
కోర్టు హాల్ నుండి బయటకు వస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో 5వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డి.దేవేందర్ బాబు.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు.
ఈ కేసులో ఫిర్యాదీ తాండూరు శాసనసభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం అధికార పరిధిలో లేని మేజిస్ట్రేట్ నమోదు చేయాల్సి ఉంది. సరూర్‌నగర్ పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య ఎమ్మెల్యేను కోర్టులో హాజరు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment