
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను కొని తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని బాంబు పేల్చారు.
‘ఈ మధ్యే మా పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు సంప్రదించారు. లిక్కర్ కేసులో మరికొద్ది రోజుల్లో మీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు తప్పదని మా ఎమ్మెల్యేలను బెదిరించారు. అరెస్టు తర్వాత ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పారు.
ఇప్పటికే తమకు ఆప్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు వారు తెలిపారు. మీరు కూడా మాతో కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్‌తో పాటు రూ.25 కోట్లు ఆర్థిక సాయం చేస్తామని ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆశ చూపారు’ అని కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్)లోపోస్టు చేశారు.
पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024
Comments
Please login to add a commentAdd a comment