
చక్కనమ్మ చిక్కినా..!
కెరీర్ బండి సక్సెస్ బాటలో వేగంగా సాగిపోవాలంటే? ఈ ప్రశ్నకు జవాబుగా ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి.
గాసిప్
కెరీర్ బండి సక్సెస్ బాటలో వేగంగా సాగిపోవాలంటే? ఈ ప్రశ్నకు జవాబుగా ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి.కొందరు తమ ప్రతిభను నమ్ముకుంటారు. కొందరు వాస్తును నమ్ముకుంటారు. కొందరు విధిరాతను నమ్ముకుంటారు. పరిణితి చోప్రా మాత్రం ఒక జ్యోతిష్యుడి మాటను నమ్మిందట.
‘‘నువ్వు సన్నబడితే చాలు... గొప్ప అవకాశాలు వస్తాయి’’ అని ఆ జ్యోతిష్యుడు చెప్పాడట. ఇక అప్పటి నుంచి సన్నబడడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది పరిణితి. తాజాగా ‘జీరో క్లబ్’లో చేరడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంది. ‘‘బరువు ఎప్పుడూ నాకో సమస్య కాదు’’ అని గతంలో చెప్పిన పరిణితి ఇప్పుడు బరువు తగ్గించుకోవడం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు... మరి ఆ అందం ఈ ముద్దుగుమ్మ కెరీర్‌కు కలిసొస్తుందా లేదా? అనేది వేచి చూడాలి.