‘ఆఖరి సచ్‌’ కథ విన్నప్పుడు నేను షాక్‌ అయ్యాను | I played the role of a police officer for first time in my career | Sakshi
Sakshi News home page

‘ఆఖరి సచ్‌’ కథ విన్నప్పుడు నేను షాక్‌ అయ్యాను

Published Mon, Aug 14 2023 12:50 AM | Last Updated on Mon, Aug 14 2023 12:50 AM

I played the role of a police officer for first time in my career - Sakshi

తమన్నా నటించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘ఆఖరి సచ్‌’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్‌’ రూపొందింది. తమన్నా, అభిషేక్‌ బెనర్జీ, శివిన్‌ నారంగ్, రాహుల్‌ బగ్గా లీడ్‌ రోల్స్‌లో రాబీ గ్రేవాల్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్‌ పొలీసాఫీసర్‌ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్‌’ కథ విన్నప్పుడు నేను షాక్‌ అయ్యాను. ఈ సిరీస్‌ నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే నా కెరీర్‌లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్‌ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్‌జోన్‌ దాటి చాలా ఎమోషన్స్‌తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement