ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై ఎట్టకేలకు తీపి కబురు అందింది. శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఫోల్డబుల్(మడత) స్మార్ట్‌ఫోన్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో త్వరలోనే దీన్ని తిరిగి ప్రారంభించనుంది. తుది పరీక్షల అనంతరం 2019 సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన మార్కెట్లలో ఆవిష్కరించనున్నామని దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ధృవీకరించింది.
గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తి మార్పులతో అన్ని రకాల కఠినమైన పరీక్షలను దాటిందని తెలిపింది. స్మార్ట్‌ఫోన్ డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లలో మార్పులు, ఇతర కఠినమైన పరీక్షలను పూర్తి చేయడానికి సమయం పట్టిందని శాంసంగ్ పేర్కొంది. ప్రధానంగా అరచేతిలో సులువుగా ఇమిడిపోయేలా రూపొందించడంతోపాటు ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ ప్లే కింద అదనంగా మెటల్ లేయర్స్‌ని అమర్చింది. ఇతర భద్రతా పరమైన మార్పులకు తోడు మరిన్ని యాప్స్‌ను ఆప్టిమైజ్ చేసింది. విడుదల సందర్భంగా లభ్యత, ఇతర కీలక ఫీచర్లను వెల్లడిస్తామని శాంసంగ్ వెల్లడించింది. ముందుగా ఇండియా, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, యూకేలలో లాంచ్ చేయనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment