
టాలీవుడ్ హీరోయిన్ షీలా కౌర్ తెలుగువారికి సుపరిచితమైన పేరు.

జూనియర్ ఎన్టీఆర్ సరసన అదుర్స్, అల్లు అర్జున్ సరసన పరుగు చిత్రాలలో మెప్పించింది.

సీతాకోక చిలుక మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హలో ప్రేమిస్తారా, మస్కా, పరమవీర చక్ర లాంటి చిత్రాల్లో కనిపించింది.

అయితే చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో మెరిసింది.

ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.

2020లో సంతోశ్ రెడ్డిని పెళ్లాడిన ముద్దుగుమ్మ చిత్రసీమకు గుడ్ బెై చెప్పేసింది.

చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.

అవీ కాస్తా నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

అప్పట్లో స్లిమ్‌గా ఉన్న బ్యూటీ ఇప్పుడేంటి ఇలా మారిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.












