పినతల్లి ఇంటికి వస్తే.. ప్రే..ముంచాడు | Woman Cheating Case Files Against Boyfriend In Payakarao Peta Visakhapatnam | Sakshi
Sakshi News home page

ప్రే..ముంచాడు

Published Sat, Aug 4 2018 12:43 PM | Last Updated on Tue, Aug 7 2018 12:52 PM

Woman Cheating Case Files Against Boyfriend In Payakarao Peta Visakhapatnam - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతితో పాటు మహిళలు

విశాఖపట్నం ,పాయకరావుపేట: ప్రేమించానని నమ్మించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమంటే నిరాకరించి బెదిరిస్తున్నాడని ఓ యువతి శుక్రవారం  మహిళా సమాఖ్య ప్రతినిధులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని పాతపేటకు చెందిన ఒక యువతి అప్పుడప్పుడు పండుగలకు నర్సీపట్నంలో ఉంటున్న పినతల్లి ఇంటికి వెళ్లేది. అక్కడ అత్తిలి భాస్కర్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. అతని మాటలు నమ్మిన ఫలితంగా అతడి ద్వారా గర్భం దాల్చినట్లు ఫిర్యాదు చేసింది.

ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని భాస్కర్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అడిగితే రూ. 5 లక్షలు కట్నం కావాలన్నారని,గర్భం తీయించి వేసుకుంటే పెళ్లి చేసుకుంటానని బెదిరి స్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను నమ్మించి మోసం చేసిన భాస్కర్‌తో తనకు వివాహం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధిత యువతి ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆమెతో పాటు మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు బందుల సుబ్బలక్ష్మి, దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వి.శివప్రసాద్, మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి ఎరుపల్లి రమణమ్మ , మహిళా సమాఖ్య మండల కార్యదర్శి  ఎలిపే సత్యవతి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement