
అధ్యయనం తప్పనిసరి
డ్యూటిప్స్
ఉద్యోగాలు చేసే మహిళలు కెరీర్‌లో ఎదగాలంటే, తొలుత తమ శక్తి సామర్థ్యాలను, లోపాలను నిష్పాక్షికంగా అంచనా వేసుకోవాలి.పనితీరులో మెరుగుదల కోసం శక్తి సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. పనితీరుకు ఇబ్బందికరంగా ఉంటున్న లోపాలను ఇతరులు గుర్తించకముందే దిద్దుకునే ప్రయత్నాలు చేయాలి.
కెరీర్‌లో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకోవాలి. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి.లక్ష్యసాధనకు ఆటంకం కల్పించే అలవాట్లు ఏవైనా ఉంటే, వాటిని వదిలించుకోవాలి. అవసరమైతే విద్యార్హతలను మెరుగుపరచుకోవాలి. అధ్యయనానికి తప్పనిసరిగా సమయాన్ని కేటాయించాలి.