్న సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. అంత ఆదరణ పొందిన ఈ మోడల్ బైక్ ని సరికొత్త లుక్ రీలాంచ్ చేయనుంది హీరోమోటోకార్ప్. 2014లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో OG కరిజ్మా R, కరిజ్మా ZMR సిరీస్ బైక్స్ ని హీరో తీసుకువచ్చింది. ఇప్పుడిదే కొత్త లిక్విడ్ కూల్డ్ 210సీసీ ఇంజన్‌తో వస్తోంది. ఈ సెగ్మెంట్ లో పల్సర్ వంటి అధునాతన బైక్స్‌కి ఈ సరికొత్త కరిజ్మా గట్టి పోటీ ఇవ్వనుంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడలన్నీ EBR (ఎరిక్ బుల్ రేసింగ్)తో తయారు చేస్తారు. కరిజ్మా మోడల్ని నిలిపివేసిన తర్వాత హీరో ఎక్స్ట్రీమ్ (Xtreme 200S) బైక్ ని లాంచ్ చేసింది. అయితే కరిజ్మా స్థానంలో తీసుకువచ్చిన ఈ బైక్ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో వాటిని కూడా హీరో సంస్థ నిలిపివేసింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
ట్విటర్ బ్లూటిక్ ఒక్కటే కాదు! ఎవరెవరికి ఏ కలర్ అంటే?
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్త బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజును రీలాంచ్ చేయనున్నారు. ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీస్ ట్విటర్ బ్లూ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని మస్క్ శుక్రవారం తెలిపారు. అయితే వివిధ వర్గాలకు వేరు వేరు కలర్స్ టిక్ మార్క్‌ను ప్రకటించడం గమనార్హం. కంపెనీలకు గోల్డ్ కలర్ మార్క్, ప్రభుత్వానికి గ్రే కలర్, సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు బ్లూ కలర్ చెక్ మార్క్ కేటాయిస్తున్నట్టు మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. వెరిఫికేషన్ ఫీజును తాత్కాలికంగా డిసెంబర్ 2న ప్రారంభించ బోతున్నట్టు తెలిపారు. దీనిపై ట్విటర్ యూజర్ ట్వీట్‌కు స్పందిస్తూ బ్లూటిక్ సర్వీసును పునః ప్రారంభించడంలో ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరిన మస్క్ ఈ వివరాలు అందించారు. అయితే వీటికి వేర్వేరు ఫీజు నిర్ణయిస్తారా, ఒకటే ఉంటుందా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. (లంబోర్గినీ సూపర్ ఎస్యూవీ వచ్చేసింది: కళ్లు చెదిరేలా!) మూడు రకాల ఖాతాల మధ్య తేడాను గుర్తించడానికే వివిధ రంగుల చెక్ మార్కులను ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. దీంతోపాటు నకిలీ ఖాతాలకు చెప్పేలా ఆయా ఖాతాలను మాన్యువల్‌గా ధృవీకరించనున్నట్టు కూడా తెలిపారు. బాధాకరమే అయినా తప్పనిసరి నిర్ణయం అంటూ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అలాగే బ్లూటిక్ మార్క్ గతంలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పాత్రికేయులు,ఇతర ప్రజా ప్రముఖుల ధృవీకరించబడిన ఖాతాల కోసం రిజర్వ్ చేసినట్టు గుర్తు చేశారు. (సినీ నటి కాజల్ అగర్వాల్ కొత్త అవతార్: అదేంటో తెలుసా?) కాగా ట్విటర్ టేకోవర్ తరువాత మస్క్ తీసుకున్న పలు సంచలన నిర్ణయాల్లో బ్లూటిక్ వెరి ఫికేషన్ ఫీజు కూడా ఒకటి. తొలుత నెలకు 8 డాలర్లు బ్లూ చెక్ సబ్స్క్రిప్షన్ సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి మస్క్, నకిలీ ఖాతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడంతో దీన్ని ఇప్పటికి రెండు సార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. Sorry for the delay, we’re tentatively launching Verified on Friday next week. Gold check for companies, grey check for government, blue for individuals (celebrity or not) and all verified accounts will be manually authenticated before check activates. Painful, but necessary. — Elon Musk (@elonmusk) November 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బ్లూటిక్ బాదుడు పక్కా, ముహూర్తం ఫిక్స్: మస్క్ క్లారిటీ
