సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ కేసులో విచారణను ఆపాలంటూ బీజేపీ కోర్టులో పిటిషన్ ఎందుకేసిందో చెప్పాలని మంత్రి హరీష్‌రావు కోరారు. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడేమో మాకు దొరికిన వాళ్ళు ఎవరో తెలియదంటూ తడిబట్టలతో తిరుగుతారు. కానీ వాళ్ల పార్టీ ప్రధాన కార్యదర్శి సిట్‌ని నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేస్తారని ఎద్దేవా చేశారు. మీకు సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్ళారు? మీకెందుకంత భయం? అంటూ ప్రశ్నించారు.
ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ, తెలంగాణలో విఫల ప్రయత్నం చేసిందన్నారు. అయితే ఇక్కడ బీజేపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలక మాదిరిగా తయారైందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ దొంగలు అడ్డంగా దొరికిపోవడంతో జాతీయ స్థాయిలో ఆ పార్టీ పరువు పోయిందన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతలు గందరగోళంలో ఉన్నారని తెలిపారు. బీజేపీ నేతలు చెంపలు వేసుకుని తప్పు ఒప్పుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు.
'మరోవైపు గవర్నర్ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మాట్లాడుతున్నారు. రాహుల్‌పై పోటీ చేసిన తుషార్ గురించి మేం చెప్పాం. కానీ గవర్నర్ మాత్రం తన ఏడీసీ తుషార్ గురించి మాట్లాడారు. గవర్నర్ హుందాగా ఉండాలి. గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని మంత్రి హరీష్ రావు అన్నారు.
చదవండి: (పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు)
Comments
Please login to add a commentAdd a comment