payakarao peta
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ.. @ పాయకరావుపేట
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్ కుమార్‌లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. చదవండి: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం.. తుని రాజా కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రులు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాయకరావుపేట చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను సీఎం ఆశీర్వదించారు. -
అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు
నక్కపల్లి/పాయకరావుపేట: అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు ఆరోపించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావును గద్దె దింపి ఆయన మరణానికి కారణమయ్యాడని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందన్న సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను సైతం అంతమొందించాలన్న కుట్రకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వరద ప్రాంతాల్లో పరామర్శ సమయంలో ‘గాల్లో వచ్చి గాల్లోనే పోతాడు, నాతో పెట్టుకున్న వైఎస్ పరిస్థితి ఏమైంది’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రజల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని వివరించారు. దళితులతో బాబు ఓటు బ్యాంకు రాజకీయం వైఎస్ జగన్.. తనను అక్కున చేర్చుకుని 2014లో పాయకరావుపేట టికెట్ ఇస్తే, పక్క నియోజకవర్గ నాయకుడికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి.. తన ఓటమికి కష్టపడ్డారన్నారు. దళితులకు పూర్తి న్యాయం చేసింది జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని చెప్పారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఆయనదేనన్నారు. చంద్రబాబు దళితులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక, కుటుంబీకులను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాటు మోదీ చంక నాకి, ఆ తర్వాత మోదీని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని శపథం చేశాడని.. ఇప్పుడు అమిత్‌షా, మోదీ కాళ్లు పట్టుకోవడం కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. 23 సీట్లతో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా చంద్రబాబుకు సిగ్గు లేదని, లోకేశ్ ఎప్పటికీ సీఎం కాలేడని చెప్పారు. టీడీపీలో ఎవరైనా ఎదుగుతుంటే రాజకీయంగా, భౌతికంగా అంతమొందించడం తండ్రీ కొడుకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. జీఎంసీ బాలయోగి, ఎలిమినేటి మాధవరెడ్డి, ఎర్రన్నాయుడు వంటి నాయకుల మరణానికి చంద్రబాబే కారణమన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ అభ్యున్నతి కోసం తాను ఎప్పటికీ శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. -
మున్సిపాలిటీగా పాయకరావుపేట!
విశాఖపట్నం ,నక్కపల్లి: జిల్లాలో కొత్తగా ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. పాయకరావుపేటను మున్సిపాలిటీగా, నక్కపల్లి, ఆనందపురంలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఇంతవరకు మేజర్ పంచాయతీలుగా ఉన్న ఈ పంచాయతీలను మున్సిపాలిటీ, నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మళ్లీ వీటిపై కదలిక వచ్చింది. గత నెలలో మరోసారి ప్రతిపాదనలు కోరారు. నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వీటి వ్యవహారం ఏదో ఒకకొలిక్కి తీసుకువచ్చే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా పెండింగ్‌లో.. నక్కపల్లి, పాయకరావుపేట, ఆనందపురం మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున ఈ ప్రతిపాదన మళ్లీ తెరమీదకు వచ్చింది. నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఆగస్టునెలాఖరులోగా పంపించాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. దీంతో అధికారులు మళ్లీ నగర పంచాయతీల ఏర్పాటుపై కసరత్తు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నక్కపల్లికి సంబంధించి ఉపమాక, న్యాయంపూడి, సీహెచ్‌బీ అగ్రహారం, పెదబోదిగల్లం పంచాయతీలను కలిపి నగర పంచాయతీగా చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయాలంటే జనాభా 20 వేలు దాటి, ఆదాయం రూ.30 లక్షలు ఉండాలి. నక్కపల్లి పంచాయతీ ఆదాయం ఏటా రూ.60 లక్షలు ఉంది జనాభా 7500 ఉంది. ఉపమాక జనాభా 5500 ఆదాయం రూ.25 లక్షల వరకు ఉంది. న్యాయంపూడి జనాభా 1500 ఆదాయం రూ.5 లక్షలు, సీహెచ్‌బీ అగ్రహారం పంచాయతీ జనాభా1400 ఆదాయం రూ.5 లక్షలుగా ఉంది. బోదిగల్లం పంచాయతీ జనాభా కూడా 1500, ఆదాయం రూ. నాలుగు లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఈ ఐదు పంచాయతీలను కలిపి నగర పంచాయతీ చేసే అవకాశం ఉంది. ఇక పాయకరావుపేట విషయానికి వస్తే పట్టణ జనాభా సుమారు 30 వేలకుపైబడే ఉంటుంది. ఆదాయం కూడా దాదాపు రూ.రెండు కోట్ల వరకు ఉంటుంది. ఈ పంచాయతీలో పీఎల్‌పురం, సీతారామపురం పంచాయతీలను కూడా విలీనం చేసి మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఆదాయం, ఆర్థిక వనరులు, సరిపడా జనాభా ఇతర మౌలిక సదుపాయాలు ఉండటంతో పాయకరావుపేటను మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో ప్రభుత్వం ఆమోద ముద్రవేసి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. -
ఆడుకుంటూ అనంత లోకాలకు...
పాయకరావుపేట: అంతవరకు తోటి స్నేహితులతో గెంతులేస్తూ ఎంతో ఆనందంగా ఆడుకున్న తన గారాలపట్టి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ సమయంలో భర్త కూడా ఊరిలో లేకపోవడంతో ఏం చేయాలో తోచక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక శోకసంద్రంలో మునిగిపోయింది. పాయకరావుపేట పట్టణంలో గల ప్రశాంతినగర్‌లో ట్రాక్టరు ఢీకొని ఐదు సంవత్సరాల బాలుడు దుర్మరణం చెందాడు. రాపేటి సురేష్, జానేశ్వరి దంపతులు స్థానిక ప్రశాంతినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.వీరిలో రెండో కుమారుడు వినయ్(5) సోమవారం ఉదయం స్నేహితులతో వీధిలో ఆడుకుంటూ ఉండగా మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. పోలవరం కాలువ వైపు నుంచి గ్రావెల్‌తో వస్తున్న ట్రాక్టర్ బాలుడిని ఢీకొంది. దీంతో వినయ్ తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వినయ్ తండ్రి సురేష్ హైదరాబాద్ వెళ్లడంతో ఆయనకు సమాచారం అందించారు. తల్లి జ్ఞానేశ్వరి కన్నీరు మున్నీరుగా విలపించింది. బాలుడి మృతికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎం.విభీషణరావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు. -
మట్టిపెళ్లలు కూలి విషాదం..
సాక్షి, విశాఖ పట్నం : తూర్పు గోదావరి జిల్లా తునిలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పార గూడెం సమీపంలో తాండవ నది ఒడ్డున మట్టిని తవ్వుతుండగా మట్టిపెళ్లలు విగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని తుని ఆస్పత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సమయం లేదు మిత్రమా..
పాయకరావుపేట: సమయం లేదు మిత్రమా.. అన్నట్టు వైఎస్సార్సీపీ పాయకరావుపేట అసెంబ్లీ సెగ్మెంటులో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పోలింగ్‌కు పది రోజులు మాత్రమే సమయమున్నందున ప్రచారంలో జోరు పెంచింది. అభ్యర్థి గొల్ల బాబూరావు పార్టీ శ్రేణులతో నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు. ప్రత్యర్థుల కంటే ఓ అడుగు ముందులో ఉంటున్నారు. సోమవారం పాయకరావుపేట పట్టణంతోపాటు, ఈదటం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు సామాజికవర్గాల పెద్దలను కలిసి మద్దతు కోరారు. రజకపేట, కరణంగారి వీధి, బృందావనం ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల జిమ్మిక్కులకు పాల్పడుతున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీ డిక్లరేషన్ ద్వారా వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేసి సాహసోపేతమైన సంక్షేమ పథకాలు ప్రకటించిన ఘతన జగన్‌కే దక్కుతుందన్నారు. గత ఎన్నికల నాటి ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు పాయకరావుపేట ఎమ్మెల్యేగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ప్రచారంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు ధనిశెట్టిబాబూరావు, పట్టణశాఖ అధ్యక్షుడు దగ్గుపల్లిసాయిబాబా, సీడీసీ మాజీ చైర్మన్ గూటూరు శ్రీను, బీసీ సెల్ కార్యదర్శి ఆడారి ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకులు లంక సూరిబాబు పాల్గొన్నారు. చంద్రబాబే పెద్ద ఆర్థిక నేరగాడు చంద్రబాబు నాయుడు దేశంలోనే పెద్ద ఆర్థిక నేరగాడని పాయకరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి గొల్ల బాబూరావు ఆరోపించారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. అక్రమంగా ఎన్ని కేసులు బనాయించినా నిర్భయంగా న్యాయపోరాటం చేస్తున్న జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో రాత్రికి రాత్రి తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ నుంచి పారిపోయి రాలేదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల లెక్కలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌తో రక్షించాలని వివిధ పార్టీల నాయకులను ప్రాధేయపడడం అందరికీ తెలిసిందే అన్నారు. నియోజకవర్గంలో నాలుగుసార్లు పర్యటించినప్పుడు ఇచ్చిన డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఏర్పాటు, ఆస్పత్రి çఅప్‌గ్రేడ్ వంటి హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని నియోజకవర్గానికి వచ్చావన్నారు. మోసపోయి ఓట్లేయడానికి రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వారు కాదన్నారు. సినీ నటుల ప్రచారం.. మండలంలోని పాల్తేరు గ్రామంలో సినీ నటులు పృధ్వీరాజ్, జోగినాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు మాయమాటలకు మోసపోవద్దన్నారు ఆయన పెట్టే పథకాలన్ని ఓట్లకోసమేనన్నారు. మరో సారి మోసపోతే నట్టేట ముంచేస్తాడన్నారు. జనరంజకమైన పాలన అందించే సత్తా జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ వంటి పథకాలు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదన్నారు. ఈ ప్రచారంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ చిక్కాల రామారావు, డి. వెంకటేశ్వరరావు, అనిశెట్టి వెంకటసూరి పాల్గొన్నారు. ఉద్దండపురంలో ఇంటింట ప్రచారం నక్కపల్లి: మండలంలోని ఉద్దండపురంలో మండలశాఖ «అధ్యక్షుడు పొడగట్లపాపారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు సోమవారం రాత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి గొల్ల బాబూరావు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతిలను గెలిపించాలన్నారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు, చేసే వాగ్దానాలకు మోసపోవద్దన్నారు. ప్రకటించిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ అమలు కావాలంటే జగనన్న సీఎం కావాలన్నారు. ఈ ప్రచారంలో పార్టీనాయకులు పొడగట్ల సూరిబాబు, బచ్చలరాజు, రమణ, వెంకటేష్, రాఘవ, దొరబాబు, పొడగట్లరాజు పాల్గొన్నారు. -
అనిత పాదయాత్రకు నిరసనల సెగ
విశాఖపట్నం: పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత చేపట్టిన పాదయాత్రకు నిరసనల సెగ తగిలింది. మంచినీటి సరఫరా కల్పించలేదని, పారిశుద్ధ్యం లోపించిందని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యే అనితను అడ్డుకున్నారు. ఫ్లకార్డులు, ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తుల చర్యతో ఏం చేయాలో పాలుపోక ఇచ్చిన హామీలు త్వరలోనే నెరవేరుస్తానని చెప్పి ఎమ్మెల్యే అనిత అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. గిడ్డి ఈశ్వరిని అడ్డుకున్న గిరిజనులు విశాఖపట్నం: ఏజెన్సీలో టీడీపీ చేపట్టిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరినీ స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. జి. మాడుగుల మండలం లోచలిలో రోడ్డు ఎందుకు మంజూరు చేయలదేని స్థానికులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. -
243వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 243వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దార్లపూడి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి యలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక, పద్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్తమపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. -
పినతల్లి ఇంటికి వస్తే.. ప్రే..ముంచాడు
విశాఖపట్నం ,పాయకరావుపేట: ప్రేమించానని నమ్మించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమంటే నిరాకరించి బెదిరిస్తున్నాడని ఓ యువతి శుక్రవారం మహిళా సమాఖ్య ప్రతినిధులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని పాతపేటకు చెందిన ఒక యువతి అప్పుడప్పుడు పండుగలకు నర్సీపట్నంలో ఉంటున్న పినతల్లి ఇంటికి వెళ్లేది. అక్కడ అత్తిలి భాస్కర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. అతని మాటలు నమ్మిన ఫలితంగా అతడి ద్వారా గర్భం దాల్చినట్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని భాస్కర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అడిగితే రూ. 5 లక్షలు కట్నం కావాలన్నారని,గర్భం తీయించి వేసుకుంటే పెళ్లి చేసుకుంటానని బెదిరి స్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను నమ్మించి మోసం చేసిన భాస్కర్‌తో తనకు వివాహం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధిత యువతి ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆమెతో పాటు మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు బందుల సుబ్బలక్ష్మి, దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వి.శివప్రసాద్, మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి ఎరుపల్లి రమణమ్మ , మహిళా సమాఖ్య మండల కార్యదర్శి ఎలిపే సత్యవతి ఉన్నారు. -
ఇద్దరు యువకుల ఘాతుకం
సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : వావివరుసలు మరచి ఇద్దరు యువకులు చెల్లి వరుస అయిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఉరివేసి హత్యచేసేందుకు యత్నించిన సంఘటన ఆలస్యంగా బీకే పల్లిలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆమె కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. బాలిక తల్లి లక్ష్మి వివరాలు ఇలా ఉన్నాయి. తమ పక్క ఇంటిలో ఉంటున్న పైల గోపి, పైల సునీల్ తన కుమార్తెకు అన్నదమ్ముల వరుస అవుతారని, దానిని మరిచి ఇద్దరూ ఆమెపై లైంగికదాడికి యత్నించి, ఆపై చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. పథకం ప్రకారం ఆదివారం పాకలోకి పిలిచి లైంగికదాడికి యత్నించారని తెలిపింది. బాలిక అడ్డుకోవడంతో వెలుగులోకి వస్తే ప్రమాదమని భావించి ఉరి వేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. చనిపోయిందనుకుని ఏమీ తెలియనట్టుగా తమ పెద్ద కూతురు ఉమాదేవి వద్దకు వచ్చి మీ చెల్లిపై సిమెంట్ బస్తాలు పడిపోయాయని గోపి చెప్పాడని, అక్కడకు వెళ్లేసరికి కొనఊపిరితో ఉన్న కుమార్తెను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వైద్య సిబ్బంది కూడా జరిగిన సంఘటనపై అనుమానం వ్యక్తం చేశారని, సిమెంట్ బస్తాలు పడితే పెనుగులాడినట్టు తల, వీపుపై మట్టి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారని తెలిపింది. పరిస్థితి ఆందోళనగా ఉండడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా మెడ నరాలు తెగిపోవడంతో పాటు చిన్న మెదడు దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారన్నారు. జరిగిన అన్యాయంపై మంగళవారం కోటవురట్లలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ స్పందించలేదని, కేసు పెడితే ఆ ఇద్దరు ఏమైనా చేసుకుంటే బాధ్యత మీదేనని నిందితుల తరఫున మాట్లాడుతూ బెదిరించారన్నారు. మొదటి నుంచి గోపి, సునీల్ తమ రెండో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలను అసభ్యంగా తయారు చేసి వాట్సప్‌లో పెడతామని బెదిరించేవారని, ప్రతీసారీ రూ.1000, రూ.2 వేలు తెమ్మని డిమాండ్ చేసేవారని చెప్పింది. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని తెలిపింది. ఈ విషయాన్ని నిలదీసినందుకే తన మూడో కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. కఠినంగా శిక్షించాలి ఆ యువకులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎస్ఐ మధుసూదనరావును సస్పెండ్ చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమాచారం తెలుసుకున్న ఐద్వా సభ్యులు గురువారం విశాఖలో బాధితురాలిని పరామర్శించారు. శుక్రవారం బి.కె.పల్లి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను బ్లాక్మెయిల్ చేస్తూ వేధించిన పైల గోపి, పైల సునీల్‌లను తక్షణం అరెస్టు చేసి, విచారించాలన్నారు. హత్యచేసుందుకు యత్నించిడంతో బాధితురాలు కోలుకోలేని స్థితిలో కేజీహెచ్‌లో వైద్యం పొందుతోందని చెప్పారు. కేజీహెచ్‌లో వైద్యం చేస్తే ఆమె పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించాలన్నారు. వైద్యానికి రోజుకు రూ.45 వేలు వరకు ఖర్చు అవుతుందని, 90 రోజుల పాటు వైద్యం అందించాలని, ఇందుకు రూ.90 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మద్దతుగా జన విజ్ఞాన వేదిక నక్కపల్లి మండల కన్వీనర్ బి.రాము, సీపీఎం మండల కన్వీనర్ జి.డేవిడ్ నిలిచారు. గ్రామంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దీనిపై ఎస్ఐ మధుసూదనరావును వివరణ కోరగా తాను ఇటీవల కోటవురట్ల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నానని, మండలంపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. ఓ బాలికకు అన్యాయం జరిగితే నిందితులను కాపాడే నీచమైన వ్యక్తిత్వం తనది కాదన్నారు. బాధితురాలు నోరు విప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని, పైల గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధితురాలికి వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడినట్టు తెలిపారు. -
టీడీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు పెరిగిపోయాయి
-
పవన్ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి
-
నక్కపల్లి వద్ద రోడ్డుప్రమాదం
నక్కపల్లి(పాయకరావుపేట) : జాతీయరహదారిపై నక్కపల్లి సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని తిరుగుప్రయాణంలో ఇంటివెళ్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. ఎస్ఐ సింహాచలం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన బొక్కు సత్యం కుటుంబ సభ్యులు గురువారం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును నక్కపల్లి సమీపంలో వెనుకనుంచి వస్తున్న కోళ్లవ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్యం, అతని భార్య పార్వతి,కొడుకు ఎల్లం నాయుడు, కోడలు అన్నపూర్ణ, మనుమలు రాకేష్,లోకేష్ కారుడ్రైవర్ ఆదినారాయణ గాయపడ్డారు. వీరిని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.వీరిలో ఎల్లంనాయుడు, పార్వతి, అన్నపూర్ణలకు తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.లత -
పెళ్లింట పెను విషాదం
పాయకరావుపేట : పెళ్లి సంబరాలతో ఆనందోత్సాహాలు వెల్లివిరియాల్సిన ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. పెళ్లి రాట వేసేందుకు కొమ్మను తీసుకొచ్చేందుకు చెట్టు ఎక్కిన పెళ్లికుమారుడు తండ్రి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలో అరట్లకోట గ్రామానికి చెందిన దేవరకొండ అప్పారావు (60)కు ముగ్గురు కొడుకులు. వీరిలో ఇద్దరికి వివాహాలు చేశాడు. చివరి కొడుక్కి కూడా వివాహం నిశ్చయమైంది. ఈ నెల 27న పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టారు. గురువారం ఇంట్లో పెళ్లిరాట వేయడానికి నిర్ణయించారు. రాట వేసేందుకు అవసరమైన నేరేడు కొమ్మను తెచ్చేందుకు ఉదయం గ్రామంలో చెట్టు ఎక్కి, కొమ్మనరికి దిగబోతున్న సమయంలో కాలు జారి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో కుటుంబ సభ్యులు తుని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పారావు రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని పెద్ద కోడలు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తనను ఒక ఇంటివాడిని చేయడం కోసం తపనపడుతున్న తండ్రి కళ్లముందే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పెళ్లికొడుకు చిన్ని కన్నీరుమున్నీరుగా విలపించాడు. అప్పారావు భార్య నాగలక్ష్మి రోదన వర్ణనాతీతం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీసీ నాయకులు చిక్కాల రామారావు, దగ్గుపల్లి సాయి పరామర్శించారు. -
నలుగురు సభ్యులతో వైఎస్ఆర్సీపీ సమన్వయ కమిటీ
విశాఖపట్నం: విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో వైఎస్ఆర్సీపీ సమన్మయ కమిటీని నియమించింది. చంగల వెంకట్రావు, గొల్ల బాబురావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణలను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ కేంద్రకార్యలయం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. విశాఖ పట్నంకు చెందిన బొడ్డేడ ప్రసాద్‌ను యలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయ కర్తగా నియమించారు.