
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. ఈ నేపథ్యంలో వారి అరెస్ట్‌ను ఏబీసీ కోర్టు రిజక్ట్ చేయడంపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.
దీంతో, పోలీసుల పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏజీ వాదిస్తూ.. ప్రతీ కేసులో 41C నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలకు రూ. 50కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారు. టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరాలని ఆఫర్ చేశారు. ఈడీ, సీబీఐ కేసుల నుంచి కాపాడుతామని చెప్పారు. అనంతరం, నిందితుల తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదిస్తూ.. తమ పిటిషనర్లపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఘటన స్థలంలో ఎలాంటి డబ్బు దొరకలేదన్నారు. హై ప్రొఫెషనల్ కేసులో ప్రతీ ఒక్కరికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వాలన్నారు.
ఇక, విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫామ్‌హౌస్‌లో ముందే కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థ పెట్టారా? అని ప్రశ్నించింది. 24 గంటలపాటు నిందితులు హైదరాబాద్‌ను విడిచి వెళ్లొదని ఆదేశించింది. సాయంత్రంలోపు నిందితుల చిరునామాలు సీపీకి ఇవ్వాలని పేర్కొంది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. కేసు వివరాలు అఫిడవిట్స్ అన్ని ప్రతివాదులకు ఇవ్వాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: మునుగోడు ఎన్నికల ముందే పని అయిపోవాలి.. ఆడియో లీక్ కలకలం
Comments
Please login to add a commentAdd a comment