harshavardhan reddy
-
బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిపై నార్సింగిలో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కోకాపేట ల్యాండ్స్.. వివరాల ప్రకారం.. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. అక్రమంగా తరలింపు.. అయితే, గోల్డ్‌ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు అని తెలిపారు. దీంతో, తాము పోలీసులను ఆశ్రయించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటుగా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం -
పేదరికాన్ని జయించి.. ఆంధ్రజట్టు కెప్టెన్‌గా! విధికి కన్నుకుట్టిందేమో..
బాపట్ల: చిరుతలా దూసుకుపోతూ.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే ఆట అతని సొంతం. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఏదైనా తనదైన శైలితో హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తాచాటేవాడు. జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని అప్రతిహత ప్రస్థానం చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. అనారోగ్యం రూపంలో కబళించింది. ఆట గుండె ఆగినట్టు క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. కన్నీటితో క్రీడావీరుడు హర్షవర్ధన్‌కు కడసారి వీడ్కోలు పలికింది. పేదరికాన్ని జయించి.. కోటపాడు గ్రామానికి చెందిన ఆవుల హర్షవర్ధన్ రెడ్డి (23) హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు. జాతీయస్థాయిలో రాణిస్తూ అంతర్జాతీయ శిక్షణకు ఎంపికయ్యాడు. తన కలలు త్వరలో తీరతాయని ఆనందపడిపోయాడు. అంతలోనే విధి అతనితో వింత ఆట ఆడింది. అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించాడు. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. హర్షవర్ధన్‌ది అతి నీరు పేద కుటుంబం. ఐదేళ్ల క్రితం అతడి తండ్రి శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. కోటపాడు గ్రామంలో ఉండటానికి ఇల్లు కూడా లేదు, తల్లి శ్రీదేవి కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివించింది. హర్షవర్ధన్ పేదరికాన్ని జయించి హ్యాండ్‌బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచాడు. భారత్ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. మంచి ఉద్యోగం సాధించి తన తల్లిని మంచిగా చూసుకోవాలని తోటి క్రీడాకారులు, స్నేహితులకు చెబుతుండేవాడు. ఆ కలలు నెరవేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నిత్యం చలాకీగా ఉరుకుతూ ఉండే కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లి శ్రీదేవి గుండెలవిసేలా రోదించింది. తోటి క్రీడాకారులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. హ్యాండ్‌బాల్‌పై అమితమైన ప్రేమ.. హర్షవర్ధన్ రెడ్డి చిన్ననాటి నుంచి క్రీడలపై ఎంతో ఆసక్తి కనబరిచేవాడు. 9వ తరగతి నుంచి తను హ్యాండ్‌బాల్ ఆడటం ప్రారంభించాడు. ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని మరింత ప్రోత్సహించారు. ఇంటర్మీడియెట్ నుంచి కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో చేరాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో హ్యాండ్‌బాల్‌లో శిక్షణ పొందాడు. ఎన్నో పతకాలు సాధించాడు. ఆంధ్రజట్టుకు కెప్టెన్‌గా.. ఇప్పటికి రెండుసార్లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించాడు. హ్యాండ్లోబాల్లో ఉన్న 16 మంది క్రీడాకారుల్లో 4వ వాడిగా మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ హ్యాండ్ బాల్ శిక్షణకు ఆంధ్రజట్టు నుంచి ఎంపికై నట్లు తోటి క్రీడాకారులు చెబుతున్నారు. కుక్క కాటే.. ప్రాణం తీసిందా.. ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ 15 రోజుల క్రితం ఐదో సెమిస్టర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. మూడు రోజుల క్రితం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వణికిపోతూ ఉండడంతో తల్లి, స్థానికులు స్థానిక ఆర్ఎంపీ వద్ద చూపించి అక్కడి నుంచి మేదరమెట్ల వైద్యశాలకు తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మరణించాడు. మూడు నెలల క్రితం గ్రామంలో హర్షవర్ధన్‌ను కుక్క కరిచింది. ఇంజక్షన్ చేసుకొని కళాశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స తీసుకోలేదు. దీనివల్ల ర్యాబిస్ వ్యాధితో చనిపోయి ఉంటాడని వైద్యులు చెప్పారు. జాతీయ స్థాయిలో రాణింపు.. 2023–24 సంవత్సరానికి రెండు నెలల క్రితం తమిళనాడులోని సేలంలో సౌత్ జోన్ జూనియర్ నేషనల్ క్రీడల్లో పాల్గొన్నాడు. 2022 మార్చిలో జూనియర్ నేషనల్ విజయవాడలో ఆడి మంచి ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు. 2021–22లో మధ్యప్రదేశ్‌లో సీనియర్ నేషనల్ గేమ్స్‌లో ఆడాడు. 2023–24 రాయలసీమ యూనివర్సిటీ గేమ్‌లో మొదటి స్థానం సాధించాడు. 2021–22 ఢిల్లీలో జరిగిన జూనియర్ నేషనల్ హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌లో ఆడాడు. 2019 అండర్–17 స్కూల్ గేమ్స్‌లో కర్నాటకలో ఆడాడు. -
ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గం జనాలకు ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారట. అందుకే తమ పీఏలు, అనుచరులతో పనులు చక్కబెడుతున్నారని టాక్. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫాంహౌజ్‌కే పరిమితం.? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో గులాబీ పార్టీకే 13 దక్కాయి. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన భీరం హర్షవర్థన్‌రెడ్డి కూడా తర్వాతి కాలంలో కారెక్కి హాయిగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హర్షవర్థన్‌రెడ్డితో పాటు.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చిక్కుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు ఆ ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాతి నుంచి తమ నియోజకవర్గాలకు రావటం లేదు. దీంతో వారు ప్రజలకు ముఖం చాటేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఈ ఇద్దరు మాత్రమే ఎందుకు ఆ వ్యవహారంలో తలదూర్చారనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతుంటే వారిద్దరు మాత్రమే ప్రగతిభవన్‌ను వదలటం లేదు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఇంటెలిజెన్స్ సూచన మేరకే నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని ఎమ్మెల్యేలు చెబుతుండటం విశేషం. ప్రభుత్వం కూడా వీరికి భద్రత పెంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు సమకూర్చింది. ఆయినా వారు నియోజకవర్గాల్లోకి రావడానికి భయపడుతున్నారు. గోడకెక్కిన గువ్వల అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు అతికించటం కలకలం రేపుతుంది. గతంలో ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లలో ఫోటోలు కూడా పెట్టారు. జిల్లా పరిషత్ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డిపై దాడి.. వికలాంగుడిపై దాడి.. గిరిజన సర్పంచ్‌పై దాడి.. ఫారెస్టు ఆఫీసర్‌పై దాడి.. సీఎం పర్యటనలో నన్నే ఆపుతావారా అంటు సీఐపై చిందులు వేశారంటూ పోస్టర్లలో ప్రచురించారు. వీటిని స్దానికులు ఆశ్చర్యంగా చూస్తుండటం ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే పోస్టర్ల వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: (హీటెక్కిన తెలంగాణ పొలిటికల్ సమీకరణాలు.. బీజేపీకి లాభమెంత?) తమ నేతను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. గతంలో కూడ పలు సందర్భాల్లో గువ్వల బాలరాజు తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత ఎమ్మెల్యేపై తిట్లపురాణంతో సాగుతున్న ఫోన్ సంభాషణలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని వందకోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యేను తరమికొట్టాలని.. అందుకు అన్నివర్గాల వారు సహకరించాలని..ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేకు సంకటంగా మారుతున్నాయి. క్షేత్ర స్థాయి కష్టాలు కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్‌రెడ్డి ఇప్పటికే పార్టీ మారి ఆనేక విమర్శలు ఎదుర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారిన నాయకుడు డబ్బు కోసం ఇప్పుడు కూడా మారడని గ్యారెంటీ ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో సఖ్యత లేని కారణంగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. దిద్దుబాటు చర్యలకు అధిష్టానం పెద్దగా చొరవ చూపకపోవటంతోపాటు.. ఫామ్ హౌజ్ వ్యవహారంతో పార్టీకి నష్టం కలుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే కొల్లాపూర్‌కు రావాలని ప్రయత్నించినా స్దానికంగా ఉండే తన అనుచరుల సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడ ప్రతిపక్షాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అదునుగా ఎమ్మెల్యే వైరివర్గం నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని మరింత తీవ్రం చేసింది. ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లో తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపధ్యంలో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల బాటపడతారో లేక ఫాంహౌస్ కేసు తెగేంతవరకు దూరంగా ఉంటారో చూడాలి. -
ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురూ చేసిన ఫోన్ కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలను నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర? హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహయాజులు స్వామి, రామచంద్ర భారతి, నంద కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో ఉన్న అతడి ఫామ్ హౌస్‌లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. వేచి చూసి దాడి చేశారు..: ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రమే ఫామ్ హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్‌తో పాటు ఆరుచోట్ల అత్యాధునికమైన రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారు వేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా.. సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆపై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు!: సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద ఆ ముగ్గురూ, సోఫాల్లో ఎమ్మెల్యేలు నలుగురూ కూర్చున్నారు. ఈ మీటింగ్ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అలాగే ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న ఓ కేంద్ర పెద్దతో మాట్లాడించాలని ప్రయతి్నంచారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది. 3 రోజులు..70 మంది పోలీసులు: ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది 3 రోజులు పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 84 సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి. అన్నమయ్య జిల్లా చిన్న మండ్యం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకొని, తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. అది లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. ఇతడికి తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు తెచ్చింది నందూయేనా..?: రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్‌లోని ఓ ఆలయ పూజారి కాగా.. కర్ణాటకకు చెందిన నందకుమార్ నగరానికి వలసవచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో సదరన్ స్పైస్ పేరుతో ఓ రెస్టారెంట్ నడిపాడు. ఫిల్మీ జంక్షన్ అనే రెస్టారెంట్ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముఖుడితో విభేదాలు తలెత్తాయి. ఆపై అవినాష్ అనే వ్యక్తితో కలిసి మాణిక్‌చంద్ పాన్ మసాలా వ్యాపారం చేశాడు. తర్వాత మాణిక్ చంద్ బ్రాండ్‌ను తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోనూ సౌత్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. వీటితో పాటు నగరంలోని అనేక పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని, హవాలా ఆపరేటర్ అని కూడా తెలిసింది. బుధవారం నందు పుట్టిన రోజు కావడంతో ఈ ఫామ్ హౌస్‌లో పార్టీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్ కావడంతో డబ్బు తీసుకువచ్చింది నందూయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా నిందితులు ముగ్గుర్నీ పోలీసులు ఫామ్‌హౌస్ నుంచి తరలించారు. -
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర?
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా ఓ జాతీయ పార్టీ అండదండలతో వ్యూహాత్మక బేరసారాలు జరిగినట్టు ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ టీఆర్ఎస్ ఆరోపించడం.. ఆ నలుగురు హార్డ్‌కోర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తామేం చేసుకుంటామంటూ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొట్టిపారేయడం చర్చనీయాంశంగా మారాయి. అజీజ్ నగర్ ఫామ్‌హౌజ్ వేదికగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), రేగ కాంతారావు (పినపాక)లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే భారీ ఎత్తున డబ్బులిస్తామని.. పదవులు, కాంట్రాక్టులు అప్పగిస్తామని ఆ ముగ్గురు ఎర వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ ప్రలోభాలకు వేదిక అయిన రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పరిధిలో ఉన్న పీవీఆర్ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసి.. ఫరీదాబాద్‌కు చెందిన రాంచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, కేంద్ర మంత్రికి సన్నిహితుడని చెప్తున్న నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ ప్రలోభాలకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే తాము దాడి చేశామన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్‌హౌజ్‌కు చేరుకుని.. ముగ్గురు వ్యక్తులతో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపినట్టు సమాచారం. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) దాడులు జరిగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాదీనం చేసుకున్నట్టు ప్రచారం జరిగినా.. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.వంద కోట్లతోపాటు పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల్లో గువ్వల బాలరాజు మినహా మిగతా ముగ్గురు కాంగ్రెస్ తరఫున గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరినవారే. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో..: స్టీఫెన్ రవీంద్ర దాడి అనంతరం ఫామ్‌హౌజ్ వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ‘‘తమను కొందరు ప్రలోభపెడుతున్నారని ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు దాడులు చేశాం. ఫరీదాబాద్ పీఠాధిపతి ఈ మొత్తం వ్యవహారంలో కీలక మంతనాలు సాగించారు. డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టినట్టు ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రలోభాలకు ప్రయతి్నంచారు, ఇతర అంశాలు ఏమిటన్నది దర్యాప్తు చేస్తాం. డబ్బు ఇచ్చారా? ఇస్తే ఎంత ఇచ్చారు? ఎక్కడి నుంచి వచి్చంది? ఎవరు తీసుకువచ్చారనే వివరాలు సేకరిస్తాం..’’ అని తెలిపారు. ఆ ముగ్గురూ ఎవరు? ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ దేవాలయంలో ఉండే రాంచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పుకొనే సింహయాజులు, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దక్కన్ ప్రైడ్, అంబర్‌పేటలో సెలబ్రేషన్స్ పేరిట హోటళ్లను నిర్వహిస్తున్న నందకుమార్.. ఈ ముగ్గురూ ఎమ్మెల్యేల ప్రలోభం కేసులో నిందితులుగా ఉన్నారు. వారు కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో నందకుమార్‌కు చెందిన హోటళ్లు, ఫామ్‌హౌజ్‌లలో ఉంటున్నట్టు సమాచారం. నందకుమార్ ఓ కేంద్ర మంత్రికి సన్నిహితుడని.. ఈ ముగ్గురూ కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. మూడు రోజులుగా స్కెచ్ వేసి.. పార్టీ ఫిరాయించాలంటూ సంప్రదించిన ముగ్గురు వ్యక్తులను పట్టించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రెడహ్యాండెడ్గా పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారని రాజకీయ, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ప్రలోభాల అంశంపై నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారమిచ్చారు. తాము పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్రం ఆధీనంలోని పదవులు ఇస్తామంటూ ఎర వేశారని వివరించారు. అయితే నేరుగా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే అసలు విషయం బయటపడదని భావించిన పోలీసులు.. బేరసారాలు సాగిస్తూ, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం నిఘావర్గాలతోపాటు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల సూచన మేరకు.. సదరు ముగ్గురితో ఎమ్మెల్యేలు సంప్రదింపులు కొనసాగించారు. అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆ ముగ్గురు వ్యక్తులు సిద్ధమవడంతో బుధవారం అజీజ్‌నగర్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌజ్‌కు రావాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని చిత్రీకరించేందుకు పోలీసులు రహస్య కెమెరాలు, ఇతర నిఘా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నుంచే ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో కాపు కాశారు. కూలీలు, చిన్న వ్యాపారులు, స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా మారువేషాలు వేసుకుని నిఘా పెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలు సాయంత్రం 5 గంటల సమయంలో, కాసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. సమావేశం మొదలైందని, డబ్బుతో కూడిన రెండు సంచులు లోపలికి వచ్చాయని ఎమ్మెల్యేల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడి చేసిన అధికారులు సింహయాజులు, రాంచంద్రభారతి, నందకుమార్లతోపాటు తిరుపతి అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 కోట్లు స్వాదీనం? పోలీసులు తమదాడి సందర్భంగా ఓ కారును, రెండు బ్యాగుల్లో రూ.15 కోట్ల నగదు, సెల్ఫోన్లు, ఇతర పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింహయాజులు, రాంచంద్రభారతి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారితో వచ్చిన తిరుపతి అనే వ్యక్తి తాను కారు డ్రైవర్‌నని చెప్పడంతో వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న కారు గంధవరం దిలీప్‌కుమార్ పేరిట ఉందని.. ఆయన ఎవరు? ఆ ముగ్గురితో సంబంధంలు ఏమిటన్నది ఆరా తీస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పరిచయాలే పెట్టుబడిగా వ్యాపారాలతో..! అంబర్‌పేట: నందకుమార్ కుటుంబం కర్ణాటక నుంచి వచ్చి అంబర్‌పేట డీడీ కాలనీలో స్థిరపడ్డారని.. ఆయన తండ్రి శంకరప్ప హైదరాబాద్ నగర పీస్ కమిటీ సభ్యులని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు పోలీసుశాఖలో ఉన్న పరిచయాలను కుమారుడు నందకుమార్ వినియోగించుకుని పలు వ్యాపారాల్లో అడుగుపెట్టారని అంటున్నారు. ప్రధానంగా హోటల్ రంగంలో ఉన్న నందకుమార్‌పై పలు ఆరోపణలూ ఉన్నాయని పేర్కొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందకుమార్‌కు పరిచయమని.. తన హోటళ్ల ప్రారంభోత్సవాలకు కిషన్‌రెడ్డిని ఆహ్వానించారని చెబుతున్నారు. నందకుమార్ స్థానికంగా పెద్దగా కనిపించరని.. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల అంశం అంబర్‌పేటలో చర్చనీయాంశంగా మారిందని పేర్కొంటున్నారు. ఎవరా ముగ్గురు? ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ దేవాలయంలో పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ.. తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పే సింహయాజులు.. హైదరాబాద్‌లో హోటల్స్ వ్యాపారం చేసే నందకుమార్ ఎలా ఆపరేషన్? ఎమ్మెల్యేల సమాచారం మేరకు పక్కాగా ప్లాన్ వేసిన పోలీసులు. కూలీలు, చిన్న వ్యాపారులు, స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వేషాల్లో నిఘా. అంతా ఫామ్‌హౌజ్‌లోకి చేరుకున్నాక, డబ్బు సంచులు వచ్చాయని ఎమ్మెల్యేలు సమాచారమిచ్చాక దాడి. రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు. ఏం ఇస్తామన్నారు? పార్టీ మారితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని పదవులు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దాడి సందర్భంగా పోలీసులు రూ.15 కోట్లు పట్టుకున్నట్టు ప్రచారం జరిగింది. దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. -
జూపల్లి, బీరం చర్చావేదిక భగ్నం
సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య బహిరంగ చర్చ సాగక ముందే రచ్చరచ్చ అయింది. కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్దిరోజులుగా వారి మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. ఇరువురు నేతల మధ్య చర్చావేదిక నిర్వహించేందుకు ఉదయం చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. పది గంటలకు జూపల్లి ఇంటిని చర్చావేదికగా వారు ఖరారు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచే కొల్లాపూర్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. జూపల్లి నివాసం వద్ద సైతం భారీ బందోబస్తు నిర్వహించారు. హర్షవర్ధన్‌రెడ్డి సుమారు రెండు వేలమంది కార్యకర్తలతో కలసి జూపల్లి ఇంటి వైపు ర్యాలీగా బయలుదేరారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ముందుకు రాగానే పోలీసులు నిలువరించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. దమ్ముంటే నిరూపించాలి: జూపల్లి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ఆరోపణలపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తానని, నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని అన్నారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్యే పారిపోయారని వ్యాఖ్యానించారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బ్యాంకుల్లో తీసుకున్న రూ.ఆరు కోట్ల అప్పును 2007లోనే వడ్డీతో సహా రూ.14 కోట్లు చెల్లించానని పేర్కొన్నారు. ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని ఎన్జీటీలో కేసు వేసింది ఎవరు? తర్వాత ఎందుకు విత్‌డ్రా అయ్యారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి’అని జూపల్లి ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోను: బీరం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు సింగిల్‌విండో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల ఆస్తులను, బ్యాంకులను మోసం చేసిన ఘనత నీదే కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ రోజు బహిరంగ చర్చకు పిలిచి మొహం చాటేసుకున్నావు. ఇక నుంచి నీ ఆటలు, మాటలు సాగనివ్వబోం’అని జూపల్లిని ఉద్దేశించి హెచ్చరించారు. ఇది కూడా చదవండి: జూపల్లి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు -
కొల్లాపూర్‌లో హై టెన్షన్.. పోలీసుల వార్నింగ్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్ ఉత్కంఠ రేపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అధికార గులాబీ పార్టీకి చెందిన నేతలిద్దరూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్ చాలెంజ్ చేస్తూ బహిరంగ చర్చకు సిద్దమంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆదివారం కొల్లాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్ కొల్లాపూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతిలేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, ఈరోజు ఉదయం కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఇంటి వద్ద పోలీసులు బారీకేడ్డు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు.. ఇంటికే పరిమితం చేశారు. ఇది కూడా చదవండి: మోదీ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు: తరుణ్‌ఛుగ్ -
వైరా వాసి దక్షిణాఫ్రికాలో మృతి
భద్రాద్రి కొత్తగూడెం, వైరారూరల్: మండల పరిధిలోని గరికపాడు గ్రామవాసి అనారోగ్యంతో బాధపడుతూ దక్షిణాఫ్రికాలో బుధవారం మృతి చెందాడు. స్థాని కులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శీలం రమణారెడ్డి, కృష్ణాకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు హర్షవర్ధన్ రెడ్డి(27) పీజీ పూర్తి చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సూచనల మేరకు గతేడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలోని మాలవి వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ స్నేహితుల సాయంతో అక్కడి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అనా రోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించాడు. మంగళవారం హర్షవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావును కలిసి పరిస్థితి వివరించారు. తమ కుమారుడిని ఇండియాకు రప్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈలోపే తీవ్ర అనారోగ్యానికి గురైన హర్షవర్ధన్ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మృతి చెందాడు. కుమారుడి మృతి సమాచారంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభం కావడంతో హర్షవర్ధన్ రెడ్డి ఇండియాకు తిరిగి వచ్చేందుకు మిత్రుల సహాయంతో జూన్ 6వ తేదీ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు కబళించింది. దీంతో గరికపాడు శోకసంద్రంలో మునిగింది. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
పీఆర్సీ అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన పార్టీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డితో కలసి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు నిరాశలో ఉన్నాయని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత వీరి హక్కులు కాలరాస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. 2018, జూలై 1 నుంచే అమల్లోకి రావాల్సిన 11వ పీఆర్సీని 20 నెలలు గడుస్తున్నా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ‘పీఆర్సీ గడువు మరో 10 నెలలు ఎందుకు పొడిగించాల్సి వచ్చింది. పొడగింపు కోసం కమిషన్ సభ్యులు అడిగిన కారణాలను ప్రజాబాహుళ్యంలో ఎందుకు పెట్టలేదు? ఐదేళ్ల కాలపరిమితి ఉన్న పీఆర్సీలో మూడేళ్లు ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటించకపోతే ఆ మేరకు వారు ఆర్థికంగా నష్టపోరా?’అని ఆ లేఖలో నిలదీశారు. -
‘కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ నేర్పుతున్నారు’
సాక్షి, కొల్లాపూర్: జిల్లాలో స్ట్రాంగ్రూంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బుధవారం నాడు ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కొంతమంది వ్యక్తులు స్ట్రాంగ్రూంపై దాడి చేశారని పేర్కొన్నారు. వారు ఇంక్ బాటిల్స్ తీసుకొని రావడం, కట్టెలతో సిబ్బంది, పోలీసులపై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ సంస్కృతిని నేర్పుతున్నారని హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన వ్యక్తులు, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులే దాన్ని కించపరచడం శోచనీయన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ.. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. తప్పులు చేస్తే అది నేనైనా, ఎవరైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీసులపై, అమాయకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. కొల్లాపూర్ పట్టణంలో నిన్న రాత్రి 10 గంటలకు ఆకస్మాత్తుగా కరెంట్ పోయింది. చెన్నపురావుపల్లి ఫీడర్లో జంపర్స్ కట్ అయ్యాయనే కారణంతో కరెంట్ నిలిచిపోయినట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే కరెంట్ లేని సమయంలో బ్యాలెట్ బాక్సులు మారుస్తున్నారంటూ పుకార్లు రావటంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కలిసి స్ట్రాంగ్‌రూం వద్దకు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులు మార్చేందుకు కరెంట్ సరఫరా నిలిపివేశారంటూ ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్‌రూం వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కొందరు నాయకులను స్ట్రాంగ్ రూం వద్దకు తీసుకెళ్లి సీల్‌ను చూపించారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఎస్ఐలు రాజు, రమేష్‌లకు గాయాలవగా, పోలీసుల వాహనాల అద్దాలు పగిలాయి. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తా, స్కాలర్స్ స్కూల్‌కు వెళ్లేదారి, పాత పోస్టాఫీస్ ఏరియాలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు అక్కడికి చేరుకుని.. పోలీస్ బలగాలను రప్పించారు. రోడ్ల వెంట గస్తీ ఏర్పాటు చేసి గుమిగూడిన నాయకులను చెదరగొట్టారు. ఆందోళన విషయాన్ని కలెక్టర్, ఎస్పీలకు చేరవేయడంతో వారు రాత్రి 12 గంటలకు కొల్లాపూర్‌కు వచ్చి స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అర్ధరాత్రి వరకు కొల్లాపూర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బ్యాలెట్ బాక్సులు భద్రపర్చిన రూములకు వేసిన సీల్లు యథాతథంగా ఉన్నాయని, తప్పుడు వదంతులను నమ్మవద్దని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. చదవండి: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ వర్గపోరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భద్రత పెంపు -
టీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన జూపల్లి కృష్ణారావు!
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రతిష్టాత్మకంగా మారిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్కు సొంత నేతల నుంచే అసమ్మతి సెగ తప్పడం లేదు. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతుండగా.. కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఏకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రెబెల్స్ తరఫున ప్రచారానికి దిగుతుండటంతో కారులో కలకలం రేపుతోంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు బీ ఫామ్‌తో పోటీ చేస్తుండగా.. తన వర్గీయులకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నేరుగా మాజీ మంత్రి కృష్ణారావు రంగంలోకి దిగారు. దాదాపు 20 వార్డుల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తన అనుచరులను బరిలో నిలిపారు. దీంతో హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి వర్గీయుల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. మొత్తానికి ఇక్కడ ఇంటిపోరు రచ్చకెక్కడంతో కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. సీనియర్ నేత జూపల్లి ఏకంగా రెబల్స్‌కు అండగా నిలిచి.. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో గులాబీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు త్వరలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కొల్లాపూర్‌లోని పరిస్థితులను టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకొని.. ఇక్కడ పార్టీ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. -
కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ వర్గపోరు..
సాక్షి, కొల్లాపూర్: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ వర్గ పోరాటం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య ఆధిపత్య పోరుతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును సముదాయించేందుకు పార్టీ అధిష్టానం చేసిన ప్రయత్నం విఫలమైంది. అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా జూపల్లి వర్గీయులు ఎన్నికల బరిలోకి దిగారు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో జూపల్లి వర్గీయులు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. జూపల్లి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, ప్రచార రథాలను ఏర్పాటు చేశారు. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్లోని ఇరువర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కొల్లాపూర్ పట్టణంపై ఆధిపత్యం సాధించేందుకు ఎమ్మెల్యే, మాజీమంత్రి ఇరువురు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారపర్వం కొనసాగిస్తున్నారు. ఈ అంశాన్ని అధిష్టానం ఎలా పరిగణిస్తుందో వేచి చూడాల్సిందే మరి. ఆ రెండు పార్టీలూ.. టీఆర్ఎస్లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో అవకాశం కోసం కాంగ్రెస్, బీజేపీలు ఎదురుచూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 20, కాంగ్రెస్ 19వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. అభ్యర్థుల ఎంపికలో రెండు పార్టీల నాయకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని వార్డుల్లో రెండు పార్టీలు తమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే కొందరు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సీపీఐ, సీపీఎంలు ఒక్కో వార్డులో పోటీలోకి దిగాయి. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఐదు నుంచి ఎనిమిది వరకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ వార్డుల్లో స్వతంత్రులు, రెబెల్స్ గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికి ఎమ్మెల్యే, మాజీమంత్రి మధ్య నెలకొన్న వర్గపోరు కొల్లాపూర్‌లో తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను రసవత్తరంగా మార్చాయనే చెప్పవచ్చు. ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారాలు వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తనకున్న బలగంతోనే ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ బీ ఫారాల కోసం భారీగా పోటీ ఉన్నప్పటికీ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎలాగైనా సరే మున్సిపాలిటీని కైవసం చేసుకుని కొల్లాపూర్‌పై తనకున్న పట్టును నిరూపించుకోవాలనే యోచనలో ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులను ప్రచారంలోకి దించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన భార్య, తల్లి కూడా ప్రచారపర్వంలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, చింతలపల్లి జగదీశ్వర్రావులకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. అధిష్టానం ఆదేశానుసారం వారికి వార్డుల వారీగా బాధ్యతలు ఇస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి నేతలతో సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఓటర్లను కలుస్తున్న జూపల్లి టీఆర్ఎస్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలబెట్టవద్దని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని అధిష్టానం చేసిన సూచనను జూపల్లి వర్గం పెద్దగా పట్టించుకోలేదు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో జూపల్లి వర్గీయులు ఎన్నికల బరిలో నిలిచారు. ముందస్తుగానే అంగబలం, అర్ధబలం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, జూపల్లి మద్దతుదారులు ప్రచార పర్వంలోకి దిగారు. వారంతా వార్డుల వారీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన ప్రజాప్రతినిధి చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు మినహాయించి మిగతా వారంతా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కండువాలు, ఎన్నికల గుర్తులతో ప్రచారాలు చేస్తున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రహస్యంగా ప్రచారం సాగిస్తున్నారు. బహిరంగంగా కాకుండా ఓటర్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడి వస్తున్నారు. ఆయన ప్రచార కార్యక్రమాలకు మీడియాను కూడా దూరంగా ఉంచుతున్నారు. ఆయన వినియోగించే వాహనాల నంబర్ ప్లేట్లను మూడు రోజులపాటు తొలగించారు. మళ్లీ మంగళవారం వాహనాలకు నంబర్ ప్లేట్లను అమర్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అపవాదు రాకుండా తనదైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆరా.. కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఎన్నికల ప్రక్రియపై చర్చించినట్లు సమాచారం. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తనవర్గం నాయకులను ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీలో దించడంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ అంశంపై ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కొల్లాపూర్‌లో రాజకీయ పరిస్థితుల గురించి మంత్రి కేటీఆర్‌కు వివరించామని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, మిగతా వ్యవహారాలు పార్టీ చూసుకుంటుందని కేటీఆర్ సూచించినట్లు పేర్కొన్నారు. -
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలకు ఇంటెలిజెన్స్ సెక్యురిటీ విభాగం అదనపు భద్రత కల్పించింది. నియోజకవర్గాలలో తిరుగలేకపోతున్నామని భద్రత పెంచాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరడంతో 4 ప్లస్ 4 గన్మెన్లను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వీరిద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్‌రెడ్డి పార్టీ మారిన తర్వాత ఈ నెల 6న టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనమైంది. తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరడంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. (చదవండి: శత్రువు వచ్చి అడిగినా సాయం చేశా: ఎమ్మెల్యే బీరం) -
ఆయనకు జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఇష్టం..
సాక్షి, కొల్లాపూర్: సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడమే ఇష్టం. నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సాయం చేశాను. శత్రువు వచ్చి కోరినా వెనకాడలేదు. మా ఊరు కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం. నా చిన్నతనం నుంచి నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చేసే సేవలు గమనించేవాడిని. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. చదువు పూర్తయిన తర్వాత లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. అందుకు మా నాన్న, అమ్మ, నా భార్య ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. నన్ను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులంతా సహకారం అందించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందించాను. మా ఇంటి దేవుడు లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో రాణించగలుగుతున్నాను..’’ అని అన్నారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి. శనివారం ఆయన ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా నాన్న లక్ష్మారెడ్డి, అమ్మ బుచ్చమ్మ, భార్య విజయ. మా నాన్న సింగోటం సర్పంచ్‌గా, డీసీసీబీ డైరెక్టర్ గా, అప్పట్లో టీడీపీ నాయకుడిగా పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినా కుటుంబం కోసం వదులుకున్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మా ఇంటికి వచ్చేవారు. ఎవరికి ఏ ఆపద, ఏ సమస్య ఉన్నా చేతనైనంతవరకు సాయం చేశాం. నాన్న సేవాభావం చూసే రాజకీయాల్లోకి రావాలనే కోరిక నాలో మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఆ మార్గంలోనే నడుస్తున్నాను. నాకు ఇద్దరు అక్కలు ఉమాదేవి, సువర్చల.. పాఠశాల చదువు అంతా పదోతరగతి వరకు కొల్లాపూర్‌లోనే కొనసాగింది. ఇంటర్, డిగ్రీ, లా హైదరాబాద్‌లో పూర్తి చేశాను. 2001లో హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించాను. పదేళ్ల వరకు పూర్తిగా ఈ వృత్తిలోనే కొనసాగాను. చిన్నప్పటి నుంచే సామాజిక సేవ చేయడంపై ఇష్టం ఉండేది. 2010–11నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాను. శత్రువుకైనా సాయం చేశా.. ఎవరైనా సరే నా వద్దకు వచ్చినవారందరికీ సాయం చేశాను. శత్రువు వచ్చి సాయం అడిగితే కూడా చేశా. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక తోడ్పాటు అందించా. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ రోడ్ల పరిస్థితి బాగా లేదు. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగునీరు అందని దుస్థితి. దీనిని పూర్తిగా మార్చివేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. దేశంలోనే ప్రత్యేకత ఉన్న కొల్లాపూర్ మామిడికి మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు కల్పించాలి. పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చాలన్నది నా లక్ష్యం. ఫ్యామిలీకి సమయం కేటాయించేందుకు యత్నిస్తా.. రాజకీయాల్లో బిజీగానే ఉంటా. అయినప్పటికీ ఫ్యామిలీకి సమయం కేటాయించేందుకు యత్నిస్తాను. నా భార్య విజయనే అన్నీ చూసుకుంటుంది. 70 ఏళ్ల వయసులోనూ అమ్మా, నాన్న నాకు ఎంతో తోడ్పాటు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నిత్యం సలహాలు ఇస్తున్నారు. కుటుంబానికి ఎక్కువగా సమయం ఇవ్వలేదు. ఎప్పుడైనా తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. సింగోటంలోని లక్ష్మీనర్సింహస్వామిని ప్రతిరోజూ దర్శించుకుంటాం. 2010లో ఒకసారి యూరప్ వెళ్లాం. పూర్తిగా నేను రాజకీయాల్లో ముందుకు వెళ్లడానికి నా భార్య సహకారం మరువలేనిది. బిజీలో ఒకవేళ నేను టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తే కారులో పెడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని ఆమెనే దగ్గరుండి చూసుకుంటుంది. ఫ్యామిలీనే నా బలం. వారి వల్లనే స్వేచ్ఛగా రాజకీయాలు చేయగలుగుతున్నాను. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి, యోగక్షేమాలు అడిగి పంపించడం అమ్మానాన్నలతోపాటు నా భార్యకు అలవాటు. జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఇష్టం ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు. మేము సహకరిస్తేనే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సేవ చేయగలుగుతారు. ఇంట్లో విషయాల కన్నా ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఆయనకు సహకరించడం నా బాధ్యత. సేమియా పాయసం, అంబలి, జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఆయనకు చాలా ఇష్టం. అందరినీ ఈజీగా నమ్మడమే ఆయన బలం, బలహీనత. వాళ్ల అమ్మ సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి సమస్యలు తెలుసు. కుటుంబం అందరం కలిసి భోజనం చేస్తాం. అత్తయ్య, మామయ్య సలహాలు, ప్రోత్సాహం, ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉన్నాయి. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. 2007 నవంబర్ 25న జరిగింది. అప్పుడప్పుడూ సినిమాలు చూస్తాం. పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. పండుగలు, శుభకార్యాలకు ఫ్యామిలీ అందరం కలిసి పాల్గొంటాం. ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా ఉండాలి రాజకీయ నాయకుడిగా ఏ స్థాయిలో ఉన్నా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే నా కోరిక. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నాకు కుటుంబసభ్యులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. రాత్రి 11 గంటల వరకు అమ్మానాన్న, అక్కలు, భార్య ప్రచారంలో పాల్గొన్నారు. 2018లో మరోసారి పోటీ చేసి ప్రజల దీవెనలతో గెలుపొందాను. వృత్తిపరంగా వచ్చిన సంపాదనను రాజకీయాల్లో ఖర్చు చేశాను. రాజకీయాల్లో సంపాదించాలనే కోరిక లేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రంగంలోకి వచ్చాను. ఇన్నేళ్లుగా ప్రజల్లో మంచి పేరు, ఆశీర్వాదం సంపాదించగలిగాను. నిత్యం ప్రజల మధ్య ఉండటమే ఇష్టం. నాకు కుటుంబం పూర్తిగా సహకరించింది. బయటికి వెళ్లిన సందర్భం తక్కువనే. గెలిచినా, ఓడినా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. కొల్లాపూర్ ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా ఉండాలని కోరిక. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకాన్ని పెంచుతా. ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా ఉంటాను. -
టీఆర్ఎస్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో టీఆర్ఎస్ బలం 100కు చేరింది. టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం చేసిన ప్రకటనతో అధికార పార్టీ అసెంబ్లీలో సెంచరీ పూర్తిచేసినట్లయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచిన 88 మంది, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక టీడీపీ, తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే గులాబీ పార్టీ బలం వందకు చేరింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష కలిశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ హర్ష లేఖ విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అందులో తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయ డంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారని, పాలమూరు పచ్చగా మారుతోందని, వలసెళ్లిన వారు తిరిగి వస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన నియోజకవర్గ సమ స్యలను సీఎం దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగావకాశాలు, సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం, పాలమూరు–రంగారెడ్డి ముంపు బాధితులకు పరిహారం లాంటి విషయాలపై స్పష్టమైన హామీ ఇచ్చారని, కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆ లేఖలో వెల్లడించారు. గెలుపు బాధ్యతలు అప్పగింత మహబూబాబాద్ (మానుకోట) లోక్‌సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిని చర్చించారు. ఎమ్మెల్యేలతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇల్లందు, పినపాక మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా పాల్గొన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా కేసీఆర్ ఎవరిని నియమించినా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు చెప్పారు. ఈ పార్లమెంటు స్థానం ఎన్నికల ఇన్‌చార్జీగా సత్యవతి రాథోడ్‌ను సీఎం ప్రకటించారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ నాయకులను సమన్వయం చేసి, ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించే బాధ్యతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించారు. ఈ సమావేశంలో పోడు వ్యవసాయం చేసుకునే రైతులను అధికారులు వేధిస్తున్న విషయాన్ని కూడా నాయకులు సీఎం దృష్టికి తెచ్చారు. అర్హులైన రైతులకు నష్టం కలగని విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మహబూబ్ నగర్, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎంతో చెప్పారు. ‘హోళీ’కే జాబితా టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను గురువారం వెల్లడించనున్నారు. మంగళవారం జరిగిన నిజామాబాద్ సభలో కేసీఆర్ ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పటికే పార్టీ తరఫున అభ్యర్థులుగా నిర్ణయించిన వారికి అనధికారిక సమాచారమిచ్చారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మల్కాజ్గిరి సీటును పార్టీకి చాలాకాలంగా దగ్గరగా ఉంటున్న కె.నవీన్‌రావుకు దాదాపు ఖరారు చేసింది. అయితే, ఇతర పార్టీల వ్యూహం, మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ విషయంలో మంత్రి శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ పేరు కూడా దాదాపు ఖరారయింది. సామాజిక సమీకరణల నేపథ్యంలో దండె విఠల్, బొంతు శ్రీదేవి యాదవ్‌ల పేర్లు కూడా చివరి నిమిషం వరకు పరిశీలనలో ఉన్నాయి. పెద్దపల్లికి ప్రభుత్వ సలహాదారు జి.వివేకానందను ఖరారుచేసే అవకాశముంది. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. నల్లగొండ సీటును ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఇచ్చే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో.. వ్యతిరేకత ఉండకుండా కొత్త అభ్యర్థి అయితే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తేరా చిన్నపురెడ్డి, వేముగంటి నర్సింహారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిని మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం వచ్చిందని, ఈ మేరకు అభ్యర్థులకు కూడా సమాచారమిచ్చారు. -
టీఆర్ఎస్లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన త్వరలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. -
వైఎస్సార్సీపీలోకి కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి
కోడుమూరు: అందరం జగనన్నకే జై కొడదామని, వైఎస్సార్సీపీలో చేరదామని కోట్ల వర్గీయులు ముక్తకంఠంతో ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు, కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునేందుకు శనివారం కోడుమూరు పట్టణంలోని స్నేహవినాయక కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ మండలాల పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జై జగన్..జై హర్ష నినాదాలతో కల్యాణ మండపం మార్మోగింది. ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టీడీపీ దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ఎదుర్కొవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే సరైనదని స్పష్టం చేశారు. నా రాజకీయ శత్రువు టీడీపీనే రాజకీయంగా శాశ్వత శత్రువుగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకొని అనైతిక రాజకీయాలు చేసేందుకు ఆత్మాభిమానం అడ్డురావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. జవసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాధించలేనని తెలుసుకొని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, కోట్ల అభిమానులను కాపాడుకోవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అని ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలతో సమాలోచనలు జరిపిన అనంతరం ఫిబ్రవరి 6వతేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుదామన్నారు. తన సోదరుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇతర పార్టీలతో జతకట్టి రాజకీయాలు చేద్దామన్న విషయాలు తన మనసును నొప్పించాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని, అందువల్లే వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, ప్యాలకుర్తి హర్షవర్దన్‌రెడ్డి, మాజీ సర్పంచు సీబీ లత, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, ఫైనాన్సియర్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు ఈశ్వరరెడ్డి, రామేశ్వరరెడ్డి గంగాధర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నక్క పరమేష్, మల్లారెడ్డి, తేనేశ్వరరెడ్డి, మాదులు, బోరెల్లి సోమన్న, టెలిఫోన్ రాముడు, పుట్టపాశం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో పలువురి నియామకం
హైదరాబాద్ : వైఎస్సార్సీపీలో గురువారం పలువురి నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంవీ హర్షవర్ధన్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెలికాని రాజమోహన్ రావులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి
టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి ఊట్కూర్ : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికుడిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి కోరారు. శనివారం సాయంత్రం బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 2048 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జీఓ 11ద్వారా 2000 ఉపాధ్యాయ పోస్టులు రావాల్సివుదని ఆరోపించారు. ప్రభుత్వం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో నెలకొన్న విద్యా సమస్యలను పట్టించుకోలేదని, దీంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉపాధ్యాయునిలకు రెండేళ్ల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని కోరారు. దసరా కానుకగా పీఆర్సీ బకాయిలను మంజూరు చేయాలని, భాష పండితులకు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉపాధ్యాయులు లేక 23 ఉర్దు మీడియం పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. స్థానికుడిగా ఎన్నికల్లో గెలిపిస్తే విద్యాభివద్ధికి కషిచేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మరికెంటి బాల్‌రాజ్, నాయకులు నారాయణరెడ్డి, రఘురాంగౌడ్, జనార్దన్, సుధాకర్, ఆంజనేయులు, సస్సేన, విశ్వనాథ్, రేణుక, జగన్నా«ద్, రవూఫ్, జలాల్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లను అవమానించడమే
- పీఆర్టీయూ అధ్యక్షుడి సస్పెన్షన్‌పై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డిని సస్పెండ్ చేయడం టీచర్లను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. బడిబాట సమీక్షలో హెచ్ఎంలను దూషించిన మహబూబ్‌నగర్ కలెక్టర్ తీరును ప్రశ్నించినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని పేర్కొన్నాయి. పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా విలేకరుల సమావేశం పెట్టినంత మాత్రాన ఎలా సస్పెండ్ చేస్తారని పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి, కలెక్టర్ తీరుపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్ల పట్ల అవమానకరంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని టీపీటీఎఫ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీచర్లను బదిలీ చేసిన కలెక్టర్.. ఉపాధ్యాయ సంఘాల నేతలను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెన్నయ్య, రవిశంకర్‌రెడ్డి, షౌకత్ అలీ తదితరులు ప్రశ్నించారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఎయిమ్స్‌ను కర్నూలులో ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదే శ్ రాష్ట్రానికి కేటాయించిన ఎయిమ్స్‌ను కర్నూలులో ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె వినతిపత్రాన్ని అందజేశారు. కర్నూలు ఎన్‌హెచ్-44తో అనుసంధానమై ఉండడంతోపాటు అటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రాంతంలో ఉందని, గతంలోనూ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉందని, అందువల్ల ఎయిమ్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి వినతిపత్రం అందజేసినట్టు ఎంపీ తెలిపారు. ప్రత్యేక హోదా పరిశీలనలో ఉంది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
వైభవం.. మాధవుడి రథోత్సవం
కోడుమూరు, న్యూస్‌లైన్: గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ మాధవస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. అశేష భక్త జనుల గోవింద నామస్మరణ మధ్య రథంలో స్వామి అమ్మవార్లు విహరించారు. భక్తు లు తమ ఇలవేల్పును కనులారా వీక్షిం చాలన్న సంకల్పంతో రోడ్లు, మిద్దెలపైకి ఎక్కి రథోత్సవాన్ని తిలకించా రు. ఈ నెల 17న అంకురార్పణతో ప్రారంభమైన మాధవస్వామి ఉత్సవాలు 27 తేదీ వరకు కొనసాగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బుట్టా రేణుక, పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డి, కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్పీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోట్ల వంశీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జననేతే ఆదర్శమంటున్న హర్షవర్ధన్ రెడ్డి