సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఇవాళ(శుక్రవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫాంహౌజ్ కేసులో నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
అయితే.. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును నిందితులు ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై రేపు(శనివారం) విచారణ సాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment