
ఎయిమ్స్‌ను కర్నూలులో ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదే శ్ రాష్ట్రానికి కేటాయించిన ఎయిమ్స్‌ను కర్నూలులో ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె వినతిపత్రాన్ని అందజేశారు. కర్నూలు ఎన్‌హెచ్-44తో అనుసంధానమై ఉండడంతోపాటు అటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రాంతంలో ఉందని, గతంలోనూ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉందని, అందువల్ల ఎయిమ్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి వినతిపత్రం అందజేసినట్టు ఎంపీ తెలిపారు.
ప్రత్యేక హోదా పరిశీలనలో ఉంది
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.