ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్ ఉత్కంఠ రేపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది.
అధికార గులాబీ పార్టీకి చెందిన నేతలిద్దరూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్ చాలెంజ్ చేస్తూ బహిరంగ చర్చకు సిద్దమంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆదివారం కొల్లాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్ కొల్లాపూర్ చేరుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు అప‍్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతిలేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, ఈరోజు ఉదయం కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఇంటి వద్ద పోలీసులు బారీకేడ్డు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు.. ఇంటికే పరిమితం చేశారు.
ఇది కూడా చదవండి: మోదీ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు: తరుణ్‌ఛుగ్
Comments
Please login to add a commentAdd a comment