![MLA Pilot Rohit Reddy Sensational Comments On Raghunandan Rao - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/19/ROHIT-REDDY.jpg.webp?itok=9zsOPely)
దూద్‌బౌలి: విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్‌రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివాసం ఉంటున్నారో, రూ.వందల కోట్లను ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ రూ.వందల కోట్లు పఠాన్‌చెరులో పరిశ్రమలనుంచి వసూలు చేసిన సొమ్ముకాదా అని ప్రశ్నించారు.
ఇప్పటికే శనివారం భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించి పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించిన రోహిత్‌రెడ్డి ఆదివారం మరోసారి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బండి సంజయ్‌కు సవాలు విసిరితే ఆయన స్పందించకుండా ఎమ్మెల్యే రఘునందన్‌రావు సీన్‌లోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సెప్టెంబర్‌కు ముందు సింహయాజులును కలిసినట్లు నిరూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని రోహిత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈడీ నోటీసుల విషయంలో మా న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment