బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలకు ఇంటెలిజెన్స్ సెక్యురిటీ విభాగం అదనపు భద్రత కల్పించింది. నియోజకవర్గాలలో తిరుగలేకపోతున్నామని భద్రత పెంచాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరడంతో 4 ప్లస్ 4 గన్‌మెన్లను కేటాయించింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వీరిద్దరూ అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్‌రెడ్డి పార్టీ మారిన తర్వాత ఈ నెల 6న టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనమైంది. తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరడంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. (చదవండి: శత్రువు వచ్చి అడిగినా సాయం చేశా: ఎమ్మెల్యే బీరం)
Comments
Please login to add a commentAdd a comment