న్యూఢిల్లీ: ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ బాదుడుపై ట్విటర్ కొత్తబాస్, బిలీయనీర్ ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరునుంచి (నవంబరు 29) బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు మొదలవుతుందని మస్క్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) తాత్కాలికంగా నిలిపివేసిన బ్లూ చెక్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ నవంబర్ 29న పునఃప్రారంభిస్తున్నట్టు మస్క్ మంగళవారం ట్వీట్ చేశారు. ఇది మాత్రం పక్కా అంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాదు తమ సర్వీసు నిబంధనలకు అనుగుణంగా ట్విటర్ ధృవీకరించని ఖాతాలు పేరు మార్చుకుంటే బ్లూటిక్ కోల్పోతారని కూడా తెలిపారు. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్ మస్క్ నెలకు 8 డాలర్ల బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ప్రకటించారు. అయితే నకిలీ ఖాతాల బెడద కారణంగా బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు అమలు నిర్ణయాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. Punting relaunch of Blue Verified to November 29th to make sure that it is rock solid — Elon Musk (@elonmusk) November 15, 2022 -
ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు
సాక్షి,న్యూఢిల్లీ: కొంత విరామం తర్వాత మళ్లీ కెరియర్ ప్రారంభించాలనుకుంటున్న టెక్నాలజీ నిపుణుల కోసం ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ’రిటర్న్‌షిప్ ప్రోగ్రాం’ ప్రారంభించింది. ఇది 12 వారాల పాటు ఉంటుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిభావంతులైన నిపుణులకు అవసరమైన శిక్షణ కల్పించడం, సలహాలివ్వడం, ఇతరత్రా అవసరమైన వనరులను సమకూర్చేందుకు ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేష్ నంబియార్ తెలిపారు. మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే ప్రొఫెషనల్స్‌లో చాలామంది మహిళలు కూడా ఉంటున్నారని, తొలి బ్యాచ్‌లో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ విధులపై ఆసక్తి ఉన్న వారికి చోటు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (సుప్రీం తీర్పు నిరాశపర్చింది : సైరస్ మిస్త్రీ ) -
శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ
ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై ఎట్టకేలకు తీపి కబురు అందింది. శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఫోల్డబుల్(మడత) స్మార్ట్‌ఫోన్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో త్వరలోనే దీన్ని తిరిగి ప్రారంభించనుంది. తుది పరీక్షల అనంతరం 2019 సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన మార్కెట్లలో ఆవిష్కరించనున్నామని దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ధృవీకరించింది. గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తి మార్పులతో అన్ని రకాల కఠినమైన పరీక్షలను దాటిందని తెలిపింది. స్మార్ట్‌ఫోన్ డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లలో మార్పులు, ఇతర కఠినమైన పరీక్షలను పూర్తి చేయడానికి సమయం పట్టిందని శాంసంగ్ పేర్కొంది. ప్రధానంగా అరచేతిలో సులువుగా ఇమిడిపోయేలా రూపొందించడంతోపాటు ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ ప్లే కింద అదనంగా మెటల్ లేయర్స్‌ని అమర్చింది. ఇతర భద్రతా పరమైన మార్పులకు తోడు మరిన్ని యాప్స్‌ను ఆప్టిమైజ్ చేసింది. విడుదల సందర్భంగా లభ్యత, ఇతర కీలక ఫీచర్లను వెల్లడిస్తామని శాంసంగ్ వెల్లడించింది. ముందుగా ఇండియా, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, యూకేలలో లాంచ్ చేయనుందని సమాచారం. -
వాట్సాప్‌కు షాక్ : న్యూ లుక్‌తో కింభో రీలాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు గుండెల్లో గుబులు పుట్టించేలా కింభో మళ్లీ వార్తల్లోకొచ్చేసింది. ఈ నెలలోనే ఈ కింభో యాప్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ఖాతాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. కొత్త, ఆధునిక ఫీచర్లు కింభో యాప్ లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్ చేశారు. కింభో యాప్‌ను ఆగష్టు 27, 2018 న ప్రారంభించనున్నామని బాలకృష్ణ ట్వీట్ చేశారు. ఈ యాప్ ట్రయిల్ వెర్షన్‌ను ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాదు లాంచింగ్‌కు ముందే యూజర్లు తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు. కాగా యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ వాట్సాప్‌కు పోటీగా కింభో పేరిట కొత్త స్వదేశీ మెసేజింగ్ తీసుకురానున్నట్టు ఈ ఏడాది మే 31న ప్రకటించారు. అచ్చం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో కింభో యాప్‌ను రామ్‌దేవ్ విడుదల చేశారని పతంజలి గ్రూప్ ప్రతినిధి ఎస్కే తిజారావాలా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సంస్కృతంలో కింభో అంటే ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? అనే అర్థాలు వస్తాయని ఈ సందర్భంగా తిజారావాలా తెలిపారు. అయితే సెక్యూరిటీ కారణాల రీత్యా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కింభో అదృశ్యమైన సంగతి తెలిసిందే. T-1 स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं आप के विश्वास के लिए पतंजलि परिवार आपके प्रति कृतज्ञ है,आप स्वतंत्रता दिवस के पावन उत्सव के साथ डिजिटल आजादी का जश्न "किम्भो:" के नये और एडवांस फीचर्स के साथ मनाइये| किम्भो: ऐैप में कुछ सूक्ष्म न्यूनताएँ हो सकती है, उनके continues in T-2 pic.twitter.com/bWLk6x6x3Q — Acharya Balkrishna (@Ach_Balkrishna) August 15, 2018 -
డెస్క్ టాప్ సేవల్లోకి మింత్ర రీ ఎంట్రీ
బెంగళూరు : ఫ్యాషన్ ఈ-కామర్స్ రిటైలర్ మింత్ర, తన డెస్క్ టాప్ సైట్ సేవలను జూన్ 1నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. వ్యాపారమంతా అరచేతిలోనే అన్న మాదిరిగా మారిన తర్వాత మింత్ర తన డెస్క్ టాప్ సేవలను రద్దుచేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం వరకూ అమ్మకాలు డెస్క్ టాప్ వెబ్ సైట్ ద్వారానే జరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం మొబైల్ ద్వారానే సేవలు అందించే వ్యూహాన్ని కాకుండా, డెస్క్ టాప్ ద్వారా కూడా తన సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. డెస్క్ టాప్ సేవలను పునరుద్ధరించి, ఈ వెబ్ సైట్ కోల్పోయిన కస్టమర్లను మళ్లీ వెనక్కి తెచ్చుకుంటామని, బిజినెస్ ను పెంచుకుంటామని పేర్కొంది. కస్టమర్ల అవసరాలను వినయపూర్వకంగా వినడం, తెలుసుకోవడం తమ బాధ్యత అని మింత్ర సీఈవో అనంత్ నారాయణన్ తెలిపారు. కస్టమర్ల అవసరాల మేరకు జూన్ 1నుంచి ఈ సేవలను పునఃప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. డెస్క్ టాప్ సేవలు కస్టమర్లను ఆకట్టుకోవడంలో మింత్ర సంస్థకు ఎంతో సహాయపడుతుందని, అదనంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా నష్టాలను అధిగమించగలుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత ఆర్తిక సంవత్సరంలో కంపెనీ నిర్దేశించుకున్న 100 కోట్ల డాలర్ల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని, డెస్క్ టాప్ సేవలతో ఈ మైలురాయిని 2017 మార్చి వరకూ చేరుకుంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కేవలం డెస్క్ టాప్ వెర్షన్ తోనే కాకుండా వేరే డామినెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకుని తన సేవలను పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రపంచమే అరచేతిలోకి వచ్చాక, కొనాలనుకున్నది మొబైల్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు క్షణాల్లో మన ముంగిట్లో ఉంటుంది. దీంతో చాలా ఈ-కామర్స్ సంస్థలు డెస్క్ టాప్ సేవలకు స్వస్తి పలికి, మొబైల్ యాప్ ద్వారాత సేవలందిస్తున్నాయి.