
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.