Gannavaram TDP MLA
-
‘ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలి’
సాక్షి, గన్నవరం : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నకిలీ ఇళ్ల పట్టాలు పంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికను రద్దుచేయాలని బాపులపాడు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దుట్టా శివనారాయణ డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం పార్టీ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యురు గ్రామాల్లో మండల రెవిన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు ప్రజలను మోసం చేసిన వంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గన్నవరం మండల కన్వినర్ తులిమిల్లి ఝాన్సీలక్ష్మీ మాట్లాడుతూ నకిలీ పట్టాల పంపిణీపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా సహకరించ లేదని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళ్లామని, విచారించి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. వల్లభనేని వంశీ నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైన విషయం తెలిసిందే. చదవండి: గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు -
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా జిల్లా : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేతో వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైంది. బాపుల పాడు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా వంశీ, ఆయన అనుచరులు కలిసి పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చినట్టు నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తహసీల్దార్ తెలిపారు. -
గన్‌మెన్‌ను సరెండర్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంశీ
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గన్‌మెన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. టు ప్లస్ టు గన్మెన్లు కావాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని కోరారు అయితే ఏపీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తనకు అదనంగా సెక్యూరిటీ ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తనకు కేటాయించిన గన్‌మెన్‌ను వెనక్కి తిప్పి పంపించివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ ...‘నా గన్‌మెన్‌కు కేవలం ఒక పిస్టల్ ఇచ్చారు. కనీసం కార్బన్ వెపన్ కూడా ఇవ్వలేదు. మూడున్నరేళ్ల నుంచి భద్రతను పెంచమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. నా లైసెన్స్డ్ ఆయుధాలు మూడింటిని రెన్యువల్ కోసం పోలీస్ స్టేషన్లో అప్పగించా. కనీసం వాటిని కూడా తిరిగి ఇవ్వలేదు’ అని అన్నారు.