సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరగనుందా?.
వివరాల ప్రకారం.. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం క్వాష్ పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఇక, సిట్ నోటీసులు చట్టవిరుద్ధమంటూ బీఎల్ సంతోష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు.. ఫాంహౌస్ కేసులో భాగంగా బీఎల్ సంతోష్ ఈనెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసుల్లో వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. అంతకుముందు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాగంగా బీఎల్ సంతోష్‌కు వాట్సాప్, మెయిల్ ద్వారా మరోసారి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. దీంతో, ఈ కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్. ఏ-4గా బీఎల్ సంతోష్, ఏ-5గా తుషార్, ఏ-6గా జగ్గుస్వామి, ఏ-7గా న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో చేర్చింది. అదే సమయంలో సిట్ స్వర నమూల నివేదిక సిట్ చేతికి అందింది.
Comments
Please login to add a commentAdd a comment