
కేటీఆర్.. ఆస్ట్రేలియాకు రండి
ఆ దేశ విదేశాంగ మంత్రి ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : తమ దేశంలో పర్యటిం చాలని ఐటీ మంత్రి కె.తారకరామారావుకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. డిసెంబర్ 5న మెల్‌బోర్న్‌లో జరిగే ఇండియా లీడర్‌షిప్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పేర్కొ న్నారు. ఈ సమావేశానికి ఇరు దేశాల్లోని 50 మంది ప్రముఖ వ్యాపార వేత్తలు, ప్రభు త్వాధినేతలు, మేధావులు, పాలసీ మేకర్లను మాత్రమే ఆహ్వానించగా, అందులో కేటీఆర్ ఒకరు. ఇరు దేశాల్లోని ప్రభుత్వాల పనితీరు, ఆర్థికపరమైన అంశాలు, వ్యాపార రంగా ల్లోని అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలసీలు, వ్యాపార అవకాశాలపై ప్రసంగిం చాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటీఆర్‌ను కోరింది. తెలంగాణలోని ఐటీ రంగం, పారిశ్రామిక రంగంలో పెట్టుబ డులు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో భాగ స్వాములయ్యేందుకు ఆస్ట్రేలియాలోని వ్యాపా ర, వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొంది. ఈ సమా వేశాల సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానితో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆస్ట్రేలియా హైకమిషన్ కేటీఆర్‌కు ఈమెరుుల్ సమా చారం పంపింది.
దీంతోపాటు ఆస్ట్రేలియా కంపెనీల సీఈవోలు, మైనింగ్ పరిశ్రమలు, ఆ దేశ ఐటీ శాఖ మంత్రులతో ప్రత్యేక సమావేశం ఉంటుందని, మెల్‌బోర్న్ బయో మెడికల్ పార్క్ పర్యటన కూడా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలోని తెలుగు కమ్యూనిటీతో కలిసే అవకాశం కల్పిస్తామని, ప్రవాస తెలంగాణ వ్యవహారాల మంత్రిగా ఇతర విషయాలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.