Ram Charan Interesting Comments On Samantha - Sakshi
Sakshi News home page

Ram Charan Samantha: సమంతపై రామ్‌ చరణ్‌ ఆసక్తికర కామెంట్‌.. మూడు ముక్కల్లో

Published Mon, Dec 27 2021 6:31 PM | Last Updated on Mon, Dec 27 2021 7:27 PM

Ram Charan Comments On Samantha About Her Career - Sakshi

టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్‌గా పేరొందిన సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అసలు విడాకులు ఎందుకు తీసుకుందని ఇంకా చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. అయితే ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. వీరి మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ అక్టోబర్‌ 2న తాము భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అయితే అప్పటి నుంచి సమంతనే టార్గెట్‌ చేస్తూ కొందరు విపరీతంగా ట్రోల్‌ చేశారు. దీంతో విడాకుల తర్వాత సమంత కెరీర్‌ క్లోజ్‌ అవుతుందని అందరు ఊహించారు. ఆ ఊహలను పటాపంచలు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో వేగంగా ముందుకు దూసుకుపోతోంది సామ్‌. హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలతో పాటు పుష్పలో స్పెషల్‌ సాంగ్‌తో సమంత కెరీర్‌ తారాజువ్వలా పైకిపోతుంది. 

ఈ క్రమంలో సమంత గురించి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఆసక్తిర వాఖ్యలు చేశాడు. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ రాజమౌళిల భారీ మల్టీ స్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం మీడియా సంస్థలకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్బంగా సమంత గురించి చెప్పమని యాంకర్‌ రామ్‌ చరణ్‌ను ప్రశ్నించాడు. దానికి సమంత 'కమ్ బ్యాక్‌.. బిగ్గర్‌.. స్ట్రాంగర్‌..' అండూ మూడు ముక్కల్లో చెప్పాడు రామ్‌ చరణ్‌. అయితే ఈ మాటలు విన్న సామ్‌ తెగ సంతోషపడినట్లు తెలుస్తోంది. దీనికి  సంబంధించిన వీడియోను మూడు లవ్‌ సింబల్స్‌తో ట్విటర్‌లో షేర్‌ చేసింది. 
 

ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ భార్యపై సమంత 'హాట్‌' కామెంట్స్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement