నేను ప్రెగ్నెంట్‌ కాలేదు! | I am not pregnant, just bingeing on pizzas, says Anita Hassanandani | Sakshi
Sakshi News home page

నేను ప్రెగ్నెంట్‌ కాలేదు!

Published Tue, Jul 19 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

నేను ప్రెగ్నెంట్‌ కాలేదు!

నేను ప్రెగ్నెంట్‌ కాలేదు!

తేజ నువ్వు-నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన హీరోయిన్ అనిత గుర్తుంది కదా.. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఉత్తరాదికి వెళ్లిపోయింది ఈ భామ. అనంతరం కొన్ని హిందీ సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనితా హస్సనందానీ త్వరలో తల్లి కాబోతున్నదని, ఆమె గర్భవతి అయిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుసకట్టిన ఈ కథనాలపై అనిత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. తాను ప్రెగ్నెంట్ అయినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చిన ఆమె.. తాను బరువు పెరగడానికి చాక్లెట్లు, పిజ్జాలే కారణమని చెప్పుకొచ్చింది.

'ప్రతి మీడియా సంస్థ నుంచీ నాకు కాల్స్ వస్తున్నాయి. ఏమైనా 'గుడ్ న్యూస్' ఉందా అని అడుగుతున్నారు. ఔను శుభవార్త ఉంది. అదేమిటంటే నేను డైటింగ్ చేయడం లేదు. నేను చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌లు బాగా తింటున్నాను. నేను అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తున్నానంటే అందుకు కారణం మా ఆయనతో ప్రేమలో ఉండటమే. నేను గర్భవతిని అయితే ఆ విషయాన్ని మీ అందరికీ గర్వంగా తెలియజేస్తాను' అని అనిత తనదైన స్టైల్లో వివరణ ఇచ్చింది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement