సాక్షి, గన్నవరం : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నకిలీ ఇళ్ల పట్టాలు పంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికను రద్దుచేయాలని బాపులపాడు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దుట్టా శివనారాయణ డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం పార్టీ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యురు గ్రామాల్లో మండల రెవిన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు ప్రజలను మోసం చేసిన వంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గన్నవరం మండల కన్వినర్ తులిమిల్లి ఝాన్సీలక్ష్మీ మాట్లాడుతూ నకిలీ పట్టాల పంపిణీపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా సహకరించ లేదని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళ్లామని, విచారించి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. వల్లభనేని వంశీ నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment