కోడుమూరు, న్యూస్‌లైన్: గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ మాధవస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. అశేష భక్త జనుల గోవింద నామస్మరణ మధ్య రథంలో స్వామి అమ్మవార్లు విహరించారు.
భక్తు లు తమ ఇలవేల్పును కనులారా వీక్షిం చాలన్న సంకల్పంతో రోడ్లు, మిద్దెలపైకి ఎక్కి రథోత్సవాన్ని తిలకించా రు. ఈ నెల 17న అంకురార్పణతో ప్రారంభమైన మాధవస్వామి ఉత్సవాలు 27 తేదీ వరకు కొనసాగుతాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బుట్టా రేణుక, పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డి, కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్పీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోట్ల వంశీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైభవం.. మాధవుడి రథోత్సవం
Published Sun, Mar 23 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM
Advertisement
Advertisement